NRI-NRT

అమెరికా వెళ్లే విద్యార్థులకు తీపి కబురు

అమెరికా వెళ్లే విద్యార్థులకు తీపి కబురు

ఉన్నత విద్య కోసం అగ్రరాజ్యం అమెరికా వెళ్లే విద్యార్థులకు హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ తీపి కబురు చెప్పింది. I-20 దరఖాస్తు దాఖలు చేసిన అభ్యర్థులు ఇంటర్వ్యూల కోసం స్లాట్ బుక్ చేసుకోవాలని వెల్లడించింది. అలాగే వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఆగస్టు 14 నుంచి స్లాట్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. F, M, J కేటగిరీల కింద స్లాట్స్ కోసం వేచిచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇక ప్రతియేట భారత్‌ నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కోసం యూఎస్ వెళ్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది విద్యార్థులు అమెరికా వెళ్లారు. అయితే విద్యార్ధులందరూ పైన పేర్కొన్న ఐ-20 ఫారమ్‌ను అమెరికన్‌ యూనివర్సిటీస్‌ నుంచి పొందారు. యూనివర్సిటీతో పాటు అమెరికా ప్రభుత్వ అనుమతి తప్పని సరి. ఇందుకోసం భారత్‌లో ఉన్న యూఎస్‌ ఎంబసీ విద్యార్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఆ ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

కానీ ఆ ఇంటర్వ్యూలను నిర్వహించలేదు. అందుకే భారత విదేశాంగ శాఖ యూఎస్‌తో చర్చలు జరిపి..భారతీయ విద్యార్ధులకు వీసాలు మంజూరు చేయాలని కోరింది. భారత్‌ కోరిక మేరకు 2022 జూన్​- జులై కావాల్సిన ఇంటర్వ్యూ స్లాట్లను మే నెలలో ఓపెన్​ చేసింది. తాజాగా..మరో సారి ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా..త్వరలో యూఎస్‌ ఎంబసీ, కాన్సలేట్‌ కార్యాలయాల్లో విద్యార్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. ఐ-20 డాక్యుమెంట్లు ఉంటే ఆలస్యం చేయకుండా మేం నిర్వహించే ఇంటర్వ్యూల కోసం స్లాట్‌లు బుక్‌ చేసుకోండి. విద్యార్ధులు పొందాల్సిన ఎఫ్​, ఎం, జే వీసాల కోసం ఆగస్టు14 తర్వాత ఇంటర్వ్యూలు జరగుతాయి,” అని ఇండియాలోని అమెరికా రాయబార కార్యాలయం చేసిన ట్వీట్‌లో పేర్కొంది.