Politics

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని తిరస్కరిస్తున్నాం.. – TNI రాజకీయ వార్తలు

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని తిరస్కరిస్తున్నాం..  – TNI రాజకీయ వార్తలు

* విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా కు టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థిని తిరస్కరిస్తున్నామన్నారు. భీష్ముడు మంచివాడైనా ఓటమి తప్పలేదన్నారు. ద్రౌపది ముర్ముపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, బీజేపీ నిరంకుశ వైఖరిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని అన్నారు. బీజేపీ అక్రమాలకు అడ్డు అదుపులేకుండా పోతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 8 ఏళ్లుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గిరిజన రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని ఏడు గిరిజన మండలాలను మాకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు నామా నాగేశ్వరరావు, డాక్టర్ రాములు, కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ రంజిత్ రెడ్డి, వెంకటేష్, రవిచంద్ర, పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

*దేశంలో మోదీ రాజ్యాంగం నడుస్తోంది: కేటీఆర్‌
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా.. సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్‌ దాఖలు అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్‌..‘‘యశ్వంత్‌ సిన్హాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము. ఆయనను హైదరాబాద్‌ రావాలని ఆహ్వానించాము. ఎన్నికల్లో యశ్వంత్‌ సిన్హా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముపై మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు.బీజేపీ నిరంకుశ తీరును మాత్రమే వ్యతిరేకిస్తున్నాము. దేశంలో అమలవుతున్నది అంబేద్కర్‌ రాజ్యాంగం కాదు.. బీజేపీ రాజ్యాంగం. దేశంలో మోదీ రాజ్యాంగం మాత్రమే అమలు అవుతోంది. మోదీ అక్రమాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ ప్రయత్నిస్తోంది. గిరిజనులపై నిజంగా బీజేపీకి అభిమానం ఉంటే తెలంగాణలో రిజర్వేషన్లను పెంచాలి. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. మెజార్టీ లేకపోయినా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. రాజ్యాంబద్ధమైన వ్యవస్థలను చేతిలో పెట్టుకుని బెదిరిస్తున్నారు. గట్టిగా ఎవరైనా మాట్లాడితే వెంటాడి మరీ వేధిస్తున్నారు. విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో కేంద్రం దాడులు చేయిస్తోంది. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. కేంద్రంపై కచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వస్తుంది. అయితే జుమ్లా.. లేదంటే హమ్లా. ప్రశ్నించే వారిని ఏజెన్సీలతో దాడులు చేయిస్తున్నారు. తెలంగాణకు ఎనిమిదేళ్లుగా మోదీ ఏం ఇచ్చారు?. దేశంలోని దళితుల కోసం కేంద్రం ఏం చేసింది?. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందో.. శ్వేతపత్రం విడుదల చేయాలి.ప్రతీ దానికి సమయం వస్తుంది. నరేంద్ర మోదీది దద్దమ్మ గవర్నుమెంట్‌. మోదీ నియంతృత్వ పోకడలపై నోరు విప్పాలి. వారిలో విషం తప్ప విషయం లేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

*రకరకాల నిబంధనలు.. లెక్కలేనన్ని కోతలు: Chandra Babu
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎం జగన్‌ పై విరుచుకుపడ్డారు. సంక్షేమ పథకాల వర్తింపులో రకరకాల నిబంధనలతో కోతులు పెడుతూ.. ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఎత్తులు వేసినా..వైసీపీకి ఓట్ల శాతం పెరగలేదు.‘‘అమ్మఒడి పథకంలో 52 వేలమంది లబ్దిదారులు తగ్గారు. ఒంటరి మహిళకు ఇచ్చే పింఛన్లో నిబంధనలు మార్చారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టని జగన్‌కు రాజధాని భూమలు అమ్మే హక్కు ఎక్కడిది? అమరావతిని శ్మశానంతో పోల్చిన ఈ ప్రభుత్వం… ఇప్పుడు ఎకరా రూ. 10 కోట్లకు ఎలా అమ్మకానికి పెడుతుంది? ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను మూడేళ్లుగా పూర్తి చెయ్యకుండా…ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇవ్వజూపడం అన్యాయం. డబ్బులు పంచినా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకున్నా ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికలో వైసీపీకి ఓట్లు పెరగలేదు. ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆత్మకూరు ఉపపోరు ఫలితాల్లో కనిపించింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించే మద్యం నాణ్యతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిధుల్లేక దుల్హన్ పథకాన్ని నిలిపివేశామని హైకోర్టుకు చెప్పడం జగన్ రెడ్డి మోసానికి నిదర్శనం. ఈ-క్రాప్ నమోదులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. వైసీపీ కార్యకర్తల పేర్లు నమోదు చేసి.. పంట నష్టపోయిన రైతులకు మొండిచేయి చూపారు.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

*అమరావతి నాశనానికి జగన్‌ నాన్‌స్టాప్‌ కుట్రలు‌: నారా లోకేశ్‌
అమరావతి రాజధానిని నాశనం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాన్‌స్టాప్‌ కుట్రలు పన్నుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. రాజధాని ప్రాంతాన్ని శ్మశానవాటికగా అభివర్ణించిన జగన్.. అమరావతి భూములను ఎకరం రూ.10 కోట్లకు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధానిగా అమరావతిపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేసిన తీరును గుర్తుచేశారు.

*సీడ్ పాయింట్‌గా గజ్వెల్ అభివృద్ధి చెందుతోంది : Niranjan Reddy
ప్రజల ఊహలకు అందనిది, కలలో కూడా ఉహించని అభివృద్ధి టీఆర్ఎస్హయాంలో జరుగుతున్నదని మంత్రి నిరంజన్ రెడ్డిపేర్కొన్నారు. గజ్వేల్ రైల్వే స్టేషన్‌లో ఎరువుల రేక్ పాయింట్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనేక రకాల ఎగుమతుల సౌలభ్యం ఈ రేక్ పాయింట్ ద్వారా అందనుందన్నారు. రాబోయే వందల సంవత్సరాల వరకూ ప్రజల అవసరాలు తీర్చే పనులు జరుగుతున్నాయన్నారు. సీడ్ పాయింట్‌గా గజ్వెల్ అభివృద్ధి చెందుతున్నదని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఉన్న రెండు జాతీయ పార్టీలుదేశాన్ని ఎన్ని ఏళ్ళు ఏలినా తెలంగాణకు ఒరిగిందేమి లేదన్నారు. ఈ రోజు కేంద్రాన్ని ఏలుతున్న పార్టీ వరి సాగులో, వడ్ల కొనుగోలులో అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించిందని విమర్శించారు. వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుకు రైతులు మొగ్గు చూపాలన్నారు.

*చరిత్రలోనే గొప్ప సభగా మోదీ బహిరంగ సభ నిలిచిపోతుంది: DK Aruna
చరిత్రలోనే గొప్ప సభగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీబహిరంగ సభ నిలిచిపోతుందని బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… మోదీ సభకు లక్షల మంది ప్రజలు, కార్యకర్తలు వస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని సీఎం కేసీఆర్ కోల్పోయారన్నారు. తెలంగాణ ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ నియంత మాదిరి పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మిగిలిందని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లికి కేసీఆర్ బేడీలు వేశారని, ఎన్నికల‌ హామీలు అమలులో‌ విఫలమయ్యారని డీకే అరుణ విమర్శలు గుప్పించారు.

*జగన్‌ ఒక్క చిటిక వేస్తే టీడీపీ వాళ్లని తిరగనివ్వం-వైసీపీ ప్లీనరీలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
సీఎం జగన్‌ ఒక చిటికె వేయమనండి.. తెలుగుదేశం పార్టీ వారిని బయట తిరగనీయకుండా చేస్తానని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. ఆదివారం వైసీపీ ప్లీనరీని మంత్రాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తన వెంట ఉన్నంత వరకు టీడీపీ వర్గీయులు తన వెంట్రుక కూడా పీకలేరన్నారు. ‘రాఘవేంద్రస్వామి మీద ప్రమాణం వేసి చేసి చెబుతున్నా.. నా ఆస్తులన్నీ అమ్మి అయినా సరే ప్రజలకు సేవ చేస్తా’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు పోటీగా తిక్కారెడ్డి సరిపోడని చంద్రబాబు గాని, లోకేశ్‌ గాని పోటీ చేస్తే బావుంటుందని సవాల్‌ విసిరారు. ఎంపీ సంజీవకుమార్‌ తదితరులు పాల్గొన్నారు

*వైసీపీ పాలనపై తులసిరెడ్డి ఆగ్రహం
వైసీపీ పాలనా తీరుపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డిఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.13 వేలు ఇచ్చి.. నాన్న బుడ్డి ద్వారా రూ.54 వేలు లాక్కోవడం భావ్యమా? అని ప్రశ్నించారు. సంపూర్ణ మద్య నిషేధం విధిస్తేనే అమ్మ ఒడి పథకం సద్వినియోగం అవుతుందన్నారు. విద్యారంగంలోని పాత పథకాలనే కొత్త పేర్లతో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంకు ఇంగ్లీష్పై అభిమానం.. తెలుగు పట్ల ద్వేషం ఎందుకు అని తులసిరెడ్డి నిలదీశారు.

*నా కొడుకు పాటించేది రాజధర్మం: యశ్వంత్‌ సిన్హా
‘ఇది రాష్ట్రపతి ఎన్నిక మాత్రమే కాదు. ప్రభుత్వ నిరంకుశ విధానాలను అడ్డుకునే దిశగా వేసే అడుగు’ అని ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా చెప్పారు. అలాంటి విధానాలను ప్రతిఘటించాలంటూ ఈ ఎన్నిక దేశ ప్రజలకు సందేశం ఇస్తోందన్నారు. తన కుమారుడు జయంత్‌సిన్హా(బీజేపీ ఎంపీ) మద్దతు పొందలేకపోవడంపై యశ్వంత్‌ స్పందించారు. తన కొడుకు రాజధర్మాన్ని పాటిస్తుంటే తాను దేశ ధర్మాన్ని పాటిస్తున్నానన్నారు. సిన్హా సోమవారం నామినేషన్‌ దాఖలు చేస్తారు.

*రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం : నాగబాబు
అవినీతిపరులు, దోపిడీదారుల నుంచి రాష్ర్టానికి విముక్తి కలిగించడానికి, భవిష్యత్తు తరాలను కాపాడుకోడానికి జనసేనను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన నాయకులతో సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు.
*నిర్మాణ పనుల్లో వేగం పెంచండి: మంత్రి వేముల
నూతన సచివాలయ భవన నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. దూల్పూర్‌ రెడ్‌ స్టోన్‌ రాతి కట్టడం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని దానికి తగినట్లు 50 మంది మేస్త్రీలను రాజస్థాన్‌ నుంచి తీసురావాలని నిర్మాణ సంస్థ ప్రతినిధికి మంత్రి సూచించారు. అదేవిధంగా గ్రానైట్‌ ,ఫ్లోరింగ్‌ పనుల్లో వేగం పెంచాలని, విండో పనులు, ఫాల్‌ సీలింగ్‌ పనులు, ఎలక్ర్టికల్‌, ,ప్లంబింగ్‌తోపాటు ఇతర సివిల్‌ పనులను సమాంతరంగా చేపట్టాలన్నారు. 32 డోము నిర్మాణాలకుగాను 16 డోముల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన డోముల పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

*పత్తి, పప్పు ధాన్యాలు సాగు చేయాలి: మంత్రి
రాష్ట్రంలో వరి సాగు బాగా పెరిగిందని, కానీ అవసరానికి మించి వరిని పండిస్తే దుష్పరిణామాలు ఎదురవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి గుర్తుచేశారు. దానికి ప్రత్యామ్నాయంగా పత్తి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు సాగుచేయాలని రైతులకు సూచించారు. ఆ విషయాన్ని తెలియచేసేందుకే వ్యవసాయ సదస్సులను నిర్వహించామని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సదస్సులు విజయవంతం అయ్యాయని, వీటితో సాగు దశ, దిశ మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పంటల మార్పిడి ఆవశ్యతను ప్రతి రైతుకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం నుంచి రైతుబంధు నిధులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

*ప్రధాని సభతో తెలంగాణలో చరిత్ర సృష్టిస్తాం:Bandi sanjay
తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభతో రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తామని బిజెపి రాష్ట్ర చీఫ్ బండిసంజయ్ అన్నారు. మోదీ సభకు కేసీఆర్ సర్కార్అ డ్డంకులు సృష్టిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.తెలంగాణపై బీజేపీ పాలసీని ప్రధాని ప్రకటించబోతున్నారని అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన బండిసంజయ్ బీజేపీ కట్టడికి కేసీఆర్ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు.తెలంగాణలో పేదలు జీవించలేని పరిస్థితిని కేసీఆర్ కల్పించారని అన్నారు.

*బీజేపీకి కౌంట్ డౌన్ మొదలైంది: బాల్క సుమన్బీ
కేంద్రంలోని బిజెపి సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. దేశంలో బై బై మోదీ అని ట్రెండింగ్ అవుతోందన్నారు. బిజెపి ప్రభుత్వాలను కూల్చే పనిలో పడిందని,ఈడీని ఉసి గొల్పడం మీద దృష్టిపెట్టారు.వారికి తగిన శాస్తి జరుగుతుందన్నారు.దేశంలో 2 కోట్ల ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసగించారని ఆయన విమర్శించారు.మోదీకి హటావో.. భారత్కు బచావో నినాదం మొదలైందని చెప్పారు.పాలమూరుకు జాతీయహోదా ఇస్తారా?బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతారా?బీజేపీ కార్యవర్గ భేటీల్లో దీనిపై సూటిగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.బండి సంజయ్ హుందాగా మాట్లాడాలని బాల్క సుమన్ హితవు పలికారు.

*వ్యవసాయ సదస్సులతో మారనున్న సాగు దశ-దిశ:Niranjan reddy
తెలంగాణలో రైతులకు అవసరమైన సలహాలు,సూచనలతో కూడిన సదస్సులతో వ్యవసాయ రంగం దశ-దిశ మారుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులుకూడా పంటల వైవిద్దీకరణకు మొగ్గు చూపుతున్నారని అన్నారు.సాగునీటి రాకతో తెలంగాణలో వరిసాగు అనూహ్యంగా పెరిగిందని మంత్రి తెలిపారు.రాష్ట్రంలో వ్యవసాయ సదస్సుల విజయవంతానికి సహకరించిన అందరికీ మంత్రి ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. అవసరానికి మించిన వరి సాగు వల్ల కలిగే దుష్పరిణామాలను గమనించి దేశంలో తొలిసారి వ్యవసాయ సదస్సులు నిర్వహించినట్టు మంత్రి తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు మూలంగా సాగునీటి రాకతో2014 నాటికి సాగు విస్తీర్ణం కోటీ 34 లక్షల ఎకరాలు నుండి 2 కోట్ల 3 లక్షల ఎకరాలకు సాగు పెరిగిందన్నారు.2014 నాటికి 45 లక్షల టన్నులు ఉన్న ధాన్యం ఉత్పత్తి 3 కోట్ల టన్నులకు చేరిందన్నారు. రూ.లక్షన్నర కోట్లతో సాగు నీటి ప్రాజెక్టులు, రూ.28,473 కోట్లు వెచ్చించి వ్యవసాయ విద్యుత్ మౌళిక సదుపాయాలు, ఏటా దాదాపు రూ.10,500 కోట్లు భరిస్తూ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు అందిస్తున్నామని తెలిపారు.రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇప్పటి వరకు రూ.50,447.33 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేశామన్నారు. 28వ తేదీ నుండి రైతుల ఖాతాలలో తొమ్మిదో విడత రైతుబంధు నిధులు జమకానున్నాయని చెప్పారు. రైతుభీమా పథకం ద్వారా ఇప్పటివరకు 83,118 మంది రైతు కుటుంబాలకు రూ.4150.90 కోట్లు పరిహారం అందజేశామన్నారు.

*నిర్మాణంలోని కష్టాన్ని ఇప్పటికైనా తెలుసుకోండి: చంద్రబాబు
తన సైకో పాలన ఎలా ఉండబోతోందో సీఎం జగన్‌రెడ్డి ప్రజా వేదిక కూల్చివేతతో ప్రజలకు చూపించారని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజా వేదిక కూల్చివేతకు మూడేళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ుూకూల్చడం తప్ప కట్టడం జగన్‌కు చేతకాదు. చేసినవన్నీ కూల్చివేతలే. రాష్ట్ర అభివృద్ధిని కూల్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూల్చారు. ప్రజల జీవితాలను కూల్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను, ప్రజల హక్కులను, దళితుల గూడును, యువత భవితనూ కూల్చారు. ప్రజా రాజధాని అమరావతిని, పోలవరం కలను కూల్చి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. ప్రజా వేదిక కూల్చివేతతో జగన్‌కు వికృతానందం మిగలడం తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యం. గత ప్రభుత్వం కట్టిన నిర్మాణాల్లో కూర్చుని పనిచేయడం తప్ప కొత్తగా కట్టిందేమీ లేదు. తన వల్ల ఏమీ కాదని… తనకు ఏమీ రాదని ఆయనకు ఆయనే నిరూపించుకొన్నారు. కూల్చడం కంటే నిర్మించడం ఎంత కష్టమైన పనో మూడేళ్ల పాలన తర్వాత అయినా జగన్‌ తెలుసుకోవాలి్‌్‌ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

*వైసీపీ వికృత పోకడల్ని ప్రజలు గమనిస్తున్నారు – శ్రీకాకుళం, ప్రకాశం జిల్లా ఘటనలపై స్పందించాలి: చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వ వికృత పోకడలను ప్రజలు గమనిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో జరిగిన రెండు ఘటనలు ప్రభుత్వ దుర్మార్గాన్ని చాటి చెప్తున్నాయని ఆదివారం ట్వీట్‌ చేశారు. ‘శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో సచివాలయ ఉద్యోగిపై సర్పంచ్‌ భర్త గున్నయ్య దాడి చేశారు. ప్రకాశం జిల్లా అల్లూరులో మంత్రిని సమస్యలపై ప్రశ్నించిన కవిత అనే మహిళ ఇంటికి కరెంట్‌ తొలగించి, పాలు, నీళ్లు కూడా అందకుండా చేశారు. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ అహంకారానికి ఇంతకంటే నిదర్శనం ఏంకావాలి? ఉద్యోగులు, ప్రజలపై వైసీపీ గూండాలు వ్యవహరించిన తీరు ఒక్కటైతే, దాన్ని సమర్ధించిన ప్రభుత్వ తీరు మరింత విస్తుగొలుపుతోంది. పోయే కాలం దాపురించి, కన్నుమిన్నూ కానకుండా వ్యవహరిస్తున్న వైసీపీ రాక్షసులు వీటన్నింటికీ ఎప్పటికైనా మూల్యం చెల్లించుకుంటారు. సిగ్గున్న ప్రభుత్వమైతే శ్రీకాకుళంలో దివ్యాంగ ఉద్యోగిపై దాడి, ప్రకాశం జిల్లాలో మహిళపై వేధింపులకు తలదించుకోవాలి. కారకులపై చర్యలు తీసుకోవాలి. బాధితులను క్షమాపణ కోరాలి’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఇక, దివ్యాంగ ఉద్యోగి వాసుదేవరావుకు న్యాయం చేయకపోతే దివ్యాంగులంతా కలిసి తాడేపల్లిని ముట్టడిస్తామని టీడీపీ నేత గోనుగుంట్ల కోటేశ్వరరావు హెచ్చరించారు.

*సీఎం పీఠాన్ని బీసీలకు కేటాయించాలి: కేశన
ముఖ్యమంత్రి పదవి బీసీలకు కేటాయించాలని ఈ మేరకు వైసీపీ టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు ఆరు నెలల్లో ప్రకటించాలని లేకుంటే తామంతా ఏకమై ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం ఖాయమని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం నేతలు స్పష్టంచేశారు. గుంటూరులో ఆదివారం జరిగిన సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో నేతలు ఈ మేరకు తీర్మానం చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో.. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా బీసీ సంక్షేమ సంఘం ఆవిర్భవించనుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు, ఓసీ వర్గాలను కలుపుకొని రాజకీయ పార్టీ నిర్మాణానికి సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. రానున్న 2024 ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రే లక్ష్యంగా రాజకీయ పార్టీ ఆవిర్భావం జరుగుతుందన్నారు. ఇప్పటి నుంచే పార్టీ నిర్మాణానికి అవసరమైన కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్‌లేని పదవులు బీసీలకు ఇచ్చి సామాజిక న్యాయమంటూ ప్రభుత్వాలు ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు.

*ఆస్తులు సంపాదించలేదని ప్రమాణం చేస్తావా?- పుష్పశ్రీవాణిని ప్రశ్నించిన ఆడపడుచు పల్లవి రాజు
‘ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అక్రమ ఆస్తులు సంపాదించలేదని కుల దేవతపై ప్రమాణం చేస్తావా’? అంటూ తాజా మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణికి ఆమె సొంత ఆడపడుచు శత్రుచర్ల పల్లవిరాజు సవాల్‌ విసిరారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం లో ఆదివారం మాట్లాడారు. ఇకపై కురుపాం నియోజకవర్గంలో రౌడీ రాజకీయం నడవదని, అడ్డుకుంటామని అన్నారు. ‘నేను ఆదేశిస్తే.. టీడీపీ నేతలు పొలిమేరల్లోకి రాలేరు’ అని ఇటీవల వైసీపీ ప్లీనరీలో పుష్పశ్రీవాణి చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. శత్రుచర్ల కుటుంబం నుంచి కోడలిగా రెండుసార్లు గెలిచి, చివరకు తమ కుటుంబంలోనే చిచ్చుపెట్టిన ఘనత పుష్పశ్రీవాణికే దక్కుతుందన్నారు. మూడేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా, సమస్యలపై ప్రశ్నించేవారిపై పోలీసు కేసు లు పెట్టించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. త్వరలోనే చంద్రబాబునాయుడును కలుస్తానని, ఆయన సారథ్యంలో పార్టీకి సేవ చేస్తానని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు.

*దుష్ప్రచారాన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు: బొత్స
ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చేసిన అభివృద్ధి గురించి చెప్పలేని పరిస్థితి చంద్రబాబుదన్నారు. టీడీపీ హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు దుష్ప్రచారాన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. చదువును కూడా వ్యాపారం చేసిన ఘనుడు చంద్రబాబని విమర్శించారు.