వరల్డ్ క్రికెట్‌లో ఇండియాకు ఘనతను తీసుకువచ్చిన క్షణాలకు 39 ఏళ్లు నిండాయి. కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా వన్డే వరల్డ్ కప్ టైటిల్‌ను ఎగురేసుకుపోయి నేటితో 39 ఏళ్లు. ఏమాత్రం ఆశలు లేని జట్టుగా టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ నాటి జట్టు.. అనూహ్య రీతిలో దిగ్గజాలను ఓడించి 1983 వరల్డ్ కప్ ట్రోఫీని చేజిక్కించుకున్నది. కపిల్ దేవ్ తన నాయకత్వంతో భారత క్రికెట్ ప్రేమికులకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్లో అలనాటి మేటి జట్టు వెస్టిండీస్‌ను ఓడించడం అది మరిచిపోలేని క్షణమే. చాలా తక్కువ టార్గెట్‌ను ఇండియన్ బౌలర్లు డిఫెండ్ చేసిన తీరు అనిర్వచనీయం. ఇక లార్డ్స్ బాల్కనీలో వరల్డ్ కప్ ట్రోఫీని కపిల్ దేవ్ అందుకున్న ఆ క్షణాలను ఎవరూ మరిచిపోలేరు. ఇండియా తొలి వరల్డ్ కప్ గెలిచిన 39 ఏళ్లు గడిచిన సందర్భంగా ఐసీసీ తన ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టింది. కపిల్ నాయకత్వంలో ఇండియా వండర్ చేసినట్లు చెప్పింది.