Movies

సవాళ్లను అధిగమిస్తా

సవాళ్లను అధిగమిస్తా

హార్మోన్స్‌ సమతుల్యం లోపించడం వల్ల తాను పలు శారీరక సమస్యలతో బాధపడుతున్నానని చెప్పింది అగ్ర కథానాయిక శృతిహాసన్‌. ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవడం ఎంత కష్టమో మహిళలకు తెలుసునని, వాటిని ఓ సహజమైన ప్రక్రియగా భావించి అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నానని విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేసింది.‘నేను శారీరకంగా చాలా బలహీనంగా కనిపిస్తున్నా..మానసికంగా మాత్రం ధృడ సంకల్పంతో ఉన్నా. ఈ సమస్యల నుంచి సాధ్యమైనంత తొందరగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా. చక్కటి ఆహార నియమాలు పాటించడంతో పాటు వ్యాయామం చేస్తున్నా. ఇలాంటి సమస్యలు మనల్ని ఏమాత్రం కలవరపెట్టకూడదు. వీటిని ధైర్యంగా స్వీకరించి పోరాడాలి’ అని శృతిహాసన్‌ పేర్కొంది.