అమెరికా గాయకుడు ఆర్ కెల్లీకి వేధింపుల కేసులో 30 ఏళ్ల జైలుశిక్ష పడింది. సెలబ్రిటీ స్టేటస్‌ను వాడుకుని చిన్నారులు, మహిళలను వేధించినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. సెక్స్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు కెల్లీపై కేసు నమోదు అయింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆ కేసులో దోషిగా తేలాడు. సింగర్ పూర్తి పేరు రాబర్ట్ సిల్వస్టర్ కెల్లీ. అయితే ఈ కేసులో మళ్లీ అప్పీల్ చేయనున్నట్లు అతని తరపు లాయర్లు తెలిపారు. శృంగారాన్ని ఆయుధంగా వాడుకుని సింగర్ కెల్లీ నేరాలకు పాల్పడినట్లు జడ్జి తన తీర్పులో తెలిపారు. ఐ బిలీవ్ ఐ కెన్ ఫ్లై, ఇగ్నీషన్ లాంటి హిట్ పాటలతో ఫేమస్ అయిన సింగర్ కెల్లీ తన వద్దకు వచ్చిన మహిళలు, చిన్నారులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.