*విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ పరిధిలో స్మగ్లింగ్ రాకెట్‌ను అధికారులు ఛేదించారు. మూడు కార్లలో అక్రమంగా తరలిస్తున్న రూ.5.80 కోట్ల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. చెన్నై నుంచి గుంటూరు, రాజమండ్రికి భారీగా బంగారం, వెండి తరలిస్తున్నట్టు ఈనెల 24న సమాచారం అందింది. అన్ని టోల్‌ప్లాజాల వద్ద కస్టమ్స్ అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద అనుమానాస్పదంగా కనిపించిన మూడు కార్లను అధికారులు తనిఖీ చేశారు. కార్లలోని సీట్ల కింది భాగంలో ప్రత్యేక అరలను ఏర్పాటు చేసి దానిలో బంగారం దాచిపెట్టారు. మూడు కార్లలో కలిపి 10.77కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని బిస్కెట్లు, నగల రూపంలో తరలిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ రూ.5.80 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
*కదులుతున్న కారులో మహిళ, ఆమె కుమార్తెపై కొందరు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. రూర్కీలోని ముస్లిం మతపర ప్రాంతం పిరాన్ కలియార్ నుంచి ఒక మహిళ ఆరేళ్ల కుమార్తె కలిసి ఆదివారం రాత్రి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నది. కారులో అటుగా వెళ్తున్న సోనూ అనే వ్యక్తి వారికి లిఫ్ట్ ఇచ్చాడు. అతడి అనుచరులు కూడా ఆ కారులో ఉన్నారు. కదులుతున్న కారులో మహిళ, ఆమె కుమార్తెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఒక కాలువ సమీపంలో వారిద్దరిని పడేసి వెళ్లిపోయారు.
*నిజామాబాద్: జిల్లా కలెక్టరేట్‌లో వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఇంటిని తనకు తెలియకుండా కొడుకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు ఎల్లమ్మ గుట్టకు చెందిన రుకుంబాయి కలెక్టరేట్‌కు వచ్చారు. తీవ్ర మనస్థాపానికి గురైన రుకుంబాయి కలెక్టరేట్ వద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి ప్రయత్నించింది. వెంటనే స్పందించిన పోలీసులు వృద్ధురాలిని అడ్డుకున్నారు.
*అల్లూరి: జిల్లాలోని పాడేరు ఘాట్‌లో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. 12వ మైలురాయి సమీపంలో బోలెరో పికప్ అదుపుతప్పి లోయలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మంది గిరిజనులకు గాయాలయ్యాయి. వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని పాడేరు జిల్లా ఆసుపత్రికి రెండు అంబులెన్స్‌ల ద్వారా తరలించారు. విశాఖపట్నం ఆర్.కె బీచ్ వద్ద జరుగనున్న బి.ఎస్.పి ఉత్తరాంధ్ర బహుజన చైతన్య సభకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
*విజయవాడ నగరంలోని బందరు రోడ్‌లోని ఒక కార్పొరేట్ కళాశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్‌తో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంద విద్యార్థులను బయటకు పంపేసారు. అగ్నిప్రమాద సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలాని చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. దాంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఊపిరిపీల్చుకున్నారు.
*పుట్లూరు మండలంలోని శనగలగూడూరు గ్రామంలో కుటుంబ కలహాలతో రామాంజనమ్మ(55) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది.
రామాంజనమ్మ భర్త నడిపి రంగారెడ్డి ఇంటిలో సమస్యలపై వాగ్వాదం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఇంటిలో ఎవరూలేని సమయంలో విషపుగుళికలు మింగి ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం తాడిపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. రామాంజనమ్మకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కాగా, ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదూ రాలేదని ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు.
*తిరుమలకు మద్యం బాటిళ్లను తరలించబోయిన ఓ భవన నిర్మాణ కూలీని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎ్‌సఈబీ) అధికారులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన వెంకటేష్ కొద్దిరోజుల నుంచి తిరుమలలో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి ఓ స్కూల్ బ్యాగులో మద్యం బాటిళ్లను పెట్టుకుని తిరుపతి నుంచి తిరుమలకు బయల్దేరాడు. అలిపిరి వద్దకు చేరుకున్న అతడు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశారు. అతడి వద్ద ఉన్న బ్యాగులో మద్యం బాటిళ్లను గుర్తించడంతో అదుపులోకి తీసుకున్నారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు మీడియాకు ఆదివారం ఎస్‌ఐలు వీరేశ్వరనాయుడు రమణ కానిస్టేబుళ్లు సుధాకర్ మధు తెలిపారు.
*కొవ్వూరు మండలం, మద్దూరు లంక సమీపంలో గోదావరి లో మునిగి అక్కచెల్లెళ్ళు మృతి చెందారు. నిడదవోలు మండలం, పురుషోత్తమపల్లి గ్రామానికి చెందిన కోసన లక్ష్మీ ప్రసన్న, సాయి రాజేశ్వరిగా గుర్తించారు. గోదావరి విహారానికి వచ్చి ఫోటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు వారిని బయటకు తీసి రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కచెల్లెళ్ళు మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది. *పోలీసుల వాహనం బోల్తా పడటంతో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు సమీపంలోని ఎయిమ్స్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి పోలీసు వాహనం వరంగల్‌కు వెళ్తుంది.కాగా, బీబీనగర్ వద్దకు రాగానే ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో 8 మంది ఉన్నారు. విషయం తెలిసిన బీబీనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* మనుబోలు మండలంలోని మనుబోలు-పొదలకూరు మార్గంలో పర్లపాడు క్రాస్‌రోడ్డు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మందికిపైగా మహిళలకు గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. అక్కంపేట వద్దనున్న జీడిపప్పు పరిశ్రమలో సుమారు 70 మంది మహిళా కార్మికులు పని చేస్తుంటారు. వీరంతా రోజూ రాత్రి 7గంటల సమయంలో ఫ్యాక్టరీ నుంచి ఆటోల్లో గ్రామాలకు వెళుతుంటారు. ఈ క్రమంలో శనివారం పరిశ్రలో పనులు ముగించుకుని జట్లకొండూరు, గోవిందరాజపురం, మడమనూరు గ్రామాలకు చెందిన మహిళా కార్మికులు ఒకే ఆటోలో ఎక్కారు. ఫ్యాక్టరీ నుంచి బయలుదేరిన ఆటో పర్లపాడు వద్దకు వచ్చేసరికి రోడ్డుపై గేదె అడ్డురావడంతో దానిని తప్పించబోయి అదుపుతప్పి ఆటో బోల్తా పడి మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న లక్ష్మీతేజ, జి.కల్పన, రమ, నీరజ, శ్రీవల్లి, ఏ పావని, పల్లవి, మునెమ్మ, కుమారమ్మ, అశ్విత, పల్లవిలతో పాటు ఆటో డ్రైవర్ పోలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పరిస్థితి విషమంగా ఉన్న వారిని 108లో నెల్లూరుకు, కొందరిని మడమనూరు, మనుబోలు, గూడూరులోని ప్రైవేట్ వైద్యశాలలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
*ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. హరిద్వార్‌లోని రూర్కీలో ఒక మహిళ, ఆమె ఆరేళ్ల కుమార్తెపై కదులుతున్న కారులో కొందరు కీచకులు సామూహిక అత్యాచారం చేశారు. తన కారులో లిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.బాధిత మహిళ తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి రాత్రి సమయంలో పిరాన్ కలియార్ నుంచి ఇంటికి వెళుతుండగా సోను అనే వ్యక్తి ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడని పోలీసులు చెప్పారు.అప్పటికే సోనుతోపాటు అతని స్నేహితులు కొందరు కారులో ఉన్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) ప్రమేంద్ర దోవల్ చెప్పారు.సోను, అతని సహచరులు కదులుతున్న కారులో మహిళ, ఆమె కుమార్తెపై అత్యాచారం చేసి కాలువ దగ్గర పడేశారు.
*పుట్లూరు మండలంలోని శనగలగూడూరు గ్రామంలో కుటుంబ కలహాలతో రామాంజనమ్మ(55) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. రామాంజనమ్మ భర్త నడిపి రంగారెడ్డి ఇంటిలో సమస్యలపై వాగ్వాదం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఇంటిలో ఎవరూలేని సమయంలో విషపుగుళికలు మింగి ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం తాడిపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. రామాంజనమ్మకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కాగా, ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదూ రాలేదని ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు.
*మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించి వేధింపులకు గురైన ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరుకు చెందిన కవిత ఆదివారం ఆత్మహత్యాయత్నం చేసింది. అల్లూరుకు చెందిన వైసీపీ నాయకుడు కవిత మామ అయిన బుచ్చిరెడ్డికి ఆమెకు మధ్య ఆస్తి వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గడప గడపకు కార్యక్రమంలో ఇటీవల అల్లూరు వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డికి బుచ్చిరెడ్డిపై కవిత ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత నుంచి ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. బుచ్చిరెడ్డి నెల నుంచి నీరు పాలు రాకుండా చేశాడు. పవర్ కట్ చేసి బెదిరించాడు. తాజాగా ఇంటి గేటుకు తాళం వేసి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు అని శనివారం కవిత వాపోయారు. బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఇల్లు కోర్టు వివాదంలో ఉందని తాము కూడా అద్దె ఇంట్లో ఉంటున్నామని తెలిపారు. కాగా.. కవితను పరామర్శించేందుకు ఆదివారం తెలుగు మహిళలు అల్లూరు గ్రామానికి వచ్చారు. ఈ ఘటనపై గ్రామంలో విచారించారు. కవిత బుచ్చిరెడ్డి అత్త భర్తతో కూడా మాట్లాడారు. వారు వెళ్లిన తర్వాత కవిత ఆమె అత్తమామల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగి, వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా, స్థానికులు కాపాడారు. కాగా జనసేన పార్టీ మహిళా విభాగం నాయకులు కూడా కవితతో మాట్లాడి, అండగా ఉంటామని చెప్పారు.
*కృష్ణా: జిల్లాలోని బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో విషాదఘటన చోటుచేసుకుంది. హనుమాన్ జంక్షన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సిగరెట్ పీక టాయిలెట్ కమోడ్‌లో వేయగానే మంటలు భారీగా చెలరేగాయి. ఆ మంటలు చేలరేగడంతో వృద్ధుడు గంగాధర్‌రావుకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం ఎక్కువ కావడంతో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ గంగాధర్‌రావు ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
*సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు దుర్గంపూడి వెంకటకృష్ణ (మృతి చెందారు. ఆదివారం ఉదయం నగరంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. డీవీ కృష్ణ స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లామాచర్ల దగ్గర తేలుకుంట్ల. ఆయన విప్లవ కమ్యూనిస్టు పార్టీలో చేరారు. బీడీ వర్కర్ల యూనియన్ సిరిసిల్ల రైతాంగ ఉద్యమంనిమ్మపల్లి పోరాట నిర్మాణంలోనూ కీలకంగా పనిచేశారు. సీపీఐ(ఎం.ఎల్)ప్రజాపంథా పార్టీ నిర్మాణంలోనూ డీవీ కృష్ణ ప్రముఖ పాత్ర పోషించారు. డీవీ కృష్ణ భౌతికకాయాన్ని వైద్యవిద్యార్థుల పరిశోధన నిమిత్తం గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు.
*అప్పుల బాధ భరించలేక వరంగల్ జిల్లా గీసుగొండ మండలం సూర్యాతండాకు చెందిన రైతు వాంకుడోతు చందులాల్ ( ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందులాల్ ఐదెకరాల భూమిలో ఏటా పత్తి మొక్కజొన్న సాగుచేస్తున్నాడు. పెట్టుబడి కోసం బ్యాంకు రుణం ప్రైవేటుగా సుమారు రూ. లక్షల వరకు అప్పు చేశాడు. పంటల దిగుబడులు రాక నష్టాలే మిగిలాయి. కొన్ని నెలల క్రితం రెండో కుమార్తె వివాహం చేశాడు. ఆమె వివాహానికి మరో రూ. లక్షలు అప్పు చేయడంతో అప్పుల భారం మరింత పెరిగింది. ఈ క్రమంలో చందులాల్ ఆదివారం మధ్యాహ్నం తన వ్యవసాయ భూమిలో పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు బావి వద్దకు వెళ్లి చూడగా అక్కడ మృతి చెంది ఉన్నాడు.
*నార్సింగిలో నిర్మాణంలో ఉన్న భవంతి సెల్లార్ ప్రహరీగోడ కూలి ఇద్దరు కూలీల మృతి చెందిన సంఘటనపై మానవహక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) స్పందించింది. ఈ సంఘటనపై వివిధ పత్రికల్లో ప్రచురించిన అంశాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసింది. దర్యాప్తు జరిపి జులై 28లోపు నివేదిక సమర్పించాలని నార్సింగ్ మున్సిపల్ కమిషనర్, మాదాపూర్ డీసీపీలకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, మణికొండ మున్సిపాలిటీ పుప్పాల్‌గూడలో శనివారం జరిగిన సెల్లార్ ప్రమాదంలో ఇద్దరు చనిపోయిన ఘటనపై మున్సిపల్ కమిషనర్ ఫాల్గుణకుమార్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
*అప్పుల బాధ భరించలేక వరంగల్ జిల్లా గీసుగొండ మండలం సూర్యాతండాకు చెందిన రైతు వాంకుడోతు చందులాల్ (50) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందులాల్ ఐదెకరాల భూమిలో ఏటా పత్తి, మొక్కజొన్న సాగుచేస్తున్నాడు. పెట్టుబడి కోసం బ్యాంకు రుణం, ప్రైవేటుగా సుమారు రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. పంటల దిగుబడులు రాక నష్టాలే మిగిలాయి. కొన్ని నెలల క్రితం రెండో కుమార్తె వివాహం చేశాడు. ఆమె వివాహానికి మరో రూ.7 లక్షలు అప్పు చేయడంతో అప్పుల భారం మరింత పెరిగింది. ఈ క్రమంలో చందులాల్ ఆదివారం మధ్యాహ్నం తన వ్యవసాయ భూమిలో పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు బావి వద్దకు వెళ్లి చూడగా అక్కడ మృతి చెంది ఉన్నాడు. *మహబూబ్‌నగర్: జిల్లాలోని జడ్చర్లలో పెను ప్రమాదం తప్పింది. జడ్చర్ల వద్ద ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ప్రమాద వశాత్తు దగ్ధమయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆర్టీసీ లగ్జరీ బస్సు కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తున్నది. అయితే ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జాతీయ రహదారిపై జడ్చర్ల వద్ద బస్సులో షార్ట్‌సర్య్కూట్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
*నిజామాబాద్ జిల్లా వేల్పూర్ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున వేల్పూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ క్రమంలో కారులో మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారు పూర్తిగా కాలిపోవడంతో మృతులకు సంబంధించిన వివరాలు లభించలేదు. నిజామాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాల పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.