NRI-NRT

ఒమన్ వెళ్లే ప్రవాసులకు గుడ్‌న్యూస్..

ఒమన్ వెళ్లే ప్రవాసులకు గుడ్‌న్యూస్..

ఒమన్ కార్మికమంత్రిత్వ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాసుల నియామకాల కోసం అక్కడి రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ లైసెన్స్ప ర్మిట్ల గడువును పొడిగించింది. మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. జూన్ 30 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ పొడిగింపు వర్తిస్తుందని తెలిపింది. అలాగే ఇదే చివరాఖరి పొడిగింపు అని, ఇకపై ఎలాంటి వెసులుబాటులు ఉండబోవని స్పష్టం చేసింది. “ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు, సంస్థలకు ఇదే చివరి అవకాశం. ప్రవాస కార్మికులను నియమించుకునేందుకు వీలు కల్పించే రిక్రూట్‌మెంట్ లైసెన్ల గడువును జూన్ 30, 2022 నుంచి సెప్టెంబర్ 30, 2022 వరకు పొడిగిస్తున్నాం. ఆ తర్వాత ఎలాంటి పొడిగింపులు ఉండవు.” అని లేబర్ మినిస్ట్రీ ప్రకటించింది.