Politics

వాలంటీర్లే వైసిపి సైనికులు.! మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్య.! – TNI రాజకీయ వార్తలు

వాలంటీర్లే వైసిపి సైనికులు.! మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్య.! – TNI  రాజకీయ వార్తలు

* వాలంటీర్ వ్యవస్థ గురించి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో గురువారం జరిగిన వైసిపి జిల్లా స్థాయి ప్లీనరీకి హాజరైన ఆయన వైసిపి సైనికులుగా వారిని అభివర్ణించారు వాలంటీర్లు వైసిపి కార్యకర్తలు పార్టీకి సమాచారం చేరవేసే కార్యకర్తలని చెప్పారు. వాలంటీర్లు వైసిపి కి వ్యతిరేకంగా మాట్లాడటానికి ప్రచారం చేయడానికి వీల్లేదని చెప్పారు వాలంటీర్లు ఎవరు? వారిని ఎవరు పెట్టారు.? ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు స్ధానిక ఎం ఎల్ ఏ లు పెట్టారు వ్యతిరేకంగా మాట్లాడితే తీసేస్తాం అన్నారు. అంబటి వివాదాస్పద వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నాయకులు కార్యకర్తల్లో అలజడి మొదలయ్యింది వాలంటీర్లు వైసిపి కార్యకర్తలు అయితే ఇక మేమెందుకు పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకుని పని చేసి ఇప్పుడు పార్టీ అధికారంలోకి రాగానే ముక్క మొఖం తెలియని వాలంటీర్లులను జీతాలు ఇచ్చి పెట్టుకుని వారే పార్టీ కార్యకర్తలు చచివాలయ సిబ్బంది పార్టీ నాయకులు వచ్చే ఎన్నికల్లో వారే పార్టీని గెలిపించి 175 కి 175 సీట్లు తీసుకొస్తారని విమర్శలు వినిపిస్తున్నాయి.!

*విద్వేష వాతావ‌ర‌ణాన్ని సృష్టించిన మోదీ స‌ర్కార్ : రాహుల్ గాంధీ
మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ బ‌హిష్కృత నేత నూపుర్ శ‌ర్మ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ సుప్రీంకోర్టు మండిప‌డింది. ఆమె బాధ్య‌తారాహిత్య వ్యాఖ్య‌ల‌తో దేశం భ‌గ్గుమంటోంద‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్ధానం చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్ర‌వారం స్పందించారు. దేశంలో అల‌జ‌డి, ఆగ్ర‌హ వాతావ‌ర‌ణాన్ని కేంద్ర ప్ర‌భుత్వమే సృష్టించింద‌ని, ఇందుకు ఏ ఒక్క‌రో కార‌ణం కాద‌ని నూపుర్ శ‌ర్మ‌ను ఉద్దేశించి రాహుల్ పేర్కొన్న‌రు.కేర‌ళ‌లోని వ‌య‌నాద్‌లో రాహుల్ విలేకరుల‌తో మాట్లాడుతూ మోదీ స‌ర్కార్‌పై విరుచుకుప‌డ్డారు. దేశంలో ఇవాళ నెలకొన్న ప‌రిస్ధితిని ప్ర‌ధాని, హోం మంత్రి, బీజేపీ, ఆరెస్సెస్‌లు సృష్టించాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. పాల‌క ప్ర‌భుత్వమే విద్వేష వాతావర‌ణాన్ని సృష్టించింద‌ని అన్నారు. ఇది దేశానికి, ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌కు విఘాత‌మ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

*నిర్మల్‌ను మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
రాష్ట్రంలోనే నిర్మల్ పట్టణాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి గుల్జార్ మార్కెట్ మీదుగా పోస్ట్ ఆఫీస్ వరకు నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్ పనులను ఆయన పరిశిలించారు.పోస్ట్ ఆఫీస్ నుంచిఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ఆయన పాదయాత్ర చేస్తూ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. దవాఖానలో సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు.దేవరకోట ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సందర్శించారు.భోజన శాలకు రూ.50 లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నిషాన్ వద్ద దర్గాకు ప్రహరీ గోడ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట మేరకు రోడ్డు వెడల్పు పనులను పూర్తి చేసామని తెలిపారు.

* విద్వేష వాతావ‌ర‌ణాన్ని సృష్టించిన మోదీ స‌ర్కార్ : రాహుల్ గాంధీ
మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ బ‌హిష్కృత నేత నూపుర్ శ‌ర్మ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ సుప్రీంకోర్టు మండిప‌డింది. ఆమె బాధ్య‌తారాహిత్య వ్యాఖ్య‌ల‌తో దేశం భ‌గ్గుమంటోంద‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్ధానం చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్ర‌వారం స్పందించారు. దేశంలో అల‌జ‌డి, ఆగ్ర‌హ వాతావ‌ర‌ణాన్ని కేంద్ర ప్ర‌భుత్వమే సృష్టించింద‌ని, ఇందుకు ఏ ఒక్క‌రో కార‌ణం కాద‌ని నూపుర్ శ‌ర్మ‌ను ఉద్దేశించి రాహుల్ పేర్కొన్న‌రు.కేర‌ళ‌లోని వ‌య‌నాద్‌లో రాహుల్ విలేకరుల‌తో మాట్లాడుతూ మోదీ స‌ర్కార్‌పై విరుచుకుప‌డ్డారు. దేశంలో ఇవాళ నెలకొన్న ప‌రిస్ధితిని ప్ర‌ధాని, హోం మంత్రి, బీజేపీ, ఆరెస్సెస్‌లు సృష్టించాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. పాల‌క ప్ర‌భుత్వమే విద్వేష వాతావర‌ణాన్ని సృష్టించింద‌ని అన్నారు. ఇది దేశానికి, ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌కు విఘాత‌మ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

*తెలంగాణలో రామ రాజ్యం రావటం ఖాయం: Laxman
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రధాని మోదీ సభ ఉండబోతోందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభ ఏర్పాట్లను లక్ష్మణ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణపై ప్రధాని మోదీ, నడ్డా , అమిత్ షా లు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. మరో ఏడాదిలో తెలంగాణలో రామ రాజ్యం రావటం ఖాయమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్(TRS) పతనం ప్రారంభమైందని… హార్డింగ్స్, ఫ్లెక్సీల విషయంలో టీఆర్ఎస్ ది చిల్లర రాజకీయమని ఆయన మండిపడ్డారు.రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి పోటీ చేయనున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌కు బీ పార్టీగా టీఆర్ఎస్, ఎంఐఎంలు వ్యవహరిస్తున్నాయన్నారు. కుటుంబ పార్టీలు కనుమరుగవటం‌ ఖాయమని తెలిపారు. పుత్ర వాత్సల్యం వలన శివసేనకు పట్టిన గతే టీఆర్ఎస్‌కు పడుతుందని హెచ్చరించారు. ఆదివాసీ రాష్ట్రపతి అవుతుంటే టీఆర్ఎస్ నాయకత్వం ఓర్వలేకపోతోందని మండిపడ్డారు. ఆదివాసీని రాష్ట్రపతిని చేస్తోన్న ఘనత 70 ఏళ్ళల్లో బీజేపీకి దక్కుతుందని లక్ష్మణ్ పేర్కొన్నారు.

*ల్యాప్ టాప్ లు ఇవ్వకపోతే ప్రశ్నించాలి కానీ…!: సజ్జల
ల్యాప్ టాప్ లకు సరిపడా డబ్బులు ఇచ్చామన్న సజ్జల ల్యాప్ టాప్ లకు మంగళం అని రాశారని ఆరోపణ పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం ప్రభుత్వంపై ద్వేషం వెళ్లగక్కుతున్నారని విమర్శ ఏపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకంలో భాగంగా నగదుకు బదులు ల్యాప్ టాప్ లు (కోరుకుంటే) ఇస్తామని గతంలో ప్రకటించడం తెలిసిందే. అయితే, కొన్నిరోజుల కిందట సీఎం జగన్ ఎనిమిదో తరగతిలో విద్యార్థులకు ట్యాబ్ లు ఇస్తామని వెల్లడించారు. దాంతో, ల్యాప్ టాప్ లకు మంగళం అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ల్యాప్ టాప్ ల అంశంపై పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ల్యాప్ టాప్ లు ఇవ్వకపోతే ప్రశ్నించాలని, ల్యాప్ టాప్ కు సరిపడా డబ్బులు ఇచ్చినా గానీ తప్పుడు రాతలు రాస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న ద్వేషంతోనే ఈ విధంగా అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా, మద్యంలో విషపదార్థాలు ఉన్నాయంటూ ప్రతిరోజూ ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అనేక బ్రాండ్లను తీసుకువచ్చిన విషయం మర్చిపోయారా? అంటూ సజ్జల ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక్క డిస్టిల్లరీకి కూడా అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకు అధికారం లేదన్న బాధతో పచ్చ మీడియా చేస్తున్నంత దుష్ప్రచారం మరెక్కడా కనిపించదని విమర్శించారు.

*గౌరవల్లి ప్రజెక్టు నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది: Revanth Reddy
గౌరవల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పోలీసులు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు. ప్రాజెక్టు రీ డిజైన్ వల్ల ముంపు గ్మాల సంఖ్యను పెంచారని ధ్వజమెత్తారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. నిర్వాసితులకు దక్కాల్సిన న్యాయపర హక్కుల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.రీ డిజైన్ వల్ల ముంపు గ్రామాల సంఖ్య 8కి పెరిగింది.‘‘తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో, రైతుల పొలాలకు నీళ్ల పేరుతో మీరు చేస్తున్న ఆరాచకాలు హద్దులు దాటుతోంది. రైతుల పొలాల్లో నీళ్ల సంగతి దేవుడెరుగు. వారి కళ్లలో మాత్రం నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ప్రాజెక్టుల పేరుతో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రచారాలు చేసుకోవడం నాణేనికి ఒక వైపు మాత్రమే, కానీ నాణేనికి రెండో వైపు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన గౌరవల్లి ప్రాజెక్టులో మీ రీ డిజైన్ ఫలితంగా ముంపు గ్రామాల సంఖ్య 1 నుంచి 8 పెరిగింది. మొదట్లో ఒక్క గుడాటిపల్లి గ్రామం మాత్రమే ముంపునకు గురైంది. రీ డిజైన్ ఫలితంగా అదనంగా మరో ఏడు గ్రామాలు.. తెనుగుపల్లి, మదెల్లపల్లి, సోమాజితండా, చింతల్ తండా, పొత్తపల్లి, జాలుబాయి తండా, తిరుమల్ తండా మునిగిపోతున్నాయి. తెలంగాణలో ఏ మూలకు పోయినా ఎకరం ధర రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షలకు తక్కువ లేదని మీరే చెబుతున్నారు. గౌరవల్లి నిర్వాసితుల భూములకు మాత్రం ఆ ధర ఎందుకు వర్తింపజేయడం లేదు. పునరావాసానికి సంబంధించి కొందరికి ఎకరాకు రూ.2.10 లక్షలు, మరికొందరికి రూ.6.90 లక్షల పరిహారం అందించినట్లు మీ అధికారులే చెబుతున్నారు. కానీ అన్ని కుటుంబాలకు పరిహారం అందలేదని, సామాజిక సర్వేలో చాలా మంది తప్పిపోయారని నిర్వాసితులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు పూర్తికావొస్తున్నా 186 మందికి అసలు పరిహారమే అందలేదు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మైనర్లుగా ఉండి, తర్వాత మేజర్లయిన వారిని కుటుంబంగా పరిగణించి ఒక్కొక్కరికి రూ.8 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు కోరుతున్నారు. అంతేకాకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముంపు గ్రామాల్లో ఏళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రాజెక్టుల కోసం రైతులు భూములను త్యాగం చేశారు. ఇంత చేస్తే నిర్వాసితులకు ఏం మిగిలింది? పరిహారం అడిగిన పాపానికి వారిపై లారీచార్జ్ చేయడమే కాకుండా అత్యంత దౌర్జన్యంగా ప్రవర్తించారు. రైతుల భూములు లాక్కుని… పరిహారం ఇవ్వకపోగా అరెస్టులు చేయడం.. బేడీలు వేయడం.. గజ దొంగల్లా వారిని ట్రీట్ చేయడం అత్యంత ఆటవిక చర్య. గతంలో నిర్వాసితుల తరపున మా ప్రజాప్రతినిధులు మంత్రి హరీశ్ రావును కలిస్తే ఏవో మాటలు చెప్పారు తప్ప సమస్యను పరిష్కరించలేదు. గతంలో ఖమ్మంలో అదివాసీ మిర్చి రైతులకు సంకెళ్లు వేశారు. ఇప్పుడు గౌరవల్లి రైతులకు బేడీలు వేసి వారి ఉసురు పోసుకుంటున్నారు. రైతు రాజ్యం అంటే ఇదేనా? పది మందికి అన్నం పెట్టే అన్నదాత చేతికి సంకెళ్లు వేయడం యావత్ తెలంగాణ సమాజం జీర్ణించుకోలేని దృశ్యం. దీనికి మీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. తక్షణమే రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. నిర్వాసితులు కోరుకున్న విధంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి. లేకపోతే నిర్వాసితుల పక్షాన వారికి దక్కాల్సిన న్యాయపర హక్కుల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది.’’ అని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

*Polavaramపై విచారణ జరిపిస్తే.. జగన్ మళ్లీ జైలుకే: Devineni Uma
పోలవరాన్ని నిర్లక్ష్యం చేస్తూ జాతికి ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ
పేర్కొన్నారు. పోలవరం డ్యామ్పై విచారణ జరిపిస్తే.. జగన్ రెడ్డిమళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. అంబటి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. పోలవరం పనులపై శ్వేతపత్రం విడుదల చేస్తారా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. పోలవరం అంశంపై ఏ ప్రభుత్వం ఎంత చేసిందో తేల్చేందుకు.. చర్చకు తాము సిద్ధమని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో రికార్డు స్థాయిలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తామన్నారు. జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని దేవినేని ఉమ పేర్కొన్నారు.

*ఆ దమ్ము లేకే మాపై విష ప్రచారం చేస్తున్నారు: Anitha
ఆంధ్రా గోల్డ్ ), సిల్వర్ స్ట్రైప్స్ , 9సీ హార్స్మ ద్యం బ్రాండ్‌లలో విషం లేదని చెప్పే దమ్ము ప్రభుత్వానికి లేక తమ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత( విమర్శించారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ బ్రాండ్స్ అన్నీ ఇప్పుడెందుకు ప్రభుత్వ దుకాణాల్లో కనిపించట్లేదని ప్రశ్నించారు. తెలుగుదేశం ఆధారాలు బయటపెట్టాకే ఇవి కనిపించకుండా పోవటం వెనక ఆంతర్యమేంటని నిలదీశారు. వాటిలో విషం ఉందని ప్రభుత్వం పరోక్షంగా ఒప్పుకుందని అనిత పేర్కొన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘‘విషాన్ని కూడా బంపర్ ఆఫర్‌లో ప్రజలకు అమ్మిన ప్రభుత్వం ఇది. ప్రజలకు విషం పోస్తూ మేం విషం కక్కుతున్నామని సజ్జల చెప్పటం సిగ్గుచేటు. డబ్బులిచ్చి విషాన్ని కొనుక్కుని ప్రాణాలు తీసుకునే దౌర్భాగ్యం ఏపీలోనే ఉంది. ఏపీలో అమ్ముతున్న మద్యం బ్రాండ్‌లు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమ్మట్లేదు? వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 100 డిస్టలరీలు రిజిస్ట్రయితే కేవలం 16కు మాత్రమే అనుమతులు ఇచ్చినట్లు స.హ.చట్టం ఇచ్చిన సమాధానానికి ఏం చెప్తారు? అవి జగన్ రెడ్డి బినామీ కంపెనీలు కాబట్టే వాటికి మాత్రమే అనుమతులిచ్చారు. బుద్దున్నవాడు మద్య నిషేధం చేయాలని ప్రకటన చేసిన జగన్ రెడ్డి బుద్ధి ఇప్పుడేమైంది? సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలనే సంకల్పం ఉన్న వాడు తాగుబోతుల భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టడాన్ని బరితెగింపు అనాలా? లేక అది బుద్దిలేనితనమా.. సిగ్గులేనితనమా?’’ అని మండిపడ్డారు.

*పన్నులు, విద్యుత్ భారాలతో ఏపీ ప్రజలు అల్లాడుతున్నారు: Srinivasarao
పన్నులు, విద్యుత్ భారాలతో ఏపీ ప్రజలు అల్లాడుతున్నారని, ఇప్పుడు మళ్లీ ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ డీజిల్ ధరలు తగ్గినా.. మళ్లీ సెస్ ఛార్జీలు పెంచడం అన్యాయమన్నారు. ఏపీ ప్రభుత్వ అస్థవ్యస్త పాలనకు ఈ ధరాభారాలే నిదర్శనమన్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రం అన్ని రకాలుగా జీఎస్టీ పేరుతో దోపిడీ చేస్తోందని ఆరోపించారు. నెల రోజుల పాటు ఇంటింటికీ సిపిఎం పేరుతో యాత్ర చేశామని, ఎక్కడకి వెళ్లినా ప్రజలు జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీలు, ఇళ్ల‌ నిర్మాణ భారాలు మోపారని, ఎవరైనా ప్రశ్నిస్తే..‌వాలంటీర్ల ద్వారా పధకాలు అపేస్తామని బెదిరిస్తున్నారని చెబుతున్నారన్నారు.

*కోవిడ్ టైంలో ప్రైవేటు డాక్టర్లు నా ఫోన్ కూడా ఎత్తలేదు: Kesineni nani
కోవిడ్ సమయంలో డాక్టర్లు ప్రజలకు ఎంతో సేవలందించారని ఎంపీ కేశినేని నాని అన్నారు. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లను ఎంపీ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎంతో మంది డాక్టర్లు కొవిడ్‌లో సేవలందించినప్పటికీ… కొంతమంది డాక్టర్లు దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. ‘‘పేద వారికి ఫ్రీ ట్రీట్మెంట్ అడిగాను అని కొంతమంది ప్రైవేట్ డాక్టర్లు కోవిడ్ టైంలో నా ఫోన్ కూడా ఎత్తలేదు. వైద్యం కోసం నా దగ్గరకు వచ్చిన వాళ్లను తెలిసిన డాక్టర్ వద్దకు పంపిస్తే ఆ టెస్ట్ ఈ టెస్ట్‌లు అంటూ వాళ్ళ దగ్గర డబ్బులు గుంజారు. 70 శాతం మంచి డాక్టర్లు ఉంటే మిగత 30 శాతం డబ్బు ఆశించే డాక్టర్లు ఉన్నారు. వారివల్ల మంచి డాక్టర్లు కూడా చెడ్డపేరు వస్తుంది’’ అని అన్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ చింతమనేని సురేష్ని స్వార్థ సేవలను ప్రజలకు అందించారని కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ చింతమనేని సురేష్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును ఎంపీ కేశినేని అందజేశారు.

*నిజంగా ఆ ధైర్యం ఉంటే… జగన్ అసెంబ్లీని రద్దు చేయాలి: GVL
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజాకంటక పాలన ఉందని.. జగన్‌ది దుర్మార్గమైన పాలన అని వ్యాఖ్యానించారు. ‘‘వైసీపీకి 175 సీట్లు వస్తాయని, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తామని జగన్ అంటున్నారు. నిజంగా ఆ ధైర్యం ఉంటే.. అసెంబ్లీని రద్దు చేయాలి’’ అంటూ సవాల్ విసిరారు. వైసీపీ ప్లీనరీలో ఈ విషయం ప్రకటించాలని డిమాండ్ చేశఆరు. వైసీపీ అంటే గోల్ మాల్ అని ప్రజలు అనుకుంటున్నారని ఎంపీ జీవీఎల్ అన్నారు.

*పార్టీ మారినవారిపై అక్రమ కేసులు దుర్మార్గం: Achennaidu
పార్టీ మారిన నేతలపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ రెడ్డి పాలన సొంత పార్టీ నేతలకే నచ్చట్లేదని అందుకే టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిపై జగన్ రెడ్డి, వైసీపీ నేతలు కక్ష్యసాధింపులకు పాల్పడటం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. రాజంపేట పార్లమెంట్ వైసీపీ రైతు అధ్యక్షులు మద్దిరెడ్డి కొండ్రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారని.. అప్పటి నుంచి వైసీపీ నేతలు కొండ్రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. చంద్రగిరి, మదన పల్లె, వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లలో అక్రమ కేసులు బనాయించటమే కాక వైసీపీ గూండాలు అతని ఇంటిపై దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అరాచక విధానాల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్టీ మారితే కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడతారా అని ఆయన ప్రశ్నించారు.ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చిన రాజకీయపార్టీలో చేరే హక్కుందన్నారు. కానీ జగన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రజల హక్కుల్ని కాలరాస్తూ రాక్షస పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర పునర్ నిర్మాణం చంద్రబాబు నాయుతోనే సాధ్యమని వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు చాలామంది నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు అచ్చెన్నాయుడు అన్నారు.

*నిజంగా ఆ ధైర్యం ఉంటే… జగన్ అసెంబ్లీని రద్దు చేయాలి: GVL
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజాకంటక పాలన ఉందని.. జగన్‌ది దుర్మార్గమైన పాలన అని వ్యాఖ్యానించారు. ‘‘వైసీపీకి 175 సీట్లు వస్తాయని, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తామని జగన్ అంటున్నారు. నిజంగా ఆ ధైర్యం ఉంటే.. అసెంబ్లీని రద్దు చేయాలి’’ అంటూ సవాల్ విసిరారు. వైసీపీ ప్లీనరీలో ఈ విషయం ప్రకటించాలని డిమాండ్ చేశఆరు. వైసీపీ అంటే గోల్ మాల్ అని ప్రజలు అనుకుంటున్నారని ఎంపీ జీవీఎల్ అన్నారు.

*ఇలాంటి ఘటనలన్నీ జగన్‌ పాలనలోనే: లోకేశ్‌
తేనెటీగల వల్ల రథం తగలబడిపోవడం, ఎలుకలు మందు తాగడం, కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం, ఉడత వల్ల హైటెన్షన్‌ వైరు తెగిపోవడం… ఇలాంటి సంఘటనలన్నీ జగన్‌రెడ్డి పాలనలోనే జరుగుతున్నాయని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ‘‘ఇంకా నయం! కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పలేదు’’ అని ఎద్దేవా చేశారు. కాగా, ‘‘వినేవాళ్లు ఆంధ్రప్రదేశ్‌ జనమైతే.. చెప్పేవాడు జగన్మోసపురెడ్డి అవగాహన లేకే సీపీఎస్‌ రద్దు హామీ ఇచ్చామన్నారు. జీపీఎఫ్‌ డబ్బులు మాయం చేసి సాఫ్ట్‌వేర్‌ సమస్యగా చిత్రీకరిస్తున్నారు. నిధులు లేకే సచివాలయ ఉద్యోగులకు వసతి సదుపాయం రద్దు చేశామంటున్నారు. రేపో, మాపో శనివారం సెలవు రద్దు చేసి.. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసమేనని చెబుతారు, చూడండి’’ అంటూ లోకేశ్‌ పేర్కొన్నారు

*రాష్ట్రం నష్టపోతున్నా కేంద్రానికి వంతపాడటమేనా?: యనమల
జీఎస్టీలో రాష్ట్రం నష్టపోయేలా నిర్ణయాలు జరుగుతున్నా వైసీపీ ప్రభుత్వం కిక్కురుమనడం లేదని, ఏం జరిగినా కేంద్రానికి వంతపాడటం ఒకటే వైసీపీ విధానమా? అని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. గురువారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన చేశారు. ‘‘జీఎస్టీ పన్ను విధానం ప్రవేశపెట్టడం వల్ల నష్టపోతున్న ఆదాయానికి ప్రతిగా రాష్ట్రాలకు ఇచ్చే పరిహారాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించాలని అన్ని రాష్ట్రాలు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో అడిగితే ఏపీ మాత్రం మౌనంగా ఉండిపోయింది. పదిహేడు రకాల పన్నులు కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయినందువల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాలని చట్టంలోనే ఉంది. చట్టపరంగా రావాల్సిన హక్కులను కూడా అడగలేని దుస్ధితిలో వైసీపీ ప్రభుత్వం ఉండటం బాధాకరం. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా సాధించుకొనే మంచి అవకాశం వచ్చినా ఏ షరతులు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి రాష్ట్ర యువత భవితను మంటగలిపారు.

*జగన్‌ మంచి మనిషి కావాలని కోరుకున్నా: అనిత
‘‘సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రమేయం లేకుండా రాష్ట్రంలో ఎలాంటి అరాచకాలు, దాడులు జరగవు. దుర్మార్గమైన పాలన అందిస్తున్న జగన్మోహన్‌రెడ్డి మంచి మనిషి కావాలని స్వామిని కోరుకున్నా’’ అని తెలుగు మహిళ ఆధ్యక్షురాలు అనిత అన్నారు. గురువారం ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆమె ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు.

*కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్‌: మంత్రి పెద్దిరెడ్డి
చిత్తూరు జిల్లా కుప్పంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ, చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భరత్‌ పోటీ చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం గంగవరం మండలంలో జరిగిన వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ భరత్‌ పోటీ విషయాన్ని స్పష్టం చేశారు.

*వైసీపీ కార్యకర్తలు చెప్పినవారినే వలంటీర్లుగా పెట్టాం: అంబటి
‘‘గ్రామస్థాయి కార్యకర్తలు సూచించిన వాళ్లనే వలంటీర్లుగా పెట్టాం. ఎమ్మెల్యేలు నేరుగా ఎవరినీ నియమించలేదు. మీరు చెప్పిన వాళ్లే వలంటీర్లుగా ఉన్నారు. వాళ్లు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా, తప్పు చేసినా చెప్పండి.. తీసేస్తాం’’ అంటూ వైసీపీ శ్రేణులనుద్దేశించి మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం నెల్లూరులో జరిగిన ఆ జిల్లా వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జూలై 8, 9వ తేదీల్లో జరిగే రాష్ట్ర ప్లీనరీలో ఎన్నికల యుద్ధభేరి మోగించనున్నట్లు చెప్పారు. దీనిని తట్టుకునే శక్తి చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ఇక, నేతలను, కార్యకర్తలను గౌరవించాలని, వారిని విస్మరిస్తే పార్టీకి పుట్టగతులు ఉండవని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. గత మూడేళ్ల పాలనలో సంక్షేమ ఫలాలు అందించడంలో ముందడుగు వేసినప్పటికీ, అభివృద్ధి విషయంలో వెనకబడ్డామని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

*ఎన్టీఆర్‌కు వారసుడు బాబు కాదు: కొడాలి నాని
‘‘వారసులంటే అల్లుళ్లు కాదు. తాత, తండ్రి, కొడుకు… ఈ వరుసనే వారసత్వం అంటారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు వారసులంటే… ఆయన కొడుకులు, మనుమడు జూనియర్‌ ఎన్టీఆర్‌. చంద్రబాబు ఎన్టీఆర్‌కు అల్లుడు మాత్రమే, వారసుడు కాదు’’ అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘బందరులోనూ మాజీ మంత్రి నడకుదిటి నరసింహరావుకు కొల్లు రవీంద్ర ఇల్లరికం వచ్చిన అల్లుడు… వారసుడు కాదు. వైఎస్‌ రాజారెడ్డి, రాజశేఖరరెడ్డిలకు వైఎస్‌ జగన్‌ వారసుడు. వారి మాదిరిగానే మాజీ మంత్రులు పేర్ని కృష్ణమూర్తి, పేర్ని నానిలకు పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) వారసుడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి పోటీ చేస్తాడు’’ అని తెలిపారు. రూ.8,000 కోట్లతో జిల్లాకో మెడికల్‌ కళాశాల, రూ.45 వేల కోట్లతో పాఠశాలల్లో నాడు – నేడు పనులు, సచివాలయాలు, ఆర్‌బీకేల నిర్మాణం… అభివృద్ధి పనుల కింద టీడీపీ నాయకులకు కనపడటం లేదా అని ప్రశ్నించారు. సమావేశంలో పేర్ని నాని, మంత్రి జోగి రమేశ్‌, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు సింహాద్రి రమేశ్‌ బాబు, కైలే అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

*ఎమ్మెల్సీ పండులను అరెస్టు చేయాలి: యామినీ శర్మ
‘ప్రధాన మంత్రి సభలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలన్న వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? లేక వైసీపీ పిలుపో చెప్పాలి. ఢిల్లీలో వంగుతూ ఇక్కడ వాగుతోన్న వైసీపీ తీరును ప్రజలు గమనిస్తున్నారు’ అని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాదినేని యామినీ శర్మ అన్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి విగ్రహావిష్కరణకు వస్తోన్న ప్రధాని సభలో హింసను ప్రేరేపించేలా వైసీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలతో అధికార పార్టీకి సంబంధం లేకుంటే ముందస్తు అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్మవరంలో బీజేపీ కార్యాలయంలోకి మారణాయుధాలతో చొచ్చుకెళ్లి తమ పార్టీ వారిపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేసిన రవీంద్రబాబు, హింసను ప్రేరేపించిన ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి పదవుల్లో కొనసాగే అర్హత లేదన్నారు. ఆత్మకూరులో బీజేపీ మహిళా కార్యకర్త పద్మపై దాడి చేశారని, వైసీపీ అరాచకాలన్నింటికీ సమాధానం చెబుతామని హెచ్చరించారు.

*ప్రధానిని జగన్‌ నిలదీయరేం: శైలజానాథ్‌
భారత సైన్యంలో చేరాలనుకునే యువతకు అన్యాయం చేసేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అగ్నిపథ్‌పై ప్రధాని మోదీని నిలదీసే సాహసం ఎందుకు చేయడం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ నిలదీశారు. యువత భవిష్యత్తు నిర్వీర్యం అవుతున్నా జగన్‌ గుడ్డి ప్రభుత్వానికి చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా మారిందని బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిపథ్‌పై రాష్ట్రంలోనూ యువత నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నా ప్రధానిని నిలదీయకుండా జగన్‌ మౌనంగా ఎందుకున్నాడని ప్రశ్నించారు.

*సోమూ.. హోదాపై మోదీతో మాట్లాడిస్తారా..
‘‘సోము వీర్రాజూ… ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న ప్రధాని మోదీతో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి దండ వేయించడమేనా..? లేక ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రకటన చేయించేది ఏమైనా ఉందా?’’ అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ప్రశ్నించారు. ప్రధానితో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లుగా ప్రకటన చేయించాలని కోరారు. హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లయినా చేసింది ఏమీ లేదు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ప్రత్యేక హోదా ఇవ్వనున్నట్లు పార్లమెంటులో ప్రకటించింది. ఇంత వరకూ బీజేపీ దానిని అమలు చేయలేదు.

*వైసీపీ సర్కారు తప్పిదాలతోనే డయాఫ్రం వాల్‌కు నష్టం
‘‘వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వక తప్పిదాలతోనే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. కేంద్రం చెప్పినా వినకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారింది. రాష్ట్రానికి జీవనాడిగా ఉండాల్సిన ప్రాజెక్టు అధోగతి పాలైంది’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. జరిగిన సంఘటనలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, తత్ఫలితంగా దేశానికి కలిగిన నష్టాన్ని ప్రజల ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై బుధవారం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు ఆయన ఒక లేఖ రాశారు. నిర్మాణ జాప్యంతో దేశానికి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా అపారమైన నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చాలని నిర్ణయం తీసుకొంది. పనులు నిలిపివేసి ఆ తర్వాత ఆరు నెలలకు కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఈ ఆరు నెలల్లో ప్రాజెక్టు వద్ద పనులను ఏ కాంట్రాక్టర్‌ కూడా పర్యవేక్షించలేదు. కాంట్రాక్టర్‌ను మార్చడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ప్రాజెక్టు వరద నిర్వహణ పనులు చేపట్టలేదు. దీంతో ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ దెబ్బ తింది. ఈ వాల్‌ను ఒక ప్రఖ్యాత ఏజెన్సీ నదీగర్భంలో 40 నుంచి వంద మీటర్ల లోతు వరకూ నిర్మించింది. ప్రాజెక్టు పనులు సంతృప్తికరంగా నడుస్తున్న సమయంలో కాంట్రాక్టర్‌ను మార్చడం కానీ, మళ్లీ టెండర్లు పిలవడం కానీ చేయవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలువరించే ప్రయత్నం చేసింది. ఆర్థిక భారం పెరుగుతుందని, పని జాప్యం అవుతుందని కూడా హెచ్చరించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం వినకుండా పనులు ఆపేసి కాంట్రాక్టర్‌ను మార్చే ప్రక్రియ చేపట్టింది. ఈ తప్పిదం మూలంగా డయాఫ్రం వాల్‌ దెబ్బతింది.

*కాపలాదారే దోపిడీ: నాదెండ్ల
కాపాలాదారే దోపిడీ కి పాల్పడినట్లు ప్రభుత్వమే ఉద్యోగుల జీపీఎఫ్‌ సొమ్మును మాయం చేయడం విస్మయం కలిగిస్తోందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ప్రభుత్వం రూ. 800 కోట్లు మళ్లించినట్లు తెలుస్తోందని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ డబ్బును ఎటు మళ్లించారో సీఎం జగన్‌ సమాధానం చెప్పాలన్నారు. ఉద్యోగుల సొమ్మును వారికి తెలియకుండా తీసేసుకోవడమంటే మోసం చేయడమేనన్నారు. జీపీఎఫ్‌ ఖాతాల్లోని సొమ్మును డ్రా చేసుకునే అధికారం ఉద్యోగికి మాత్రమే ఉంటుందని వివరించారు. రిటైరయిన ఉద్యోగుల కు బెనిఫిట్స్‌ ఇవ్వకుండా నిలుపుదల చేస్తోందని విమర్శించా రు. కాగా, జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పార్టీ సిద్ధాంతాలను వివరించేందుకు క్రియాశీలక సభ్యులకు అవగాహన తరగతులు నిర్వహిస్తామన్నారు.

*సిద్దిపేట గురుకులంలో ఆహార కల్తీ: గీతారెడ్డి
సిద్దిపేట మైనార్టీ గురుకులంలో ఆహార కల్తీ జరిగి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఈ విషయాన్ని బయటపడకుండా దాచారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి ఆరోపించారు. పవర్‌ఫుల్‌ మంత్రి హరీశ్‌ రావు నియోజకవర్గంలో ఈ ఘటన జరిగిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.