తెలుగు రంగస్థల సంగీత, సాహితీ సదస్సు వాషింగ్టన్ డీసీలో బుధవారం(జూన్ 29న) జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు భాను మాగులూరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. సమకాలీన సమాజం మారుతున్నా, సంస్కృతి, సాంప్రదాయాలు మారుతున్నా ఇక్కడున్న తెలుగువారు భాషను, సంస్కృతిని మర్చిపోకుండా కాపాడుతున్నారు. తెలుగు భాషని, సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఒక జాతి అస్థిత్వాన్ని, ప్రత్యేకతను చాటిచెప్పేది మాతృభాషే అని గుర్తించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా నాటక రంగాన్ని, కళలను, కళాకారులను ప్రవాసాంధ్రులు బాగా ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. ప్రాచీన కళలు అంతరించిపోకుండా కాపాడుతున్నారని గుర్తు చేశారు.