Movies

నా ప్రతి అడుగులోనూ ఆయన ఉ న్నారు!

Auto Draft

‘ఉయ్యాల జంపాల’ అంటూ ఆకట్టుకొన్న ‘చిన్నారి పెళ్లికూతురు’ అవికాగోర్‌. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అవికా చకచకా సినిమాలు చేసేశారు. అయితే ఆ తరవాత అనుకోకుండా గ్యాప్‌ వచ్చేసింది. చాలాకాలం తరవాత ఆమె తెలుగులో ఓ సినిమా చేశారు. అదే… ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’. అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రమిది. జులై 1న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా అవికాగోర్‌ చెప్పుకొచ్చిన ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’ ముచ్చట్లు… ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’ ఓ మంచి జ్ఞాపకం లాంటి సినిమా. పదో తరగతి బ్యాచ్‌ అంతా ఓచోట కలిస్తే ఎలా ఉంటుంది? అంత ఆహ్లాదకరంగా ఈ సినిమా సాగుతుంది. రీ యూనియన్‌ కాన్సెప్టుపై ఇది వరకు కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే అదొక్కటే కాదు. ఎమోషన్‌, కుటుంబ బంధాలు, స్నేహం.. ఇవన్నీ మిళతమైన కథ ఇది. నేను ఇప్పటి వరకూ మంచి కథలనే ఎంచుకొన్నాను. అవికా ఓ సినిమా చేసిందంటే అందులో ఏదో ఓ విషయం ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టే చిత్రమిది.

పదోతరగతి రోజులు నాకింకా గుర్తు. అప్పట్లో షూటింగులతో బిజీగా ఉండేదాన్ని. స్కూల్లో ఉన్నది తక్కువ. సెట్లో గడిపింది ఎక్కువ. పరీక్షల సమయంలోనూ షూటింగుల్లో పాల్గొనేదాన్ని. ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’ చూస్తే.. మీ స్కూల్‌ డేస్‌ గుర్తొస్తాయి. దర్శకుడు అంజి చాలా చక్కగా తీశారు. చిక్‌ మంగళూరు, శ్రీలంక, రాజమండ్రి.. ఇలా చాలా అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపారు. నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా వెనుకంజ వేయలేదు.మిళింద్‌తో నేను ప్రేమలో పడ్డాను. తన పరిచయం నా జీవితాన్ని మార్చేసింది. తన వల్లే నా బలాబలాలేంటి అనే విషయాలు అర్థమయ్యాయి. నా బరువు తగ్గడం నుంచి, నేను నిర్మాతగా మారడం వరకూ నా ప్రతీ అడుగులోనూ ఆయన ఉన్నారు. ఆయన లేకుండా ఇదంతా చేయలేను. ఈమఽధ్య చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ హిందీలో సీరియల్స్‌లో బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను. అందుకే తెలుగులో గ్యాప్‌ వచ్చింది. నాగచైతన్యతో ‘థ్యాంక్యూ’లో నటించా. అదో అందమైన అనుభవం. ఈ సినిమా గురించి చాలా మాట్లాడాలని ఉంది. కానీ ఇప్పుడే ఏం చెప్పకూడదు. విడుదల సమయంలో మాట్లాడుకొందాం.