సినీరంగంలో తన ప్రయాణం ఎత్తుపల్లాలతో సాగిందని, కెరీర్ తొలినాళ్లలో విజయాలు లేకపోవడంతో నిరాశకు గురయ్యానని చెప్పింది అగ్ర కథానాయిక పూజాహెగ్డే. ఆమె మాట్లాడుతూ ‘కెరీర్ ఆరంభంలో నేను నటించిన రెండు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. దాంతో ఏడాది పాటు ఖాళీగా ఉన్నా. ఆ తర్వాత కూడా నేను కోరుకున్న అవకాశాలు దక్కలేదు. దాంతో కెరీర్ గురించి టెన్షన్ పడ్డాను. చివరకు తెలుగులో నాకు బ్రేక్ దొరికింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా ఆరు హిట్స్‌తో టాప్ హీరోయిన్గా నిలిచాను. నా నిరీక్షణకు ఇప్పుడు ఫలితం దక్కింది’ అని చెప్పింది. మీ కెరీర్లో ఇదే ఉన్నతమైన దశ అనుకుంటున్నారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. విభిన్న కథా చిత్రాల్లో నటించడంతో పాటు నా అభిమాన దర్శకులతో పనిచేయాలనుంది. నటిగా నా ప్రతిభను పూర్తిస్థాయిలో ఆవిష్కరించుకునే అవకాశం ఇంకా రాలేదనుకుంటున్నా. ఇవన్నీ జరిగినప్పుడే నా కెరీర్ పరిపూర్ణమైనట్లుగా భావిస్తా. అయితే ప్రస్తుత విజయాలతో నేను అదృష్టవంతురాలినని అనుకుంటున్నా’ అని చెప్పింది.