DailyDose

3న విజయవాడలో జనసేన.. జనవాణి -TNI తాజా వార్తలు

3న విజయవాడలో జనసేన.. జనవాణి -TNI  తాజా వార్తలు

* సామాన్యుడి ఘోష వినేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 3, 10వ తేదీల్లో విజయవాడలో జనవాణి జనసేన భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాడెండ్ల మహోహర్‌ తెలిపారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమం ఒక బూటకమన్నారు. రాష్ట్రంలోని ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. అందుకే జనసేన అధినేత చొరవ తీసుకుని జనవాణి జనసేన భరోసా కార్యక్రమాన్ని ఈనెల 3,10 తేదీల్లో విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌ ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారని, సంబంధిత విభాగాలకు వాటిని పంపడంతోపాటు వాటి పరిష్కారంపై ఫాలోఅప్‌ ఉంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జూలై 12 నుంచి తమ కార్యకర్తలు ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తారన్నారు.

*ఓ ఇద్ద‌రు ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. ఇద్ద‌రిలో ఒకరు హైద‌రాబాద్‌కు చెందిన అధికారి కాగా, మ‌రొక‌రు విశాఖ‌ప‌ట్ట‌ణంకు చెందిన ఆఫీస‌ర్‌.సీబీఐ అధికారుల క‌థ‌నం ప్ర‌కారం.. టీడీఎస్ స‌ర్టిఫికెట్ ఇచ్చేందుకు ఓ వ్య‌క్తి నుంచి ఇద్ద‌రు ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు రూ. ల‌క్ష డిమాండ్ చేశారు. హైద‌రాబాద్ ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు సంబంధించిన అడిష‌న‌ల్ సీఐటీ ఆఫీస్‌లో ప‌ని చేస్తున్న సీనియ‌ర్ ట్యాక్స అసిస్టెంట్, వైజాగ్‌లో ప‌ని చేస్తున్న మ‌రో సీనియ‌ర్ ట్యాక్స్ అసిస్టెంట్ క‌లిసి స‌ద‌రు వ్య‌క్తిని రూ. ల‌క్ష డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తంలో లంచం ఇవ్వ‌లేన‌ని బాధిత వ్య‌క్తి తెలిపాడు. మొత్తంగా రూ. 60 వేలు ఇస్తాన‌ని బాధితుడు ఒప్పుకున్నాడు. అనంత‌రం సీబీఐ అధికారుల‌ను ఆశ్ర‌యించాడు. ఇవాళ హైద‌రాబాద్ ఆఫీస‌ర్‌కు రూ. 40 వేలు లంచం ఇస్తుండ‌గా సీబీఐ అధికారులు అత‌న్ని ప‌ట్టుకున్నారు. వైజాక్ అధికారికి ఆన్‌లైన్‌లో పే చేసిన‌ట్లు నిర్ధారించారు. ఈ ఇద్ద‌రు అధికారుల నివాసాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు.

* ఉద‌య్‌పూర్‌లో టైల‌ర్ క‌న్హ‌య‌లాల్ హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడు రియాజ్ బీజేపీ స‌భ్యుడ‌ని కాంగ్రెస్ శ‌నివారం ఆరోపించింది. క‌న్హ‌యలాల్ హ‌త్య కేసును కేంద్రం ఎన్ఐఏకు అప్ప‌గించ‌డంపై సందేహం వ్య‌క్తం చేసింది. ఉద‌య‌పూర్ ఘ‌ట‌న‌లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగుచూశాయ‌ని కాంగ్రెస్ మీడియా విభాగం చీఫ్ ప‌వ‌న్ ఖేరా పేర్కొన్నారు.బీజేపీ నేత‌, రాజ‌స్ధాన్ మాజీ హోంమంత్రి గులాబ్ చంద్ క‌టారియా పాల్గొన్న కార్య‌క్ర‌మాల‌కు రియాజ్ త‌ర‌చూ హాజ‌ర‌య్యేవాడ‌ని ఇందుకు సంబంధించిన ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ని అన్నారు. బీజేపీ రాజ‌స్ధాన్ మైనారిటీ విభాగం స‌మావేశాల‌కు రియాజ్ హాజ‌ర‌వుతుంటాడ‌ని, ఈ ఫోటోలు కూడా బ‌హిర్గ‌తమ‌య్యాయ‌ని చెప్పారు. రియాజ్ కాషాయ పార్టీ నేత‌ల‌కు స‌న్నిహితుడే కాకుండా బీజేపీ స‌భ్యుడని ఖేరా పేర్కొన్నారు.

*నెల్లూరు జిల్లా సైదాపురం తహశీల్దార్ కార్యాలయంలో ఏసిబి అధికారులు సోదాలు. కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేస్తున్న ఏసిబి అధికారులు. ఏసిబి అధికారులు స్వాధీనంలో సైదాపురం తహసీల్దార్ కార్యాలయం….

*ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో క్రూర జంతువుల సంచారంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. నిన్న,మొన్నటి వరకు కాకినాడ, అనకాపల్లి జిల్లాలో నెలరోజులుగా గ్రామస్థులకు, అటవీశాఖ అధికారులకు ఓ పులి ముచ్చెమటలు పట్టిస్తుంది. దాని జాడను కనుక్కొవడానికి, దానిని పట్టుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్నారు. తాజాగా చిత్తూరు మండలం వి.కోట మండలం నాయకనేరి గ్రామంలో చిట్టిబాబు అనే రైతుకు చెందిన ఆవును చిరుతపులి చంపివేసింది.

*భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం హెచ్ఐసిసి లో ప్రారంభమయ్యాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశాలను ప్రారంభించారు. సమావేశాలకు ప్రధాని మోదీ, అమిత్‌షా, పలువురు కేంద్రమంత్రులు,బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు హాజరయ్యారు.రెండ్రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న సమావేశాలు జరుపుకుంటున్నారు. ఈసమావేశాల్లోనే 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణులను పార్టీ హైకమాండ్ సిద్ధం చేయనుంది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే దిశగా చర్చలు జరగనున్నాయి. తెలంగాణలో బిజెపి పాగా వేయడానికి ప్రధాన మంత్రి మోదీ రోడ్‌మ్యాప్‌ ఇవ్వనున్నారు.

*కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకు కరోనా పాజిటివ్.హైద్రాబాద్ లో హోం ఐసోలేషన్ లో ఉన్న ఎమ్మెల్యే వంశీ.
ఇటీవల పంజాబ్ రాష్ట్రంలోని మొహలీ ఐఎస్ బీ క్యాంపస్ లో క్లాసులకు వెళ్లిన ఎమ్మెల్యే వంశీ‌. 14 గంటలు క్యాంపస్ లోనే గడపాల్సి రావడం అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. హైద్రాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించగా ఎమ్మెల్యే వంశీ కి కరోనా సోకింది అని వైద్యులు వెల్లడి.గతంలో కూడా వంశీ కరోనా బారినపడ్డారు. ఎమ్మెల్యే హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని, కోలుకున్న అనంతరం నియోజవర్గానికి వస్తారని ఆయన సన్నిహితులు వెల్లడి.

*టీఆర్‌ఎస్‌ మద్దతిస్తున్నందుకు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కేసీఆర్‌ వివరించారని ఆయన చెప్పారు. తెలంగాణలో ప్రజాచైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నానని చెప్పారు. కేటీఆర్‌ ఢిల్లీకి వచ్చి తనకు మద్దతు ప్రకటించారని చెప్పారు. చాలారోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమన్నారు.

*ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ పాలకొల్లులో టీడీపీ( వినూత్నరీతిలో నిరసన చేపట్టింది. శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు , ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ఆ ర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సులు కడిగి శుభ్రం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచనన్నారని… అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ చార్జీలు 3 సంవత్సరాలలో మూడు సార్లు పెంచి రూ.3 వేల కోట్ల భారం మోపారని మండిపడ్డారు. కేంద్రం డీజిల్ ధర రూ.10 తగ్గిస్తే జగన్ డీజిల్ సెస్ పేరుతో రివర్స్‌లో బాదుతున్నారని అన్నారు. జగన్ బాదుడులో 62 శాతం ప్రయాణం చేసే పల్లెవెలుగును వదలలేదని, చదువుకునే విద్యార్థులను కూడా వదలలేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు.

*కేంద్ర ప్రభుత్వం మూడు సెంట్రల్ సెక్రటేరియట్ కేడర్స్‌ ఉద్యోగులకు సామూహిక పదోన్నతులు కల్పించింది. దీంతో దాదాపు 8,000 మంది లబ్ధి పొందుతారు. సామూహిక పదోన్నతుల కోసం జారీ చేసిన భారీ ఆదేశాల్లో ఇదొకటి. ప్రభుత్వోద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో గతంలో ఈ పదోన్నతులు నిలిచిపోయాయి.

*రాష్ట్ర రాజధానిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ హ్యాపీ నెస్ట్‌ కు ఏపీ సర్కార్మం గళం పాడింది. హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్ట్‌ పేరుతో రాజధానిలోని కీలక ప్రాంతాలో ఫ్లాట్ల నిర్మాణానికి ఆన్‌లైన్‌లో ఏపీ జనం ఎగబడిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో ఈ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్ల కొనుగోలుకు అప్పట్లో భారీగా డిమాండ్‌ ఏర్పడింది. ఎన్‌ఆర్‌ఐ లు, ఏపీ వాసుల నుంచి వెల్లువెత్తిన డిమాండ్‌తో మరిన్ని కొత్త ప్రాజెక్ట్‌లకు కూడా అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. కాగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత హ్యాపీ నెస్ట్‌ ప్రాజెక్ట్‌ను అధికారులు పక్కన పడేశారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రాజెక్ట్‌కు పంగనామాలు పెట్టారు. అపార్ట్‌మెంట్లను లాటరీలో దక్కించుకున్న వారు కట్టిన డిపాజిట్‌‌ను వెనక్కి తీసుకోవచ్చని సీఆర్‌డీఏ కమిషన్‌ లేఖ రాశారు. హ్యాపీ నెస్ట్‌లో ఫ్లాట్లు కొనుగోలుచేసిన వారందరికీ సీఆర్‌డీఏ కమిషనర్‌ ఈ మేరకు లేఖ పంపారు.

*రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. శుక్రవారం 1073 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 1008, మైసూరు 12, దక్షిణకన్నడ 10, బళ్లారి 9, తుమకూరు 8 మంది కాగా మిగిలిన జిల్లాల్లో ఐదుగురిలోపు నమోదయ్యారు. పది జిల్లాల్లో కేసులు నమోదు కాలేదు. 834 మంది కోలుకోగా గడిచిన 24 గంటల్లో బెంగళూరులో ఒకరు మృతిచెందారు. 6,134 మంది చికిత్స పొందుతుండగా బెంగళూరులో 5814 మంది ఉన్నారు

*తిరుమలలో ప్లాస్టిక్‌ నిరోధానికి డీఆర్డీవో తనవంతు కృషి చేస్తుందని ఆ సంస్థ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి తో కలసి లడ్డూ ప్రసాద కౌంటర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి ప్రసాదాన్ని ప్లాస్టిక్‌ కవర్లలో అందించే బదులుగా వాతావరణంలో కలిసిపోయే ఉండే బయోడిగ్రెబుల్‌ కవర్లను తయారు చేసేందుకు డీఆర్‌డీవో చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

*తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి ఆల‌యానికి, ఇతర ఉపాలయాలకు 2022-23 సంవత్సరానికి గాను అర‌టిపండ్లు, త‌మ‌ల‌పాకులు, టెంకాయ‌లు, నిమ్మకాయ‌లు త‌దిత‌ర పూజా సామ‌గ్రి సరఫరాకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈనెల 8వ తేదీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌లోపు టెండరు షెడ్యూల్ పొంద‌వ‌చ్చని వివరించారు.ఆలయ‌ డిప్యూటీ ఈవో కార్యాలయంలో జులై 20వ తేదీన మధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు టెండ‌ర్లు స్వీక‌రిస్తారని చెప్పారు. అదేరోజు మ‌ధ్యాహ్నం 3.30 గంటలకు టెండర్లు తెరుస్తారని, ఇతర వివరాలకు డిప్యూటీ ఈవో కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

*ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్న వెంటనే తెలుగులో ట్వీట్‌ చేశారు.డైనమిక్‌ సిటీ హైదరాబాద్‌ చేరుకున్నానని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నవేళ తాను హైదరాబాద్ వచ్చినట్టు పేర్కొన్నారు.పార్టీ బలోపేతంపై చర్చిస్తామని ట్విటర్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ ట్వీట్‌కు మంత్రి తలసాని వెంటనే స్పందించారు.హైదరాబాద్‌ను డైనమిక్‌ సిటీగా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.

*తెలంగాణలో మరో 1663 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి నిచ్చింది. ఇంజనీరింగ్‌ విభాగంలో 1,522 పోస్టులు, నీటిపారుదలశాఖలో 704 ఏఈఈ, 227 ఏఈ, 212 టెక్నికల్‌ పోస్టులకు అనుమతినిచ్చింది. అలాగే నీటిపారుదలశాఖలో 95 టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు భర్తీకి అనుమతినిచ్చింది. భూగర్భ జలశాఖలో 88, ఆర్‌అండ్‌బీలో 38 ఏఈ, 145 సివిల్‌ ఏఈఈ 13 ఎలక్ట్రిక్‌ ఏఈఈ, 60 టెక్నికల్‌ ఆఫీసర్‌, 27 అసిస్టెంట్‌ పోస్టులు, ఆర్థికశాఖలో 53 డివిజనల్‌ అకౌంట్స్‌ పోస్టుల భర్తీకి అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

*ప్రధాని మోదీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. తెలంగాణకు మోదీ అన్యాయం చేశారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాలకై టీఆర్‌ఎస్‌ డ్రామాలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలు.. కేంద్రం చేసిన హత్యలేనన్నారు. చట్టబద్ధత కల్పించాల్సిన అంశాలను బీజేపీ పక్కన పెట్టిందన్నారు. సీఎం కేసీఆర్‌ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించాల్సిన సమయంలో హోర్డింగ్‌ల పంచాయితీ పెట్టారని వ్యాఖ్యానించారు.

* అమెరికాలో ప్రముఖ వైద్యులు డాక్టర్. వాసుదేవరెడ్డి ఆర్. నలిపిరెడ్డిని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఎన్.ఆర్.ఐ మెడికల్ అఫైర్స్ అడ్వయిజర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలు మరింత మెరుగుదలకు, చిన్న పిల్లల జబ్బుల నివారణకు డాక్టర్ వాసుదేవరెడ్డి కృషి చేయనున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్ ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు డాక్టర్లను సమస్వయం చేసి తమ సొంత గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా పాటు పాడుతానని పేర్కొన్నారు. అమెరికాలో అమలవుతున్న అత్యంత అధునాతన వైద్య సేవలు, టెలి మెడిసిన్ రంగం ఆంధ్రప్రదేశ్ కు చేరువ అయ్యేలా పనిచేస్తామని అన్నారు.వైద్య రంగంలో మౌళిక సదుపాయాల కల్పన కోసం పెట్టుబడుల సేకరణకు, నిధుల సమీకరణకు కృషి చేస్తానని వాసుదేవరెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం బుచ్చిరెడ్డి కండ్రిగ వాసుదేవరెడ్డి స్వస్థలం. సిద్దార్థ మెడికల్ కాలేజీ విజయవాడలో ఎంబిబీఎస్ పూర్తి చేశారు. అసంతరం అమెరికా వెళ్లి మెల్ బోర్న్ (ఫ్లోరిడా రాష్ట్రం)లో వైద్యులుగా స్థిరపడ్డారు. గత 22 రెండేళ్లుగా ఎం.డీ ఫ్యామిలీ మెడిసిన్, ఎం.ఎస్ పబ్లిక్ హెల్త్ నిపుణులుగా సేవలు అందిస్తున్నారు

*ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్‌ సోకింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారు ముందుస్తుగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విన్నవించారు.ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇవాళ 223 కేసులు నమోదుగా కాగా 114 మంది రికవరి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 977 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్యాధికారులు వెల్లడించారు .

*హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ని ఆలయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. యూపీ సీఎం యోగి (Yogi) భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న నేపథ్యంలో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల యోగి భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం రేపటికి వాయిదా పడింది. అయినప్పటికీ ముందస్తు చర్యల్లో భాగంగా చార్మినార్ వద్ద పోలీసులు మోహరించారు. మరోవైపు చార్మినార్ వద్ద టీఆర్ఎస్ నేతల బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు మోహరించారు. హైదరాబాద్ సిటీ ఆర్మ్ రిజర్వ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ తెలంగాణ పోలీస్ బెటాలియన్ బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సౌత్ జోన్ డీసీపీ చైతన్య ఆధ్వర్యంలో పోలీస్ భద్రత పర్యవేక్షణ జరుగుతోంది.

*గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ లో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల పంజాబ్ రాష్ట్రంలోని మొహలీ ఐఎస్‌బీ క్యాంపస్‌ లో క్లాసులకు వెళ్లారు. 14 గంటలు క్యాంపస్‌లోనే గడపాల్సి రావడంతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించగా ఎమ్మెల్యే వంశీకి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. గతంలో కూడా వంశీ కరోనా బారినపడ్డారు. వంశీ హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని, కోలుకున్న అనంతరం నియోజవర్గానికి వస్తారని ఆయన సన్నిహితులు వెల్లడించారు.

*పల్నాడు: జిల్లాలోని అచ్చంపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద ఓ బ్రాహ్మణ కుటుంబం శనివారం ఉదయం నిరసనకు దిగింది. పేద బ్రాహ్మణుల పోలం కౌలువేలం జరిపారంటూ ఆందోళన చేపట్టింది. సదావర్తిసత్రం సంభందించిన కెవీ పాలెంలోని వ్యవసాయ భూమిలో తన పొలంతో కలిపి కౌలువేలం జరిపారంటూ పురుషోత్తమ ప్రసాద్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమకు చెందిన పొలం కౌలువేలంపాట నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తమకు చెందిన వ్యవసాయ భూమి కౌలువేలం వేయడానికి వీలులేదన్నారు. వ్యవసాయ భూమిపై తమకు పూర్తి హక్కులున్నాయన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఈవో అక్రమంగా బహిరంగ కౌలువేలం జరిపారని మండిపడ్డారు. తనకు న్యాయం చేయాలని…లేని పక్షంలో కుటుంబ సభ్యులతో కలిసి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని పురుషోత్తమ ప్రసాద్ శర్మ ఆవేదన చెందాడు.

*ఇరాన్ దేశంలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దక్షిణ ఇరాన్ దేశం హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లోని ఓడరేవు నగరమైన బందర్ అబ్బాస్‌కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైందని శాస్త్రవేత్తలు చెప్పారు.ఈ భూకంపం ప్రభావం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. గత ఏడాది నవంబర్‌లో రిక్టర్ స్కేలుపై 6.4, 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపాల కారణంగా హార్మోజ్‌గాన్‌ ప్రావిన్స్‌లో ఒకరు చనిపోయారు.పలు టెక్టోనిక్ ప్లేట్ల అంచున వివిధ ఫాల్ట్ లైన్‌లను దాటుతున్న ఇరాన్ దేశం బలమైన భూకంప కార్యకలాపాల ప్రాంతంగా పేరొందింది.1990వ సంవత్సరంలో ఇరాన్ దేశంలో అత్యంత ఘోరమైన భూకంపం సంభవించింది. 1990లో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఉత్తర ఇరాన్ దేశంలో 40,000 మంది మరణించారు.

*అలిపిరి కాలినడక మార్గంలో శుక్రవారం సుమారు ఆరడుగుల పొడవున్న నాగుపాము భక్తులను హడలెత్తించింది. అడవి నుంచి 3,400 మెట్టుకు సమీపానికి వచ్చిన నాగుపామును చూసి.. భక్తులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. దగ్గర్లోని భద్రతా సిబ్బంది వెంటనే పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి భాస్కర్‌నాయుడికి సమాచారం ఇచ్చారు. ఆయనొచ్చి.. ఆ పామును చాకచక్యంగా పట్టుకుని, దట్టమైన అడవిలో విడిచిపెట్టారు.

*సికింద్రాబాద్‌: నగరంలోని వివిధ మార్గాల్లో రాకపోలకు సాగించే పలు ఎంఎంటీఎస్‌ రైళ్లను ఈనెల 3వ తేదీన (ఆదివారం) రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్‌ మార్గంలో 9 సర్వీసులు, హైదరాబాద్‌-లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో 7 సర్వీసులు, సికింద్రాబాద్‌-లింగంపల్లి మార్గంలో ఒక సర్వీసు, లింగంపల్లి-సికింద్రాబాద్‌ మార్గంలో ఒక సర్వీసును రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

*రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఊరట! కొత్తగా రూ.3 వేల కోట్ల అప్పు రాష్ట్రానికి దక్కనుంది! కేంద్రం కనికరిస్తే ఈ త్రైమాసికంలో మరో రూ.6వేల కోట్ల రుణం కూడా లభిస్తుంది. దీనికి నెలవారీగా ఇండెంట్లు పెట్టాల్సి ఉంది. ప్రతి ఇండెంటుకూ కేంద్రం అనుమతి తప్ప నిసరి. తొలి త్రైమాసికంలో ఇలాంటి ఇండెంట్లకు అవకాశమున్నా.. కేంద్రం అనుమతించకపోవడంతో రాష్ట్ర సర్కారు అప్పు తీసుకోలేకపోయింది. ఈసారీ అలాంటి పరిస్థితులే ఎదురవుతాయా లేక ఎప్పటికప్పుడు కేంద్రం అనుమతిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు మాత్రం ‘కేంద్రం దయ.. మన ప్రాప్తం’ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. రిజర్వ్‌ బ్యాంకు రాష్ట్రాల అప్పులకు సంబంధించి రెండో త్రైమాసిక (జూలై- ఆగస్టు- సెప్టెంబరు) కేలండర్‌ను విడుదల చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్బీఐ వేలం పాట కోసం రూ.3000 కోట్లకు ఇండెం టు పెట్టింది. 5న జరిగే వేలంలో ఈ అప్పును తీసుకోనుంది. కేంద్రం అనుమతించడంతో ఈ అప్పు లభించనుంది. దీంతో పాటే ఈ త్రైమాసికంలో రాష్ట్రానికి రూ.9వేల కోట్ల అప్పు తీసుకునే అవకాశం ఉంది. కేలండర్‌ ప్రకారం.. ఈ నెల 5న రూ.3వేల కోట్లు, ఆగస్టు 2న రూ.2వేల కోట్లు, ఆగస్టు 29న రూ.1000 కోట్లు, సెప్టెంబరు 13న రూ.1000 కోట్లు, సెప్టెంబరు 27న రూ.2వేల కోట్లు.. మొత్తం రూ.9వేల కోట్ల అప్పు తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ, వీటికి కేంద్రం నుంచి అనుమతులు లభించాల్సి ఉంది.

*రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంటా నరహరి శుక్రవారం ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బెంగుళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయన 17-18 సంవత్సరానికి రాష్ట్రపతి నుంచి ఉత్తమ యువ పారిశ్రామికవేత్తగా అవార్డు అందుకొన్నారు. తన వ్యాపార కార్యకలాపాల ద్వారా వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన దివంగత ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడుకు సమీప బంధువు. డీకే సతీమణి, మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ సోదరికి నరహరి అల్లుడు అవుతారు. రాజంపేట లోక్‌సభ స్థానానికి ఆయన టీడీపీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. శ్రీనివాసరెడ్డి, నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి, బత్యాల చెంగల్రాయుడు, దమ్మాలపాటి రమేశ్‌, చల్లా బాబు రెడ్డి తదితరులు ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

* ఆరోగ్యకర సమాజ స్థాపనలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమైనదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ జంక్షన్‌లోని అంకోశా సమావేశ మందిరంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ కొవిడ్‌ సమయంలో ప్రాణాలను లెక్క చేయకుండా వైద్యులు అందించిన సేవలు మరువలేనివని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పేదవారికి ఉచితంగా మంచి వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి ప్రతి గ్రామంలో ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్‌ వైద్యులను ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు.

*ఆన్‌లైన్‌ ద్వారా సినిమా టికెట్లు విక్రయించే వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ దూకుడుకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. శనివారం నుంచి ప్రవేశపెట్టనున్న ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయ విధానాన్ని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ సినిమా రెగ్యులేషన్‌ సవరణ చట్టంతో(యాక్ట్‌ 12/2021) పాటు తదనంతరం జారీ చేసిన జీవోల అమలును నిలుపుదల చేసింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోతే పిటిషనర్లకు తీవ్రనష్టం జరుగుతుందని అభిప్రాయపడింది. బుక్‌ మైషో, తదితర సంస్థలు థర్డ్‌ పార్టీలతో చేసుకున్న ఒప్పందాలకు ఇబ్బందులు కలుగుతాయని పేర్కొంది. జూలై 2లోగా ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్తవిధానంలోకి మారకపోతే మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌ , సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్‌ యాజమాన్యాలు తమ లైసెన్స్‌లు కోల్పోయే ప్రమాదం ఉందని గుర్తు చేసింది. వ్యాజ్యాలపై తుదివిచారణ జరిపేవరకు ఆన్‌లైన్‌ టికెట్‌ విధానాన్ని వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికిగానీ, ప్రేక్షకులకుగానీ ఎలాంటి నష్టం జరగదని పేర్కొంది. పాత విధానంలో వారు టికెట్లు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉందని తెలిపింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకపోతే పిటిషనర్లకు జరిగే నష్టాన్ని పూడ్చలేమని అభిప్రాయపడింది.

*తిరుమలలో సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. కొవిడ్‌ ప్రభావం తగ్గిన నేపథ్యంలో రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో వాహనసేవల నిర్వహిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్‌తో కలిసి శుక్రవారం ధర్మారెడ్డి తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. సెప్టెంబరు 27న సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్‌.. శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారన్నారు.

* విజయవాడ – చెన్నై మధ్య నడిచే పినాకిని ఎక్స్‌ప్రె్‌సకు శుక్రవారం విజయవాడ రైల్వేస్టేషన్‌లో 30వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఎస్‌సీఆర్‌ ఫ్యాన్స్‌ క్లబ్‌ నేతృత్వంలో 30 మందికి పైగా ఔత్సాహిక అభిమానులు ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా రైలును అందంగా ముస్తాబు చేసి ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి తెప్పించి. కేక్‌ కట్‌ చేశారు. అనంతరం బెజవాడ డివిజన్‌ పీఆర్వో నుస్రత్‌ మండ్రూపకర్‌, ఎలక్ర్టిక్‌ లోకోషెడ్‌ (ఈఎల్‌ఎస్‌) సీనియర్‌ డీఈఈ దినేశ్‌రెడ్డి పచ్చజెండా ఊపి.. షెడ్యూల్‌ ప్రకారం రైలును ముందుకు సాగనిచ్చారు.

*టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి కేసులు నమోదు కాకుండా ఆయన ఇంటి వద్దకు పోలీసులను పంపొద్దని తేల్చి చెప్పింది. పిటిషనర్‌పై తాజాగా ఏమైనా కేసులు నమోదుచేస్తే చట్ట నిబంధనల మేరకు నడుచుకోవాలని పోలీసులకు స్పష్టంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా అయ్యన్నపాత్రుడిపై ఎలాంటి కేసులు నమోదు కాలేదని డీజీపీ రాతపూర్వకంగా చెప్పిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ శుక్రవారం ఆదేశాలిచ్చారు. పిటిషనర్‌పై ఇప్పటికే నమోదైన 11కేసుల విషయంలో కోర్టు రక్షణ కల్పించిందని గుర్తుచేశారు.

*నూతన ఆలోచనలను ప్రోత్సహించే ప్రక్రియలో భాగంగా స్మార్ట్‌ ఐడియాథాన్‌-2022 పేరిట ఆగస్టు 10, 11 తేదీల్లో జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్టు గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం చీఫ్‌ ఇన్నోవేటివ్‌ ఆఫీసర్‌ ఎన్‌.క్రి్‌ష తెలిపారు. వర్సిటీలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పోటీల వివరాలు వెల్లడించారు. ఈ పోటీలకు అమెరికాలోని నార్త్‌ ఈస్టర్న్‌ యూనివర్సిటీ సహకారం అందిస్తోందని తెలిపారు. గీతం వెంచర్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ (వీడీసీ)తో పాటు స్టార్ట్‌ ఆఫ్‌ ఇండియా, ఇన్‌వె్‌స్ట ఇండియా సంయుక్తంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నాయని ఆయన వెల్లడించారు. వీడీసీ డిప్యూటీ డైరెక్టర్‌ మనీష్‌ వారియర్‌ మాట్లాడుతూ.. దేశంలోని ఔత్సాహికుల్లో స్టార్టప్‌ ఆలోచనలు ప్రోదిచేయడం ఈ పోటీల లక్ష్యమని చెప్పారు. ఆహారం, వ్యవసాయం, హరిత, సాంకేతిక పరిజ్ఞానం, వ్యర్థాల నిర్వహణ, ఆరోగ్య సంబంధ సాంకేతిక పరిజ్ఞానం, నీటి వనరుల నిర్వహణ వంటి అంశాల్లో నూతన ఆవిష్కరణలతో ఈ పోటీల్లో పాల్గొనవచ్చని సూచించారు. గీతం విద్యార్థులే కాకుండా దేశంలోని ఏ ప్రాంతం యువత అయినా పోటీల్లో పాల్గొనవచ్చని మనీష్‌ తెలిపారు. ఎంపికైన బృందాలకు అమెరికాలోని బోస్టన్‌ యూనివర్సిటీలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ఆర్థిక సహాయం గీతం వర్సిటీ అందిస్తుందని తెలిపారు.

*జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ శుక్రవారం భేటీ అయ్యారు. రాధా కార్యాలయానికి పక్కనే ఉన్న మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జనసేన జనవాణి కార్యక్రమ ఏర్పాట్లను మనోహర్‌ పరిశీలించారు. అదే సమయానికి తన కార్యాలయానికి వచ్చిన రాధా టీ తాగడానికి తన కార్యాలయానికి ఆహ్వానించారు. దీంతో రాధా జనసేనలో చేరుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్స్‌లు నడిచాయి. భేటీ అనంతరం వారిద్దరూ ఇది సరదా కలయిక అని ప్రకటించారు. లేనిపోని హడావుడి చేయవద్దని రాధా విలేకరులకు చెప్పారు.

*బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న అతిథులకు ఇక్కడి వంటకాలు ఎప్పటికీ గుర్తుండుపోయేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ప్రత్యేక వంటకాలతో మెనూ సిద్ధమైంది. హైదరాబాద్‌ బిర్యానీతో పాటు తెలంగాణ ప్రత్యేక వంటకాలు, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాల ప్రసిద్ధ వంటకాలు ఈ మెనూలో ఉన్నాయి. 60 రకాల కూరలు, 40 రకాల స్వీట్లతో పాటు ఉదయం అల్పాహారంలో 20 రకాలను అతిథుల కోసం సిద్ధం చేస్తున్నారు. చామగడ్డ ఫ్రై, లాల్‌మార్ట్‌కీ సబ్జి, చిక్కుడుకాయ టమోటా కూర, ఆలుగడ్డ కూర, వంకాయ మసాల, దొండకాయ కొకొనట్‌ ఫ్రై, బెండకాయ- కాజూ పల్లి ఫ్రై, తోటకూర టమోటా ఫ్రై, బీరకాయ మిల్‌మేకర్‌ కర్రీతోపాటు ఉత్తర, దక్షిణ భారత వంటకాలు వండుతున్నారు. స్వీట్ల జాబితాలో డబుల్‌కా మీఠా, ఖుబానీకా మీఠా, రెడ్‌ వెల్వెట్‌ రస్‌ మలాయ్‌, నువ్వుల లడ్డూలు, పరమాన్నం, సేమియా పాయసం, భక్ష్యాలు, అరిసెలు ఉన్నాయి.

*హైదరాబాద్‌, నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన జెండాలు, తోరణాలను కాంగ్రెస్‌ నేతలు శుక్రవారం తొలగించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో బీజేపీ, రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హాకు మద్దతుగా నిర్వహించే సభ కోసం టీఆర్‌ఎస్‌ జెండాలు కట్టాయి. యువజన కాంగ్రెస్‌ నేత అనిల్‌, పలువురు వీటిని తొలగించారు.

*‘శివసేన అంతర్గత రాజకీయాల్లో బీజే పీ జోక్యం చేసుకుని మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూలదోసింది. ఇప్పుడు తెలంగాణపై దృష్టిసారించింది. అందుకే హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ స మావేశాలు పెడుతోంది’’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ‘‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ను అడ్డుపెట్టుకుని వరుసగా ఎనిమిది రాష్ట్రాల ప్రభుత్వాలను కూలదోసిన ప్రధాని మోదీ, అమిత్‌ షా దురహంకార వైఖరిని బీజేపీ జాతీయ కార్యవర్గం సమర్థిస్తుందా? లేదా? స్పష్టం చేయాలి. ఈడీని అడ్డగోలుగా ఉపయోగించుకుంటామని ఈ సమావేశాల్లో తీర్మానం చేయగలరా?’’ అని డిమాండ్‌ చేశారు. శుక్రవారం మగ్దూంభవన్‌లో పార్టీ నేతలు పల్లా వెంకట్‌రెడ్డి, అజీజ్‌ పాషాతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. మోదీ.. పార్టీ సమావేశాలకు వస్తున్నందున తాము ఎలాంటి నిరసనలు తెలపబోమన్నారు.

* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కాసిపేట బాలుర గురుకుల పాఠశాలలో శుక్రవారం 9 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. రెండు రోజుల క్రితం పాఠశాలలోని ఒక విద్యార్థికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో 350 మందికి పరీక్షలు చేయించారు. తాజాగా పాజిటివ్‌ వచ్చినవారిని తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులను శానిటైజ్‌ చేయించారు. కాగా, రాష్ట్రంలో శుక్రవారం 25,518 పరీక్షలు చేయగా 462 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనే 259 పాజిటివ్‌లు వచ్చాయి. మేడ్చల్‌లో 40, రంగారెడ్డి జిల్లాలో 35, ఖమ్మం, సంగారెడ్డి జిల్లాల్లో 15 చొప్పున కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి. ఆస్పత్రుల్లో 68 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం 4,702 యాక్టివ్‌ కేసులున్నాయి.

*ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వ ప్రత్యేక ప్రతినిధిగా పార్లమెంటు మాజీ సభ్యుడు మందా జగన్నా థం నియమితులయ్యారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆయనకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ఆయన గతంలో కూడా ఈ పదవిని నిర్వహించారు.

*పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకొని భద్రాచలంలోని సీతారామచంద్రస్వామికి పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా నిత్యకల్యానాన్ని స్వామి వారికి నిర్వహించగా ఈ సమయంలో విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, కంకణదారణ, యోక్తధారణ, శుభముహుర్తం, మాంగ ల్యధారణ, తలంబ్రాలు నిర్వహించారు. అనంతరం పట్టాభిషేక కార్యక్రమంలో భాగంగా విశ్వక్సేన పూ జ, పుణ్యహావచనం, కంకణధారణ, నదీ జలాల ఆవాహన, హోమం, పట్టాభిషేక పారాయణఘట్టం, ప్రోక్షణ కార్యక్రమాలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. సాయంత్రం సంఽఽధ్యాహారతి కార్యక్రమా న్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో దేవస్థానం ఉప ప్రధాన అర్చకులు కోటి శ్రీమన్నారాయాణాచా ర్యులు, ముఖ్య అర్చకులు అమరవాది మధుసూదనాచార్యులు పాల్గొన్నారు.

*ఆరోగ్యకర సమాజ స్థాపనలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమైనదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ జంక్షన్‌లోని అంకోశా సమావేశ మందిరంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ కొవిడ్‌ సమయంలో ప్రాణాలను లెక్క చేయకుండా వైద్యులు అందించిన సేవలు మరువలేనివని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పేదవారికి ఉచితంగా మంచి వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి ప్రతి గ్రామంలో ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్‌ వైద్యులను ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు.

*సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు పై సస్పెన్షన్ ఎత్తివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామిక వ్యవస్థలపై జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత వైఖరి సరికాదన్నారు. వైసీపీ (YCP)కి వత్తాసు పలకని అధికారులను వేధింపులకు గురిచేయటం వల్ల, అధికారుల్లో అభద్రతాభావం నెలకొందని తెలిపారు. కోర్టు తీర్పులను కూడా లెక్క చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. కక్షసాధింపు చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆభాసుపాలైందన్నారు. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసి, ప్రజలకు వ్యవస్థల పట్ల నమ్మకాన్ని కల్పించాలని రామకృష్ణ పేర్కొన్నారు.

*బనగానపల్లెలో టీడీపీ కార్యకర్త ఉప్పరి చెన్నబోయిన సుబ్బరాయుడును రూరల్‌ ఎస్‌ఐ విచక్షణారహితంగా కొట్టారు. ఊపిరి ఆడకపోవడంతో సుబ్బరాయుడును ఆస్పత్రికి తరలించారు. నంద్యాల జిల్లా పెద్దరాజుపాలెం లో సుబ్బరాయుడుకు ఆయన సోదరుడు ఈశ్వరయ్యకు మధ్య పొలం విషయంలో తగాదాలు ఉన్నాయి. సుబ్బరాయుడు పొలంలోకి ఈశ్వరయ్య నీళ్లు వదలడంతో శుక్రవారం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ వివాదంపై విచారించకుండానే సుబ్బరాయుడును ఎస్‌ఐ శంకర్‌నాయక్‌ విచక్షణా రహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడి, ఊపిరి ఆడని పరిస్థితిల్లో ఉన్న సుబ్బరాయుడిని వైద్యశాలకు తరలించారు. టీడీపీ నేత బీసీ జనార్దన్‌రెడ్డి బనగానపల్లె వైద్యశాలలో బాధితుడిని పరామర్శించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.