Movies

అదే పెద్ద సవాలు!

అదే పెద్ద సవాలు!

ఒకప్పుడు బాలీవుడ్‌ అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది శిల్పాశెట్టి. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. వివాహానంతరం సినిమాలకు గ్యాప్‌నిచ్చిన శిల్పాశెట్టి ఇటీవల విడుదలైన ‘నికమ్మ చిత్రంతో బాలీవుడ్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సినీ రంగంలో సంపాదించుకునే పేరుప్రతిష్టలు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని చెప్పింది. స్టార్‌డమ్‌ వచ్చినప్పుడు దానిని కాపాడుకోవడం చాలా ముఖ్యమని, పరిధులు దాటి నిర్ణయాలు తీసుకుంటే కష్టాలు కొనితెచ్చుకున్నట్లేనని పేర్కొంది. ‘మంచి ఫామ్‌లో దూసుకుపోతున్నప్పుడు అందరి దృష్టి మనమీదే ఉంటుంది. ప్రతి చిన్నమాటకు కూడా వక్రభాష్యాలు తీస్తారు. కథ బాగాలేదని చెప్పడం కూడా అహంకారమని అనుకుంటారు. వీటన్నింటికి తట్టుకొని స్టార్‌డమ్‌ను కాపాడుకోవడం పెద్ద సవాలుగా అనిపిస్తుంది’ అని శిల్పాశెట్టి చెప్పింది. పెళ్లయిన తర్వాత కథానాయికల ప్రాధామ్యాలు మారిపోతాయని, కథల ఎంపికలో అనేక అంశాల్ని బేరీజు వేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.