*ద్రంలోని బిజెపి సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. దేశంలో బై బై మోదీ అని ట్రెండింగ్ అవుతోందన్నారు. బిజెపి ప్రభుత్వాలను కూల్చే పనిలో పడిందని,ఈడీని ఉసి గొల్పడం మీద దృష్టిపెట్టారు.వారికి తగిన శాస్తి జరుగుతుందన్నారు.దేశంలో 2 కోట్ల ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసగించారని ఆయన విమర్శించారు.మోదీకి హటావో.. భారత్కు బచావో నినాదం మొదలైందని చెప్పారు.పాలమూరుకు జాతీయహోదా ఇస్తారా?బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతారా?బీజేపీ కార్యవర్గ భేటీల్లో దీనిపై సూటిగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.బండి సంజయ్ హుందాగా మాట్లాడాలని బాల్క సుమన్ హితవు పలికారు.
* 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి Harish Rao
Siddipet జిల్లా పట్టణంలో బీసీ స్టడీ సర్కిల్ లో ఉచిత కానిస్టేబుల్ శిక్షణ పొందిన విద్యార్థులకు మంత్రి హరీష్ రావు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ విశ్వాసంతో చదివి పేరు తెచ్చుకుని, మంచి ఉద్యోగం పొందాలని కోరుకుంటున్నానన్నారు. బీసీ స్టడీ సర్కిల్ వచ్చాక ఇది 4వ బ్యాచ్ అని, 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో 95 వేల ఉద్యోగాలు ఇస్తామని, అన్ని నోటిఫికేషన్‌లు ఒక్కసారిగా ఇస్తే ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి దశల వారిగా ఇస్తామన్నారు. ఈ ఏడాది ఉద్యోగాల సంవత్సరంగా మారనుందన్నారు. వచ్చే ఏడాది ఎంత మంది రిటైర్డ్ అయితే మళ్ళీ అంత మందికి జాబ్ నోటిఫికేషన్ వేసి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కేంద్రం పరిధిలో దాదాపు 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా మూడేళ్ల నుంచి కేంద్రం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు కంప్యూటర్ కోచింగ్ ఇప్పిస్తామన్నారు. విద్యార్థులు మొబైల్, సినిమాలు, టీవీలు వదిలి చదువుపై దృష్టి పెట్టి తల్లిదండ్రులు కోరికను, మీ గోల్‌కు చేరాలని మంత్రి హరీష్ రావు సూచించారు.
* అంకిత భావంతో పనిచేసే వారందరినీ పార్టీ గుర్తిస్తుంది:Errabelli
వ్యవసాయ మార్కెట్నూ తన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. ఛైర్మన్ గా కమ్మగాని స్వామి రాయుడు, ఇతర సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ ఇల్లంద మార్కెట్ నూతన పాలకవర్గంగా ప్రమాణ స్వీకారం చేసిన వారంతా కష్టపడి తమకిచ్చిన డిపార్ట్ మెంట్ పురోగతికి పని చేయాలని సూచించారు. బిజెపి,కాంగ్రెస్ ల పై మంత్రి ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు.మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ఎంతో మంది పని చేశారు కానీ, మార్కెట్ కోసం కొత్త కమిటీ పని చేయాలి. రైతుల కోసం ఎన్ని విధాల సహాయం కావాలంటే అన్ని విధాలా చేయూతనిస్తామని అన్నారు.కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వం లో రైతులకు ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలి.రైతుల కోసం పని చేసిన నాయకులు ఇద్దరే ఇద్దరు ఒకరు ఎన్టీఆర్ ,ఇంకొకరు కేసీఆర్ఎన్టీఆర్ రైతుల మాఫీ చేసి మహిళలకు రుణాలు, 2 రూ.లకే కిలో బియ్యం అందించారు.ఇప్పుడు కేసీఆర్ కూడా రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.దేశంలో రాష్ట్రం మొత్తానికి తాగు, సాగు నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామని చెప్పారు.
*అర్హులకు Pensions మంజూరు చేస్తే దాడులు చేస్తారా?: Gonuguntla
దివ్యాంగులపై వైసీపీ అధికార దురహంకారం ప్రదర్శించడం సరికాదని గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగి దివ్యాంగ వాసుదేవరావుపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. అర్హులకు పెన్షన్లు మంజూరు చేస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా ఘటనపై ప్రభుత్వం స్పందించాలని, దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మద్యం మత్తులో దాడి చేసిన వారిని కాపాడుతారా?.. దాడి చేసిన గున్నయ్యపై చర్యలు తీసుకోకుంటే తాడేపల్లి ని ముట్టడిస్తామని గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు.
*Amaravathiపై మోసపు రెడ్డి కుట్రలకు అంతే లేదు: Lokesh
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అమరావతిపై మోసపు రెడ్డి కుట్రలకు అంతే లేదని అన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి భూకంపం ప్రమాదం, ముంపు ముప్పు ఉందని ప్రచారం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక అమరావతిని శ్మశానం అన్నారు.. నేడు ఎకరం రూ. 10 కోట్లకు అమ్మకానికి పెట్టారు.. అమ్మ లాంటి అమరావతిపై జగన్ కుట్రలకు అంతే లేదని మరోసారి నారా లోకేష్ విమర్శించారు.
*వ్యవసాయ సదస్సులతో మారనున్న సాగు దశ-దిశ:Niranjan reddy
తెలంగాణలో రైతులకు అవసరమైన సలహాలు,సూచనలతో కూడిన సదస్సులతో వ్యవసాయ రంగం దశ-దిశ మారుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులుకూడా పంటల వైవిద్దీకరణకు మొగ్గు చూపుతున్నారని అన్నారు.సాగునీటి రాకతో తెలంగాణలో వరిసాగు అనూహ్యంగా పెరిగిందని మంత్రి తెలిపారు.రాష్ట్రంలో వ్యవసాయ సదస్సుల విజయవంతానికి సహకరించిన అందరికీ మంత్రి ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. అవసరానికి మించిన వరి సాగు వల్ల కలిగే దుష్పరిణామాలను గమనించి దేశంలో తొలిసారి వ్యవసాయ సదస్సులు నిర్వహించినట్టు మంత్రి తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు మూలంగా సాగునీటి రాకతో2014 నాటికి సాగు విస్తీర్ణం కోటీ 34 లక్షల ఎకరాలు నుండి 2 కోట్ల 3 లక్షల ఎకరాలకు సాగు పెరిగిందన్నారు.2014 నాటికి 45 లక్షల టన్నులు ఉన్న ధాన్యం ఉత్పత్తి 3 కోట్ల టన్నులకు చేరిందన్నారు. రూ.లక్షన్నర కోట్లతో సాగు నీటి ప్రాజెక్టులు, రూ.28,473 కోట్లు వెచ్చించి వ్యవసాయ విద్యుత్ మౌళిక సదుపాయాలు, ఏటా దాదాపు రూ.10,500 కోట్లు భరిస్తూ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు అందిస్తున్నామని తెలిపారు.రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇప్పటి వరకు రూ.50,447.33 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేశామన్నారు. 28వ తేదీ నుండి రైతుల ఖాతాలలో తొమ్మిదో విడత రైతుబంధు నిధులు జమకానున్నాయని చెప్పారు. రైతుభీమా పథకం ద్వారా ఇప్పటివరకు 83,118 మంది రైతు కుటుంబాలకు రూ.4150.90 కోట్లు పరిహారం అందజేశామన్నారు.
సీజన్ కు ముందే ఏ పంటలు వేయాలో, రైతులకు సూచించడానికి దేశంలోనే తొలిసారి మార్కెట్ రీసర్చ్ & అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు.ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంలో భాగంగా 20 లక్షల ఎకరాలలో సాగు లక్ష్యంగా ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంపు కొనసాగుతున్నదని చెప్పారు.వరికి ప్రత్యామ్నాయంగా పత్తి సాగుతో పాటు పప్పు, నూనెగింజల సాగుకు ప్రోత్సాహం. దులు, వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పప్పుశెనగ, పొద్దుతిరుగుడు, మినుములు, పెసలు సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందని తెలిపారు.
*బీజేపీకి కౌంట్ డౌన్ మొదలైంది: బాల్క సుమన్
కేంద్రంలోని బిజెపి సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. దేశంలో బై బై మోదీ అని ట్రెండింగ్ అవుతోందన్నారు. బిజెపి ప్రభుత్వాలను కూల్చే పనిలో పడిందని,ఈడీని ఉసి గొల్పడం మీద దృష్టిపెట్టారు.వారికి తగిన శాస్తి జరుగుతుందన్నారు.దేశంలో 2 కోట్ల ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసగించారని ఆయన విమర్శించారు.మోదీకి హటావో.. భారత్కు బచావో నినాదం మొదలైందని చెప్పారు.పాలమూరుకు జాతీయహోదా ఇస్తారా?బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతారా?బీజేపీ కార్యవర్గ భేటీల్లో దీనిపై సూటిగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.బండి సంజయ్ హుందాగా మాట్లాడాలని బాల్క సుమన్ హితవు పలికారు.
*ప్రధాని సభతో తెలంగాణలో చరిత్ర సృష్టిస్తాం:Bandi sanjay
తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభతో రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తామని బిజెపి రాష్ట్ర చీఫ్ బండిసంజయ్ అన్నారు. మోదీ సభకు కేసీఆర్ సర్కార్(kcr govt) అడ్డంకులు సృష్టిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.తెలంగాణపై బీజేపీ పాలసీని ప్రధాని ప్రకటించబోతున్నారని అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన బండిసంజయ్ బీజేపీ కట్టడికి కేసీఆర్ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు.తెలంగాణలో పేదలు జీవించలేని పరిస్థితిని కేసీఆర్ కల్పించారని అన్నారు.
*మోదీ, కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనపై చర్చకు బీజేపీ సిద్ధం:Tarun chug
గడిచిన ఎనిమిదేళ్లలో ప్రధాన మంత్రి మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై చర్చకు బీజేపీ సిద్దంగా వుందని తెలంగాణ బిజెపి ఇన్ చార్జి తరుణ్ చుగ్ పేర్కొన్నారు. మోదీ సభ తెలంగాణ రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్ కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను సీఎం కేసీఆర్ మోసం చేశారని, దళితులకు మూడెకరాలు, కేజీ టూ పీజీ ఉచిత విద్య ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో జంతర్ మంతర్ తాంత్రిక్ సర్కార్ నడుస్తోందని తరుణ్‌చుగ్ ఎద్దేవా చేశారు.కేసీఆర్ సర్కార్‌కు ప్రజలు గుడ్‌బై చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన అన్నారు.
*జూన్ 25న బ్లాక్ డే.. ప్రతిపక్షాల గొంతు నొక్కిన దుర్దినం: Raghunandan
జూన్(June) 25న బ్లాక్ డే అని.. ప్రతిపక్షాల గొంతు నొక్కిన దుర్దినమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. నేడు తమ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నిర్బంధాల మధ్య దిన పత్రికలు నడిపిన చీకటి రోజుల ని.. 21 నెలల ఎమర్జెన్సీని పారద్రోలి మళ్ళీ ప్రజాస్వామ్యా న్ని పునరుద్ధరించామన్నారు. నాటి నిర్బంధం ఎలా ఉందో ఈ రోజు తెలంగాణ లో అదే పరిస్థితి ఉందన్నారు. ఒక గిరిజనురాలిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినా ఇప్పటివరకూ కేసీఆర్ నోరు మెదపలేదన్నారు. నాడు ఇందిరాగాంధీ ఎలాగైతే ప్రజామ్యం గొంతు నులిమి, నియంత పాలన సాగించాలని కోరుకుందో.. నేడు రాష్ట్రంలో అదే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణలో నేడు నిర్బంధాలు, ఒత్తిళ్లు, పోలీస్ పాలన తప్ప మరేమీ లేదన్నారు. తెలంగాణోద్యమంలో ప్రాణ త్యాగాలు చేసిన వారికి, పోరాటాలు చేసిన వారికి ఎలాంటి గుర్తింపు లేదన్నారు. తమ కుటుంబ పాలన సాగించాలనే దుర్మార్గపు ఆలోచనతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారన్నారు. వీరి దుర్మార్గపు పాలన ఇంకా ఎంతో కాలం కొనసాగదని రఘునందన్ పేర్కొన్నారు.
*అంబేడ్కర్ వారసుడు మోదీయే: బండి సంజయ్
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వారసుడు ప్రధాని మోదీయే నని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు బీజేపీ ఎస్టీ మోర్చా నాయకులు ప్రధాని మోదీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ణతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యక్ష ఓటు ద్వారా భాగస్వామ్యం కాబోతున్న సంజయ్‌కి శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్ తదితరులు సన్మానం చేశారు. 3న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభకు ఆదివాసీ జాతి మొత్తం కదిలి రావాలని సంజయ్ పిలుపునిచ్చారు.
*నిర్మాణంలోని కష్టాన్ని ఇప్పటికైనా తెలుసుకోండి: చంద్రబాబు
తన సైకో పాలన ఎలా ఉండబోతోందో సీఎం జగన్‌రెడ్డి ప్రజా వేదిక కూల్చివేతతో ప్రజలకు చూపించారని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజా వేదిక కూల్చివేతకు మూడేళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ుూకూల్చడం తప్ప కట్టడం జగన్‌కు చేతకాదు. చేసినవన్నీ కూల్చివేతలే. రాష్ట్ర అభివృద్ధిని కూల్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూల్చారు. ప్రజల జీవితాలను కూల్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను, ప్రజల హక్కులను, దళితుల గూడును, యువత భవితనూ కూల్చారు. ప్రజా రాజధాని అమరావతిని, పోలవరం కలను కూల్చి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. ప్రజా వేదిక కూల్చివేతతో జగన్‌కు వికృతానందం మిగలడం తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యం. గత ప్రభుత్వం కట్టిన నిర్మాణాల్లో కూర్చుని పనిచేయడం తప్ప కొత్తగా కట్టిందేమీ లేదు. తన వల్ల ఏమీ కాదని… తనకు ఏమీ రాదని ఆయనకు ఆయనే నిరూపించుకొన్నారు. కూల్చడం కంటే నిర్మించడం ఎంత కష్టమైన పనో మూడేళ్ల పాలన తర్వాత అయినా జగన్ తెలుసుకోవాలి్‌్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
*ప్రజా వేదికను పునర్ణిర్మిస్తాం: బుద్దా వెంకన్న
ప్రజా వేదిక దగ్గరకు బయలుదేరిన టీడీపీ నేత బుద్దా వెంకన్నను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన జగన్ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రజా వేదికను తిరిగి నిర్మిస్తామని చెప్పారు. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు‘‘ప్రజా వేదిక కూల్చి నేటికి మూడేళ్లు అయ్యింది. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం పని చేశారు. ప్రజా వేదిక కూల్చివేతతో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం ప్రారంభించాడు. రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ నిర్మాణం కూడా జరగలేదు. ప్రజా వేదిక సాక్షిగా మా నిరసన తెలపడానికి వెళితే పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు నివాసం వైపు ఎవ్వరిని వెళ్లకుండా దిగ్భంధనం చేశారు. పోలీసులను చట్టపరంగా వారిపనిని వారు చేయనీయడం లేదు. వైసీపీ నేతలు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఎండెనక, వాననక రోడ్ల పై పోలీసులు పడిగాపులు పడుతున్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం. ప్రజా వేదికను పునర్నిర్మాణం చేస్తాం.’’ అని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై ప్రజా వేదికను నిర్మించారు. చంద్రబాబు ఇంటి పక్కనే ముఖ్యమంత్రి అధికారిక కార్యకలాపాలు, కలెక్టర్ల సమావేశాల కోసం దీని నిర్మాణం జరిగింది. ఇదే ప్రజావేదికలో సీఎం జగన్ చివరి సారిగా కలెక్టర్ల సమావేశం నిర్వహించి.. ఐఏఎస్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నిర్వాకం వల్లే ఇలాంటి నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సమావేశం ముగియగానే ప్రజావేదిక కూల్చివేతకు అక్కడే ఆదేశాలు ఇచ్చారు.
*బుగ్గన వాస్తవాలు మాని…పిట్టకథలు చెబుతున్నారు: Yanamala
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాస్తవాలు చెప్పడం మాని పిట్టకథలు చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడతూ… కాగ్, కేంద్ర ఆర్ధిక శాఖ అడిగిన ప్రశ్నాపత్రానికి సమాధానం చెప్పలేక అబద్దాలను వల్లెవేస్తున్నారన్నారు. కోవిడ్‌తో రాష్ట్రానికి ఆదాయం తగ్గిందనే బుగ్గన మాట పచ్చి అబద్దమన్నారు. 2018-19లో పన్నులపై ఆదాయం రూ.56 వేల కోట్లు ఉంటే 2021-22 రూ.73 వేల కోట్లు వచ్చిందని తెలిపారు. కేంద్ర గ్రాంట్లు 18-19 లో రూ.19 వేల కోట్లు ఉంటే 2021-22 లో రూ.43 వేల కోట్లకు చేరాయని చెప్పుకొచ్చారు. తక్కువ మొత్తాలపై శాతం కట్టి వైసీసీ చేసిన అప్పులు తక్కువని చెబుతున్నారని, ఈ రకమైన పరిగణన బహుశా ఆర్థికవేత్తలు ఎవరూ చూసి ఉండరన్నారు. వైసీపీ ప్రభుత్వంత రాబోయే తరాలపైన నిప్పుల కుంపటి లాంటి అప్పులను మూటకట్టి పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగ్‌పై, వ్యవస్థలపై తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. సాక్ష్యాత్తు కాగ్ సంస్థ వైసీపీ ఆర్ధిక నిర్వహణపై విశ్వాసం లేదని చేసిన ఖర్చులను సర్టిఫై చేయమని విస్పష్టంగా చెప్పిందన్నారు. బహుశా భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వంపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. కాగ్, కేంద్ర ఆర్థికశాఖ, హైకోర్టులు, సుప్రీంకోర్టులు, సీబీఐ ఇంతవరకూ వైసీపీ ప్రభుత్వ తీరు సమర్థనీయమని ఎక్కడా ఎప్పుడూ సర్టిఫికెట్ ఇవ్వలేదని తెలిపారు. ప్రజలు తమ పాలనపై ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకుని మాట్లాడితే సమంజసంగా ఉంటుందని హితవుపలికారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్వాలిఫైడ్ ఓపినీయన్ పేరుతో వైసీపీ ప్రభుత్వంపై కాగ్ చేసిన వ్యాఖ్యలు బుగ్గన గుర్తుకు తెచ్చుకోవాలని యనమల రామకృష్ణుడు అన్నారు.
*మరి కేసీఆర్ ఎందుకు ప్రకటించడం లేదు?: Bandi Sanjay
జీవో 317 విడుదలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ‘‘చదువు చెప్పే సర్కారీ టీచర్లు ఇకపై ఏటా ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని, ఇకపై ఆస్తులు అమ్మాలన్నా… కొనాలన్నా ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చెప్పడం వేధింపుల్లో భాగమే. ఉద్యోగులకు జీతాలే సక్రమంగా చెల్లించకుండా… ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించని కేసీఆర్ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం హస్యాస్పదం. కేసీఆర్ సీఎం కాకముందు ఆయన ఆస్తులెన్ని? ఆ తరువాత కూడబెట్టిన ఆస్తులెన్ని? ఆ వివరాలను ఏటా ఎందుకు విడుదల చేయడం లేదు? ఇకపై సీఎం సహా ఆయన కుటుంబ సభ్యులంతా ఏటా ఆస్తుల వివరాలు బయటపెట్టాలి. కేసీఆర్ కేబినెట్‌లోని మంత్రుల ఆస్తులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమ ఆస్తుల వివరాలను బయటపెట్టాలి.’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
*ప్రజా వేదికను పునర్ణిర్మిస్తాం: బుద్దా వెంకన్న
ప్రజా వేదిక దగ్గరకు బయలుదేరిన టీడీపీ నేత బుద్దా వెంకన్నను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన జగన్ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రజా వేదికను తిరిగి నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు.‘‘ప్రజా వేదిక కూల్చి నేటికి మూడేళ్లు అయ్యింది. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం పని చేశారు. ప్రజా వేదిక కూల్చివేతతో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం ప్రారంభించాడు. రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ నిర్మాణం కూడా జరగలేదు. ప్రజా వేదిక సాక్షిగా మా నిరసన తెలపడానికి వెళితే పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు నివాసం వైపు ఎవ్వరిని వెళ్లకుండా దిగ్భంధనం చేశారు. పోలీసులను చట్టపరంగా వారిపనిని వారు చేయనీయడం లేదు. వైసీపీ నేతలు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఎండెనక, వాననక రోడ్ల పై పోలీసులు పడిగాపులు పడుతున్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం. ప్రజా వేదికను పునర్నిర్మాణం చేస్తాం.’’ అని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై ప్రజా వేదికను నిర్మించారు. చంద్రబాబు ఇంటి పక్కనే ముఖ్యమంత్రి అధికారిక కార్యకలాపాలు, కలెక్టర్ల సమావేశాల కోసం దీని నిర్మాణం జరిగింది. ఇదే ప్రజావేదికలో సీఎం జగన్ చివరి సారిగా కలెక్టర్ల సమావేశం నిర్వహించి.. ఐఏఎస్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నిర్వాకం వల్లే ఇలాంటి నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సమావేశం ముగియగానే ప్రజావేదిక కూల్చివేతకు అక్కడే ఆదేశాలు ఇచ్చారు.
*సంక్షేమంపై 15 రోజుల్లో శ్వేతపత్రం: మంత్రి బొత్స
నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యేకు రూ.2 కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన జీవో త్వరలో విడుదల కానుందని స్పష్టం చేశారు. మరో రూ.5 కోట్లను జిల్లా స్థాయిలో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం కేటాయించనున్నట్లు తెలిపారు. విజయనగరం కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై 15 రోజుల్లో శ్వేత పత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలే విడుదల చేస్తారని చెప్పారు. ఈ 15 రోజుల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గణాంకాలను క్రోడీకరించాలని ఎమ్మెల్యేలకు మంత్రి సూచించారు. ప్రభుత్వం కూడా తమ వద్ద ఉన్న పూర్తి వివరాలతో నియోజకవర్గాల వారీగా శ్వేత పత్రాలు సిద్ధం చేసి ప్రజల ముంగిట ఉంచుతుందని బొత్స తెలిపారు.
*నిర్మాణంలోని కష్టాన్ని ఇప్పటికైనా తెలుసుకోండి: చంద్రబాబు
తన సైకో పాలన ఎలా ఉండబోతోందో సీఎం జగన్‌రెడ్డి ప్రజా వేదిక కూల్చివేతతో ప్రజలకు చూపించారని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజా వేదిక కూల్చివేతకు మూడేళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ుూకూల్చడం తప్ప కట్టడం జగన్‌కు చేతకాదు. చేసినవన్నీ కూల్చివేతలే. రాష్ట్ర అభివృద్ధిని కూల్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూల్చారు. ప్రజల జీవితాలను కూల్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలనుప్రజల హక్కులనుదళితుల గూడునుయువత భవితనూ కూల్చారు. ప్రజా రాజధాని అమరావతినిపోలవరం కలను కూల్చి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. ప్రజా వేదిక కూల్చివేతతో జగన్‌కు వికృతానందం మిగలడం తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యం. గత ప్రభుత్వం కట్టిన నిర్మాణాల్లో కూర్చుని పనిచేయడం తప్ప కొత్తగా కట్టిందేమీ లేదు. తన వల్లఏమీ కాదని… తనకు ఏమీ రాదని ఆయనకు ఆయనే నిరూపించుకొన్నారు. కూల్చడం కంటే నిర్మించడం ఎంత కష్టమైన పనో మూడేళ్ల పాలన తర్వాత అయినా జగన్ తెలుసుకోవాలి్‌్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.