NRI-NRT

పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో 23వ తానా మహాసభలు

పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో 23వ తానా మహాసభలు

23వ తానా మహాసభలు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో 2023 జులై 7వ తేదీనుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ప్రకటించారు. తానా సైట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అనిల్ యలమంచిలి, సభ్యులు పూర్ణ వీరపనేని, రామ్ మద్ది బృందం తానా మహాసభల వేదిక కోసం అట్లాంటాతో పాటు పలు నగరాలలోని కన్వెన్షన్ సెంటర్స్ తో చర్చించిన తర్వాత ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ ను 2023 తానా మహాసభల వేదికగా సిఫార్సు చేయడం జరిగిందని తానా సైట్ సెలక్షన్ కమిటీ సిఫార్సు కు తానా కార్యవర్గం, బోర్డు ఆమోదం తెలిపిందని అంజయ్య చౌదరి తెలిపారు.

తానా మహాసభల కోఆర్డినేటర్ గా రవి పొట్లూరిని నియమించినట్లు తెలిపారు. తానాలో రీజినల్ కోఆర్డినేటర్ నుంచి కార్యదర్శి వరకు పలు పదవులు నిర్వహించి, తానా కార్యక్రమాల నిర్వహణలో విశేష అనుభవమున్నరవి పొట్లూరి కోఆర్డినేటర్‌గా తానా సభ్యులు, నాయకత్వం, దాతల సహకారంతో 23వ తానా మహాసభలు అంగరంగ వైభవంగా జరుపునున్నట్లు అంజయ్య చౌదరి వెల్లడించారు. తానా కోఆర్డినేటర్ గా నియమించినందుకు అధ్యక్షులు అంజయ్య చౌదరికి తానా కార్యవర్గానికి తానా మహాసభల కోఆర్డినేటర్ రవి పొట్లూరి కృతజ్ఞతలు తెలిపారు.