అమెరికా తెలుగు సంఘం (ఆటా) 17వ మహాసభల మూడో రోజు ముగింపు వేడుకల్లో భాగంగా శ్రీనివాస కళ్యాణాన్ని భక్తజనరంజకంగా నిర్వహించారు. తితిదే వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ క్రతువులో అధ్యక్షుడు బూజాల భువనేష్, కన్వీనర్ సుధీర్ బండారు, కార్యవర్గ సభ్యులు భక్తిప్రపత్తులతో పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు, లడ్డూలను అందజేశారు. దాజీ-ఉపాసన కామినేనిల ధ్యాన సదస్సులో ప్రవాసులు పాల్గొన్నారు. త్రిభాషా మహాసహస్రావధాని వద్దిపర్తి అవధానం ఆద్యంతం రసకందాయకంగా సాగింది. రావు తల్లాప్రగడ, తనికెళ్ల భరణి, కూచిభొట్ల ఆనంద్, తుమ్మలపల్లి వాణీకుమారి, రెజీనా, వేముల లెనిన్, కొల్లారపు ప్రకాశరావు, రవి, మాధురి చింతపల్లి తదితరులు కీలకపాత్ర పోషించారు. అమెరికాలో తొలిసారిగా సమగ్ర శతావధాన కార్యక్రమాన్ని సిలికానాంధ్ర ఆధ్వర్యంలో నిర్వహించేందుకు చొరవ తీసుకుంటామని కూచిభొట్ల ఆనంద్ పేర్కొన్నారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వద్దిపర్తిని సత్కరించారు. బిజినెస్ ఫోరంను లక్ష్మీ చేపూరి సమన్వయపరిచారు. సయ్యంది పాదం కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ప్రవాసులు డా.యడ్ల హేమప్రసాద్, రావు సత్తిరాజు, పెద్దిబోయిన జోగేశ్వరరావు, కడప రత్నాకర్, దండమూడి శ్రీనివాసరావు, పొట్లూరి రవి, పోలవరపు శ్రీకాంత్, కొల్లా అశోక్ బాబు, నిరంజన్ శృంగవరపు, ఐకా రవి, మూల్పూరి వెంకటరావు, ఆత్మచరణ్‌రెడ్డి, మన్నవ సుబ్బారావు, కొల్లా సుబ్బారావు, పులి రవి, మేడపాటి వెంకట్ తదితరులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
“ఆటా” మూడోరోజు విశేషాలు. శ్రీనివాస కళ్యాణం. వద్దిపర్తి అవధానం.
Related tags :