NRI-NRT

తానాలో తారాస్థాయికి చేరిన విభేదాలు

తానాలో తారాస్థాయికి చేరిన విభేదాలు

తానా ప్రస్తుత పాలకవర్గం హయాంలో అన్ని రికార్డులే నెలకొంటున్నాయి. అధ్యక్షుడు అంజయ్య చౌదరి, ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ వెంకటరమణ వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరు పతాకస్థాయికి చేరింది. ఇటీవల నూతన సభ్యులకు ఓటు హక్కు కల్పించే విధంగా బైలాల సవరణ చేయాలని అంజయ్య చౌదరి వర్గం ప్రతిపాదించగా…ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ, కోశాధికారి పోలవరపు శ్రీకాంత్ లు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీనితో తీర్మానం వీగిపోయింది.

*** ప్రతీకార చర్య లకు దిగిన అంజయ్య వర్గం
దీనితో అంజయ్య చౌదరి వర్గం యార్లగడ్డ వెంకటరమణ, పోలవరపు శ్రీకాంత్‌లపై ప్రతీకార చర్యలకు దిగింది. వీరిరువురిపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిపాదనలు రూపొందించింది. గురువారం రాత్రి తానా ఫౌండేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ కార్యదర్శి శశికాంత్ సభ్యులకు నోటీసులు పంపించారు. వెంకటరమణ, శ్రీకాంత్‌లను పదవుల నుండి తొలగించడానికి ఓటింగ్ జరగబోతోంది. పాలకవర్గ సభ్యులలో మెజారిటీ సంపాదించలేని అంజయ్య వర్గం ఫౌండేషన్‌లో ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి పావులు కదుపుతోంది. ఇరువర్గాల్లో ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూద్దాం.

#
All,

I understand and agree.

I am scheduling a Special Meeting as per the authorization given according to (Article X Section 3(b)(i) of TANA bylaws tomorrow (Thursday) – 06/30/2022 at 8.00PM (EST).

Agenda: No Confidence Motion on Foundation Chair and Foundation Treasurer and subsequent actions.

I will send the Zoom details shortly.

Thanks,
Sasi Kanth. V
Foundation Secretary