Devotional

జూన్ 27న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

Auto Draft

సెప్టెంబరు నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను జూన్ 27వ తేదీ సోమవారం సాయంత్రం 4:00 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.కాగా, క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్ల‌ను ముందు వ‌చ్చిన వారికి ముందు అనే ప్రాతిప‌దిక‌న‌ భ‌క్తులు నేరుగా బుక్ చేసుకోవ‌చ్చు.సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్ట‌ద‌ళ‌పాద‌ ప‌ద్మారాధ‌న‌ టికెట్ల‌ను ఆన్‌లైన్ ఎల‌క్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తారు. ఈ సేవ‌ల‌ను బుక్ చేసుకునేందుకు జూన్ 27వ తేదీ ఉద‌యం 10:00 గంట‌ల‌ నుండి జూన్ 29వ తేదీ ఉద‌యం 10:00 గంట‌ల వ‌ర‌కు గృహ‌స్తులు ఆన్‌లైన్‌లో న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ఎల‌క్ట్రానిక్ డిప్ విధానంలో గృహ‌స్తుల‌కు టికెట్ల కేటాయింపు జ‌రుగుతుంది.టికెట్లు పొందిన‌వారి జాబితాను జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 12:00 గంట‌ల త‌రువాత వెబ్‌సైట్‌లో పొందుప‌రుస్తారు. అదేవిధంగా గృహ‌స్తుల‌కు ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా తెలియ‌జేస్తారు. టికెట్లు పొందిన గృహ‌స్తులు రెండు రోజుల్లోపు టికెట్ ధ‌ర చెల్లించాల్సి ఉంటుంది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఈ సేవా టికెట్ల‌ను బుక్ చేసుకోవాల్సిందిగా కోర‌డ‌మైన‌ది.