Movies

పుష్కర ప్రయాణం

Auto Draft

సినీ పరిశ్రమలో పుష్కర కాల ప్రయాణం పూర్తి చేసుకుంది అందాల తార తాప్సీ. ఆమె తొలి సినిమా ‘జుమ్మంది నాదం’ విడుదలై 12 ఏళ్లవుతున్నది. నాయికగానే కాకుండా ఇటీవల నిర్మాతగా మారి ‘బ్లర్‌’, ‘ధక్‌ ధక్‌’ అనే రెండు చిత్రాలను నిర్మిస్తున్నది. ఆమె నటించిన తాజా సినిమా ‘శభాష్‌ మిథూ’ ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతున్నది. భారత దిగ్గజ మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు శ్రీజిత్‌ మఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మిథాలీ పాత్రలో తాప్సీ కనిపించనుంది. ఈ సినిమా కాకుండా ఆమె ఖాతాలో ‘దొబారా’, ‘ఏలియన్‌’, ‘వో లడ్కీ హై కహాన్‌’ వంటి చిత్రాలున్నాయి. షారుఖ్‌ ఖాన్‌ ‘డంకీ’ చిత్రంలోనూ ఆమె నాయికగా నటిస్తున్నది. తాజాగా తాప్సీ మాట్లాడుదతూ…‘నేను నటించినా, నిర్మించినా ఆ సినిమా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటా. కథ విన్నప్పుడు ఎంత కొత్తగా ఉంది అనేది అంచనా వేస్తా. స్క్రిప్ట్‌ నన్ను ఆలోచనలో పడేస్తే అందులో ఏదో భిన్నత్వం ఉన్నట్లే. 12 ఏళ్ల ప్రయాణం ఎంతో సంతృప్తినిచ్చింది’ అని చెప్పింది.