NRI-NRT

న్యూజెర్సీలో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

న్యూజెర్సీలో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

ప్రవాస తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో శనివారం రాత్రి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  NRI తేదేపా అమెరికా కన్వీనర్ కోమటి జయరాం ఈ ఉత్సవానికి అధ్యక్షత వహించారు. తెదేపా సీనియర్ నేత రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఏపీలో రాక్షస పాలన జరుగుతోందని,  దీనిని  నిర్మూలించడంలో ప్రవాసాంధ్రులు  చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. తెలుగు జాతి చరిత్ర  ఉన్నంతకాలం  ఎన్టీఆర్, మీరు చిరస్థాయిగా ఉంటుందని  అన్నారు. ఏపీ అసెంబ్లీ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఏపీలో పరిపాలన గురించి  హేళనగా, జాలిగా మాట్లాడుకుంటున్నారని. ఒకప్పుడు అగ్ర భాగాన ఉన్న రాష్ట్రాన్ని ప్రస్తుత ప్రభుత్వం  అదోగతి  పాలు  చేసిందని  అన్నారు. ప్రముఖ రంగస్థల నటుడు తెదేపా నేత గుమ్మడి గోపాలకృష్ణ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గన్ని కృష్ణ, గుంటూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, ఎన్నారై తేదేపా నేతలు నల్లమల రాధా, విద్యా గారపాటి, వంశీ వెనిగళ్ళ ప్రసంగించారు.  అంతకుముందు ఎన్టీఆర్  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోమటి జయరాం మాట్లాడుతూ అమెరికాలో  ప్రతి నెల ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహిస్తామని  తదుపరి మహానాడు డెట్రాయిట్లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
IMG-20220626-WA0027
IMG-20220626-WA0028
IMG-20220626-WA0029
IMG-20220626-WA0030
IMG-20220626-WA0031
IMG-20220626-WA0032