చెన్నై సోయగం సమంత ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు, హిందీ సినిమాలతో తీరిక లేకుండా ఉన్న ఈ భామ ఇప్పుడెక్కడుందో తెలుసా..? ఈ బ్యూటీ దుబాయ్ (Dubai)కి వెళ్లింది. తన స్నేహితురాలు శిల్పారెడ్డి తోపాటు ఆమె సోదరి సాహిత్య రెడ్డితో చేరిపోయింది. వీరంతా కలిసి ఒక్కచోట సందడి చేసిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.ఈ స్టిల్‌ను శిల్పారెడ్డి ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ..ఫైనల్‌గా ఊహించని విధంగా నా సోదరి సాహిత్యను సామ్ కలవడం, సామ్‌ను సాహిత్య మీట్ అవడం అద్బుతం. నా ఇద్దరు ఫేవరేట్ స్త్రీలు. దేవా (సాహిత్య) ఎప్పుడూ సామ్ ఆంటీని కలుసుకోవడం చాలా సరదాగా ఉంటుంది..అంటూ #dubaidaires హ్యాష్ ట్యాగ్‌ను జతచేసింది శిల్పారెడ్డి. సమంతతో కలిసి దిగిన మరో ఫొటోను షేర్ చేస్తూ..దుబాయ్‌లో మేము ఎవరిని కలుసుకునే అవకాశం ఉందో ఊహించండి చూద్దాం..అంటూ క్యాప్షన్ ఇచ్చింది శిల్పారెడ్డి.ప్రస్తుతం విజయ్ దేవరకొండ, శివనిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న ఖుషీ చిత్రంలో నటిస్తోంది సమంత. దీంతోపాటు గుణశేఖర్ డైరెక్షన్‌లో చేస్తున్న శాకుంతలం విడుదల కావాల్సి ఉంది. మరోవైపు ఫీ మేల్ సెంట్రిక్ ప్రాజెక్టు యశోదలో నటిస్తోంది. ఇవే కాకుండా హాలీవుడ్ ప్రాజెక్టు Arrangement of Love సినిమాలో కూడా నటిస్తోంది.
https://www.instagram.com/p/CfQT3KrPjCt/?utm_source=ig_embed&ig_rid=ae3d1c71-d023-439e-ab8b-1d33cf1c0645