Movies

అరుదైన వ్యాధితో యుద్ధం చేస్తున్నానంటున్న శృతి హాసన్

అరుదైన వ్యాధితో యుద్ధం చేస్తున్నానంటున్న శృతి హాసన్

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి శృతి హాసన్. అనంతరం తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అనంతరం బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి అక్కడ సైతం మంచి గుర్తింపునే సాధించింది. అయితే.. కొన్నేళ్లపాటు సినీ పరిశ్రమకి దూరంగా ఉన్న నటి ఇటీవలే ప్రభాస్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మళ్లీ కెరీర్‌లో బిజీగా మారింది.కాగా.. శృతి ఏ విషయం గురించైన ముక్కు సూటిగా మాట్లాడుతుందనే విషయం తెలిసిందే. అది ఇతరుల గురించైనా, ఆమెకున్న సమస్యల గురించైనా అలాగే ముక్కుసూటిగా ఉంటుంది. ఈ బ్యూటీ తాజాగా ఆమెకున్న PCOS అనే అరుదైన వ్యాధి గురించి, హర్మోనల్ సమస్యల గురించి సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియజేసింది.