అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న అమెరికా తెలుగు సంఘం ఆటా 17వ మహాసభలు రెండో రోజు వేడుకలు శనివారం ఉదయం వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటరులో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివాసీలు, కోయ, లంబాడా జానపద నృత్యాలు, సంగీత కార్యక్రమల అనంతరం ఆటా కార్యవర్గం పూర్ణకుంభంతో సభికులకు స్వాగతం పలికారు. అధ్యక్షుడు భువనేష్ బూజాల, తెలంగాణా మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, నిరంజన్‌రెడ్డి, విశాఖ ఎంపీ ఎం.వీ.వీ.సత్యనారాయణ, ఆటా కన్వీనర్ సుధీర్ బండారులు జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు ప్రారంభించారు. అధ్యక్షుడు భువనేష్, కన్వీనర్ సుధీర్‌లు స్వాగతోపన్యాసం చేసి అతిథులను ఆహ్వానించారు. రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా తమన్ సంగీత విభావరి, YSR జయంతి , అందాల పోటీలు, బిజినెస్ ఫోరం, సాహిత్య, రాజకీయ ఫోరంలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ఆటా మాజీ అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి, తదుపరి అధ్యక్షురాలు మధు బొమ్మినేని, తానా ప్రతినిధులు, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, ఏపీ అధికార భాష సంఘం అధ్హ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభమైన “ఆటా” రెండోరోజు వేడుకలు
Related tags :