ఖైరతాబాద్ గణేశ్ -2022 విగ్రహ నమూనాను ఉత్సవ కమిటీ సోమవారం విడుదల చేసింది. ఈ ఏడాది పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఎడమవైపున శ్రీ తిశక్తి మహా గాయత్రి దేవి, కుడి వైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక 50 అడుగుల ఎత్తులో నిర్మించనున్న ఈ విగ్రహాన్ని మట్టితో మాత్రమే రూపొందించనున్నారు. ఖైరతాబాద్ గణేషుడిని మట్టితో రూపొందించడం ఇదే తొలిసారి. జూన్ 10వ తేదీన కర్రపూజతో విగ్రహ తయారీ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే.