DailyDose

టీ హ‌బ్ -2ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

టీ హ‌బ్ -2ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

టీ హ‌బ్ కొత్త ఫెసిలిటీ సెంట‌ర్‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించారు. టీ హ‌బ్-2 ప్రాంగ‌ణమంతా కేసీఆర్ క‌లియ తిరుగుతున్నారు. టీ హ‌బ్ ఫెసిలిటీ సెంట‌ర్ ప్ర‌త్యేక‌త‌ల‌ను అధికారులు సీఎం కేసీఆర్‌కు వివ‌రిస్తున్నారు. కేసీఆర్ వెంట ఐటీ మంత్రి కేటీఆర్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, మాజీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌తో పాటు ప‌లువురు ఉన్నారు. దేశ, విదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు టీహబ్‌-2 ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.పనితీరులోనే కాదు.. భౌతికంగానూ హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోనే ఎంతో ప్రత్యేకత కలిగిన భవనంగా టీ హబ్‌ 2.0 నిలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిర్మాణ శైలితో పాటు అత్యంత విశాలమైన 5 రోడ్ల కూడలిలో కొత్తగా రూపుదిద్దుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారు రూ.276 కోట్లతో అత్యాధునిక డిజైన్‌తో సాండ్‌ విచ్‌ ఆకారంలో దీన్ని నిర్మించారు. టీ హబ్‌ నుంచి 5 మార్గాల్లో వెళ్లేందుకు 100 అడుగుల నుంచి 120 అడుగుల రహదారులను నిర్మించారు.
V7
విశ్వనగర సిగలో మరో కలికితురాయి.. టీ-హబ్​ 2.0 కొలువుదీరింది. భాగ్యనగర ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లింది. హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన టీహబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్‌ను ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. నగరంలోని రాయదుర్గంలో నిర్మించిన రెండోదశ భవనాన్ని సీఎం పరిశీలించారు. హైదరాబాద్​లో నిర్మించిన టీహబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. రాయదుర్గంలో ఏర్పాటు చేసిన రెండో దశ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి.. అనంతరం టీ హబ్​ సెంటర్​ను పరిశీలించారు. సెంటర్‌ ప్రత్యేకతలను అధికారులు సీఎంకు వివరించారు. టి హబ్​కు చేరుకున్న ముఖ్యమంత్రికి ఐటీశాఖ మంత్రి కేటీఆర్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ టి-హబ్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మూడో అంతస్తులోని ఏర్పాట్లను కేసీఆర్ పరిశీలించారు.

టీ 2.0 హబ్​ ప్రత్యేకతలు..:
రాయదుర్గంలో ఏర్పాటైన టీహబ్‌ కొత్త ఫెసిలిటీ సెంటర్​లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రూ.276 కోట్ల వ్యయంతో శాండ్‌విచ్‌ ఆకారంలో నిర్మాణం చేపట్టారు. టీహబ్ ఫెసిలిటీ సెంటర్‌లో ఏకకాలంలో 2వేలకుపైగా స్టార్టప్‌లు నిర్వహించేందుకు వీలుగా ఆధునాతన సౌకర్యాలు కల్పించారు. అత్యంత విశాలమైన ప్రాంగణం అత్యాధునిక మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. చుట్టూ ఐదు విశాలమైన రోడ్లతో కూడలి ఉండటం టీహబ్‌ 2.0 ప్రత్యేకంగా నిలుస్తోంది. తక్కువ కాలంలోనే ఎక్కువ ఆవిష్కరణలు జరిగే అవకాశం కల్పించారు. ప్రపంచంలోని ఉత్తమ ఇంక్యుబెటర్స్‌తో పోటీపడే స్థాయికి టీహబ్ చేరుకుంటుందని ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.