DailyDose

రేపు ఆదోనిలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన -TNI తాజా వార్తలు

రేపు ఆదోనిలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన -TNI  తాజా వార్తలు

* ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా, ఆదోని లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా కానుకను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి జనసమీకరణ బాధ్యత అధికారులపై పెట్టారు. దీంతో అధికారులు పొదుపు మహిళలకు, ఆర్పీ, రీసోర్స్ పర్సన్‌లకు హెచ్చరికల మెసేజ్‌లు పంపారు. సీఎం సభకు పోదుపు మహిళలు ఖచ్చితంగా రావాలని ఆదేశాలిచ్చారు. రాక పోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవని, అర్హత కోల్పోతారని హెచ్చరించారు. ఆదోని డివిజన్‌లోని అన్ని ప్రవేట్ స్కూల్ బస్సులను సోమవారం సాయంత్రం లోపు ఆర్టీవో అధికారులకు అప్పగించాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో ప్రవేట్ స్కూల్ కరస్పాండెంట్‌లకు డిఈవో కార్యాలయం నుంచి మెసేజ్‌లు వెళ్లాయి.

* అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ…. అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని అందరికన్నా ముందుగా దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కేంద్ర ప్రొటోకాల్‌లో ఉన్న పేరును రాష్ట్ర అధికారులు తొలగించారని, మోదీ సభకు వెళ్లకుండా తమను అడ్డుకున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ప్రొటోకాల్‌ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. మోదీ సభలో అధ్యక్షత వహించాల్సిన స్థానిక ఎంపీ రఘురామరాజు రాకుండా అడ్డుకోవడం దుర్మార్గమని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

*ఏలూరు: జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో నల్ల బెలున్లతో కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. ప్రధాని మోదీ జిల్లా పర్యటనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జెట్టి గురునాథరావు నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ది శూన్యమంటూ ఆరోపించారు. మోదీ పర్యటనకు నల్ల బెలూన్లతో వెళుతుండగా జెట్టి గురునాథ్ రావును పోలీసులు అడ్డుకుని నోటీసులు ఇచ్చారు. ఆపై హౌస్ అరెస్ట్ చేశారు.

*మ‌హారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే.. విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గారు. ఇవాళ అసెంబ్లీలో జ‌రిగిన బ‌ల‌ప‌రీక్ష‌లో ఆయ‌న‌కు అనుకూలంగా 164 మంది ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు తెలిపారు. కొన్ని వారాల నుంచి సాగుతున్న మ‌హారాష్ట్ర‌ అసెంబ్లీ సంక్షోభం అనూహ్య మ‌లుపులు తిరిగిన విష‌యం తెలిసిందే. శివ‌సేన రెబ‌ల్‌గా షిండే తిరుగుబాటు చేయ‌డంతో ఉద్ద‌వ్ ఠాక్రే త‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో ఏక్‌నాథ్ సీఎం అయ్యారు. అయితే ఆయ‌న ఇవాళ బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గారు. ఇవాళ ఓటింగ్‌లో ప్ర‌తిప‌క్షానికి 99 ఓట్లు పోల‌య్యాయి. ఎమ్మెల్యేల లెక్కింపు ద్వారా మెజారిటీని తేల్చారు. మెజారిటీ మార్క్ 144 మాత్ర‌మే. అయితే నిన్న‌టి వ‌ర‌కు ఉద్ధ‌వ్ గ్యాంగ్‌తో ఉన్న ఎమ్మెల్యే సంతోష్ బంగ‌ర్ ఇవాళ బ‌ల‌ప‌రీక్ష‌లో ఏక్‌నాథ్‌కు స‌పోర్ట్ ఇచ్చారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

*ప్రధాని మోదీ ఏపీ పర్యటనను నిరసిస్తూ విశాఖపట్నంలో స్టీల్‌ప్లాంట్ ప్రధానద్వారం వద్ద ఉద్యోగులు, కార్మికులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణను నిరసిస్తూ గత 550 రోజులుగా పోరాటాలు చేస్తుంటే స్పందించకుండా ఏపీలో ప్రధాని పర్యటన కొనసాగించడంపై కార్మికులు నిరసన తెలిపారు. కూర్మన్నపాలెం జాతీయ రహదారిపై కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

*శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌పై ముంబై కోర్టు వారెంట్‌ జారీ చేసింది. బీజేపీ మాజీ ఎంపీ కిరీట్‌ సోమయ్య భార్య మేధాసోమయ్య దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేయడంతో పాటు ఈ నెల 18న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో సెవ్రీ మెట్రోపాలిటన్‌ కోర్టు గత నెలలో సంజయ్‌ రౌత్‌కు సమన్లు జారీ చేసి, జూలై 4న హాజరుకోవాలని చెప్పింది. ఈ క్రమంలో రౌత్‌, ఆయన తరఫున న్యాయవాది సోమవారం కోర్టుకు హాజరుకాలేదు. ఈ విషయాన్ని మేధా తరఫున న్యాయవాది వివేకానంద గుప్తా కోర్టుకు తెలిపారు.

*రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ రాజమండ్రిలో కాంగ్రెస్ నిరసనకు దిగింది. పీసీసీ అధ్యక్షుడు శైలాజానాథ్ఆ ధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మోదీ గోబ్యాక్, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాగా… జాంపేట గాంధీ బొమ్మసెంటర్ వద్ద కాంగ్రెస్ నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. శైలజానాధ్ సహా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఏపి విభజన హామీలు తక్షణమే అమలు చేయాలని… ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.

*అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం తెలుగు ప్రజలకే కాదు దేశానికే గర్వకారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బ్రిటిష్ పాలకులపై అలుపెరుగని పోరాటం చేశారన్నారు. స్వేచ్చ స్వతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసి 27 వయస్సులో మాతృ భూమికోసం ప్రాణాలు అర్పించారని అన్నారు. బ్రిటీష్ వారు సీతారామరాజును మట్టు పెట్టేందుకు ఆ రోజులలోనే 40 లక్షణాలు వెచ్చించారంటే అల్లూరి తన పోరాటంతో ఏ విధంగా భయపెట్టారో అర్థం అవుతుంది తెలిపారు. పార్లమెంటులో కూడా అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆజాదీకా అమృతోత్సవ్కా ర్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చి ఆ మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రతి తెలుగు వారు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు కోరుకున్నారు.

* తమ సమస్యలు పరిష్కరించాలని పౌరసరఫరాల కార్యాలయం ఎదుట రేషన్ డీలర్లు ధర్నా చేశారు. ప్రజా పంపిణీలో రాష్ట్రానికో రకంగా కమీషన్‌ ఉండటం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా డీలర్లందరికి ఒకే కమీషన్ ఇవ్వాలని రేషన్‌ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండాది వెంకట్రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 29 వేల మంది డీలర్లు కరోనా సమయంలోనూ నిత్యావసరాలు పంపిణీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఎండీయూలను ఏర్పాటు చేసి రేషన్‌ పంపణీ చేయడం సరికాదని రేషన్ డీలర్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

*వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అల్లూరి సీతారామ రాజుని గుర్తుచేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని చెప్పారు. అల్లూరి సీతారామా రాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన వేడులకు మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి కేటీఆర్‌ హాజరయ్యారు. అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. అందరికి అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. మన్యం వీరుడి జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు.

*ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి.కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 16135 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,35,18,564 కు చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,13,864 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 97.88 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 24 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,25,223 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13958 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,28,79,477 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,97,98,21,197 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 1,78,383 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

* వంగవీటి మోహనరంగా 75వ జయంతి సందర్భంగా ఆయన‌ విగ్రహానికి వంగవీటి నరేంద్ర పూలమాల‌వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో రంగా జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం రంగా పోరాటాలు చేశారని, పేదల కోసమే తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. రాధా, రంగా మిత్ర మండలి పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామని వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు.

* అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం తెలుగు ప్రజలకే కాదు దేశానికే గర్వకారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బ్రిటిష్ పాలకులపై అలుపెరుగని పోరాటం చేశారన్నారు. స్వేచ్చ స్వతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసి 27 వయస్సులో మాతృ భూమికోసం ప్రాణాలు అర్పించారని అన్నారు. బ్రిటీష్ వారు సీతారామరాజును మట్టు పెట్టేందుకు ఆ రోజులలోనే 40 లక్షణాలు వెచ్చించారంటే అల్లూరి తన పోరాటంతో ఏ విధంగా భయపెట్టారో అర్థం అవుతుంది తెలిపారు. పార్లమెంటులో కూడా అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆజాదీకా అమృతోత్సవ్కా ర్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చి ఆ మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రతి తెలుగు వారు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు కోరుకున్నారు.

*రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల్లో ఏపీకి ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయో బీజేపీ నేతలు ప్రధాని మోదీకి చెప్పాలన్నారు. విభజన హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఎలా ప్రైవేటీకరణ చేస్తారని ప్రశ్నించారు. పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని సుంకర పద్మశ్రీ స్పష్టం చేశారు.

*ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పీఎంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆందోళనకు దిగారు. గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద జాతీయ రహదారిపై బ్లాక్ బెలూన్‌తో గో బ్యాక్ మోదీ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రానికి మోదీ, జగన్ కలిసి మోసం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు… ఎయిర్‌పోర్టు వద్ద పద్మశ్రీని అదుపులోకి తీసుకున్నారు.

*బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంలో ఉపాధ్యాయురాలు గొట్టిపాటి సుధారాణి దారి సమస్య పరిష్కారం కాలేదు. అడ్డుగా ఉన్న గోడను పడగొట్టేందుకు వచ్చిన అధికారులు, ఇంజక్షన్‌ ఆర్డర్‌ చూసి వెనుదిరిగారు. దారి సమస్య విషయమై సీఎంను కలవడానికి సుధారాణి గతనెల 18న బొడ్డువానిపాలెం నుంచి పాదయాత్రగా తాడేపల్లికి బయల్దేరారు. మంగళగిరి సమీపంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకొని సమస్య పరిష్కరిస్తామంటూ వెనక్కి పంపించారు. ఈ నేపథ్యంలో బాపట్ల కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశాల మేరకు ఆదివారం తహసీల్దార్‌, సర్వేయర్‌, ఈవోఆర్డీ, ముగ్గురు ఎస్‌ఐలు, పెద్ద సంఖ్యలో మహిళా కానిస్టేబుళ్లు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ కార్యదర్శులు బొడ్డువానిపాలెంలోని వివాదాస్పద స్థలం వద్దకు చేరుకున్నారు. ప్రహరీ, రేకుల షెడ్డు తొలగించి సుధారాణికి దారి ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఆ స్థల యజమాని కోర్టు ఇంజక్షన్‌ ఆర్డర్‌ కాగితాలను వారికి చూపించారు. దీంతో ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్నందున తాము గోడ పడగొట్టలేమంటూ అధికారులు వెనుదిరిగారు.

*రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాబురావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కుడ చూసినా అవినీతి, అక్రమాలు, అరాచకాలు పెరిగిపోయాయని, పేదలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ పాలనతో విసుగు చెందిన ప్రజలు బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగురుతుందని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు.

*కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ రాజకీయ తీర్మానం స్పష్టం చేసింది. ఒక కుటుంబం, ఒక రాష్ట్రం కోసం కాకుండా భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని పేర్కొంది. దేశంలో కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలన్నీ బలహీనపడ్డాయని, ప్రజలు వాటిని తిరస్కరించారని అభిప్రాయపడింది. విపక్షాలు ఎన్నికల కోసం రాజకీయం చేస్తాయని, బీజేపీ మాత్రం అభివృద్ధి రాజకీయం చేస్తుందని, అందుకే ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొంది. మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని గద్దె దించడం సరైనదేనని, ఆ రాష్ట్ర ప్రజలకు అది మేలు చేస్తుందని వివరించింది. గత ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం బహుముఖ అభివృద్ధిని సాధించిందని తెలిపింది. దీనిపై మోదీకి అభినందనలు చెప్పింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆదివారం ఈ మేరకు రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. రెండు రోజులపాటు చర్చించిన తర్వాత ఈ తీర్మానం ఆమోదం పొందింది. తెలంగాణ నుంచి ఈటల రాజేందర్‌ కూడా ఈ తీర్మానంపై మాట్లాడారు. రాజకీయ తీర్మానంలోనూ మొత్తం దేశ రాజకీయాలతో పాటు తెలంగాణ పరిస్థితులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. కేసీఆర్‌ది కుటుంబ పాలన అని, దానిని సాగనివ్వబోమని బీజేపీ రాజకీయ తీర్మానంలో పొందుపరిచింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కుటుంబ పాలన క్రమంగా కనుమరుగైపోతోందని, అదే కోవలో తెలంగాణ కూడా చేరుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.

*విజయ సంకల్ప సభ మినీ ఇండియాను తలపించింది. గతంలో తెలంగాణలో ఎన్నో బహిరంగ సభలు జరిగినా, తాజా సభ వాటికి భిన్నంగా కనిపించింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవడంతో వారిని చూసేందుకు నగరంలోని సికింద్రాబాద్‌లోని రాణిగంజ్‌, జనరల్‌బజార్‌, టకార బస్తీ, మోండా మార్కెట్‌కు చెందిన మార్వాడీలు, ఉత్తర భారతీయులు కుటుంబ సభ్యులు సహా పరేడ్‌గ్రౌండ్‌కు వచ్చారు. చాలామంది కాషాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. మోదీ ఫొటోతో కూడిన మాస్కులు, పగడీలు, ప్లకార్డులతో సందడి చేశారు.

* బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదివారం చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి ఉదయం 7.55కు ఆలయానికి వచ్చిన ఆయన 15 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. యూపీ సీఎంకు.. భాగ్యలక్ష్మి ఆలయ ట్రస్టీ శశికళ ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి యోగి ప్రత్యేక పూజలు చేశారు. మహా హారతిలోనూ పాల్గొన్నారు. యోగికి బండి సంజయ్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. యోగి రాకతో చార్మినార్‌ పరిసరాలు కాషాయ జెండాలతో రెపరెపలాడాయి. కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాగా, యోగి భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తుండడంతో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆధ్వర్యంలో చార్మినార్‌ పరిసరాలను ఆధీనంలోకి తీసుకున్నారు. నలువైపులా ఆంక్షలు విధించారు. బీజేపీ నేతలు ఉమామహేంద్ర, ఆలె భాస్కర్‌, పొన్న వెంకటరమణ యూపీ సీఎంను పూలమాలతో సన్మానించారు.

*తెలంగాణ ఏర్పాటును ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ప్రధాని మోదీ అవహేళన చేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది. హైదరాబాద్‌లో ఆదివారం నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ కార్యకర్తలు నల్ల బెలూన్లను ఎగురవేశారు. సికింద్రాబాద్‌ ఘటనలో ఆర్మీ అభ్యర్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, అగ్నిపథ్‌ ఆందోళనల్లో అరెస్ట్‌ అయిన వారి ని విడుదల చేయాలని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షు డు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ వద్ద విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కేంద్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివారం పార్శిగుట్ట నుం చి ఇందిరాపార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేస్తే బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జీ చెన్నయ్య హెచ్చరించారు. బీజేపీ సభలో ప్రధానిమోదీ ప్రసంగిస్తుండగా ఆయనకు వ్యతిరేకంగా ముగ్గురు మహిళలు నినాదాలు చేశారు.

*మేధావులు జైళ్లలో ఉండడం సమాజానికి హాని చేస్తుందని పలువురు రచయితలు అభిప్రాయపడ్డారు. ప్రముఖ కవి చెరబండరాజు(చెర) 40వ వర్ధంతి, విప్లవ రచయితల సంఘం (విరసం)52వ ఆవిర్భావం సందర్భంగా ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సదస్సులో పాల్గొన్న వక్తలు దేశవ్యాప్తంగా మేధావులు, రచయితల మీద విధించిన నిర్బంధానికి వ్యతిరేకంగా గళమెత్తారు. దిగంబర కవితోద్యమ స్రష్ట నగ్నముని మాట్లాడుతూ ‘‘16నెలలు జైల్లో ఉన్న ఒక వ్యక్తి బయటకు వచ్చి, ఎన్నికల్లో పోటీచేసి ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. కానీ ప్రజల కోసమే పనిచేసే వరవరరావు, ఆచార్య జీఎన్‌ సాయిబాబ వంటి మేధావులు, రచయితలకు మాత్రం బెయిల్‌ దొరకదు’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘చెరబండరాజు జీవితం – వ్యక్తిత్వం’ అంశంపై ప్రముఖ రచయిత అల్లం రాజయ్య ప్రసంగిస్తూ మతతత్వం పునాదితో పాలన సాగిస్తున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల్లోని వేదికలకు కుమరం భీం, షోయబుల్లాఖాన్‌ పేర్లు పెట్టిన వాళ్లు రేపు చెరబండరాజు పేరు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ వ్యాఖ్యానించారు.

*జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచారం చేసిన సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉరి వేసుకుని చావాలంటూ వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌, గరిడేపల్లి మండలాల్లో పర్యటించారు. హుజూర్‌నగర్‌లోని లింగగిరి చేరుకున్న ఆమె, ఈ సందర్భంగా ప్రసంగించారు. అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్సీల కుమారులే బాలికపై అత్యాచారం చేశారని ఆమె ఆరోపించారు. ‘‘ఇది తెలంగాణ సభ్య సమాజం తల దించుకోవాల్సిన ఘటన. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించడం లేదు. ఆఖరికి చిన్నారుల మానప్రాణాలకూ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. ఆడపిల్ల వైపు చూస్తే గుడ్లు పీకుతానంటూ ఎన్నికల ముందు వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌, ఇప్పుడు తన కళ్లు మూసుకున్నారు. జూబ్లీహిల్స్‌లో బాలికపై లైంగిక దాడి జరిగినా సాక్ష్యం చెప్పేందుకు ఒక్కరూ ముందుకు రాకపోవడం దారుణం.

*డా. బీఆర్‌. అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హయత్‌నగర్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ జ్యోత్స్నప్రభ, కోఆర్డినేటర్‌ శంకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌, ఏదైనా డిప్లొమా ఓకేషనల్‌ కోర్సులు ఉత్తీర్ణులు అ యిన వారు నేరుగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లిం చి డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరవచ్చునని అన్నారు. డిగ్రీ ద్వితీయ, తృతీయ సం వత్సరం వార్షిక ఫీజు చెల్లించుటకు జూలై 31వరకు సమయం ఉందన్నారు. విద్యార్థులందరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

*టీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. బడంగ్‌పేట్‌ మేయర్‌ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆమె తన రాజీనామా లేఖను పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి మెయిల్‌ ద్వారా పంపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడంగ్‌పేట్‌ అభివృద్ధిని కాంక్షించి అప్పటి పరిస్థితుల మేరకు టీఆర్‌ఎ్‌సలో చేరానని, పార్టీలోని కొందరు తన ఎదుగుదలను జీర్ణించుకోలేక కొంతకాలంగా తనపై వ్యతిరేక భావనను ప్రదర్శించారని అన్నారు.

*స్కూల్‌ అసిస్టెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక ఆదివారం విజయవాడలో నిర్వహించారు. అధ్యక్షులుగా పి.నరోత్తమరెడ్డి(చిత్తూరు), ప్రధాన కార్యదర్శిగా చింతల సుబ్బారావు(బాపట్ల), ఎన్నికయ్యారు.

*పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిన్నా.. తినకపోయినా అందరికీ వారంలో ఐదు రోజులు గుడ్లు, 3 రోజులు చిక్కీలు అందించనున్నారు. ఈ మేరకు మధ్యాహ్న భోజన పథకం డైరెక్టరు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

*బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలులోని శ్రీ బగళాముఖి (బండ్లమ్మ) అమ్మవారి ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌.మానవేంద్రనాథ్‌రాయ్‌, హైకోర్టు రిజిస్ర్టార్‌ డి.వెంకటరమణతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి దేవస్థానం తరుపున ఆలయ కార్యనిర్వాహణాధికారి జి.నరసింహమూర్తి, దేవస్థానం ట్రస్ట్‌బోర్డుఛైర్మన్‌ మోదుగుల ప్రభాకరరెడ్డి పూర్ణకుంభ స్వాగతం పలికారు.

*బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంలో ఉపాధ్యాయురాలు గొట్టిపాటి సుధారాణి దారి సమస్య పరిష్కారం కాలేదు. అడ్డుగా ఉన్న గోడను పడగొట్టేందుకు వచ్చిన అధికారులు, ఇంజక్షన్‌ ఆర్డర్‌ చూసి వెనుదిరిగారు. దారి సమస్య విషయమై సీఎంను కలవడానికి సుధారాణి గతనెల 18న బొడ్డువానిపాలెం నుంచి పాదయాత్రగా తాడేపల్లికి బయల్దేరారు. మంగళగిరి సమీపంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకొని సమస్య పరిష్కరిస్తామంటూ వెనక్కి పంపించారు. ఈ నేపథ్యంలో బాపట్ల కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశాల మేరకు ఆదివారం తహసీల్దార్‌, సర్వేయర్‌, ఈవోఆర్డీ, ముగ్గురు ఎస్‌ఐలు, పెద్ద సంఖ్యలో మహిళా కానిస్టేబుళ్లు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ కార్యదర్శులు బొడ్డువానిపాలెంలోని వివాదాస్పద స్థలం వద్దకు చేరుకున్నారు. ప్రహరీ, రేకుల షెడ్డు తొలగించి సుధారాణికి దారి ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఆ స్థల యజమాని కోర్టు ఇంజక్షన్‌ ఆర్డర్‌ కాగితాలను వారికి చూపించారు. దీంతో ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్నందున తాము గోడ పడగొట్టలేమంటూ అధికారులు వెనుదిరిగారు.

* ఉపాధ్యాయుల పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, ఈఎల్స్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం(టీఎన్‌యూఎస్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్‌, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 15 రోజుల్లో రావాల్సిన పీఎఫ్‌ రుణానికి ఏడాది పట్టడం శోచనీయమన్నారు. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులకు ఇతర ఇబ్బందులను గుర్తించాలని కోరారు.

*ఈ విద్యా సంవత్సరం నుంచే 882 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియెట్‌ తరగతులు ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అధ్యాపకుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, అప్పటివరకూ విద్యార్థులకు నష్టం లేకుండా గెస్ట్‌ లెక్చరర్ల నియామకానికి వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

*రామచంద్రపురంలో జరిగిన కోనసీమ జిల్లా వైసీపీ ప్లీనరీ సమావేశానికి జనం కరువయ్యారు. ఇక్కడి వీఎ్‌సఎం కళాశాలలో ఆదివారం సభ ప్రారంభమైన అరగంటలోనే.. వచ్చిన కొద్దిమంది మహిళలు కూడా వెళ్లిపోతుండడంతో పార్టీ నేతలతోపాటు.. సాక్షాత్తూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ సైతం వేదిక దిగివచ్చి.. సభ నుంచి వెళ్లొద్దని బతిమాలడం కనిపించింది. మహిళా వలంటీర్లు వలయంగా ఏర్పడి సభ నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నా ఫలితం లేకపోయంది. కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌, జిల్లాకు చెందిన మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్‌, ఎంపీలు పిల్లి సుభా్‌సచంద్రబోస్‌, చింతా అనురాధ, రీజనల్‌ కోఆర్డినేటర్‌, ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిలు హాజరయ్యారు.

*మధురకవి, సభాసామ్రాట్‌, సినీగేయ రచయత డాక్టర్‌ కేవీఎస్‌ ఆచార్య (80) బాపట్లలోని తన స్వగృహంలో ఆదివారం కన్నుమూశారు. ఐదు దశాబ్దాలపాటు మృదు మధురమైన తన ఉపన్యాసాలతో తెలుగు రాష్ర్టాలలో తిరుగులేని వ్యాఖ్యాతగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన మృతికి భాషాభిమానులు, సాహితీరంగ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎటువంటి సభనైన రక్తి కట్టించటంలో ఆచార్యకు అపారమైన అనుభవం ఉంది. 10 వేలకు పైగా సభలలో పాల్గొని సభా నిర్వాహణలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన సహచరి గతంలోనే కన్నుమూశారు.

*తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం జూన్‌ నెలలో రూ. 123.76 కోట్లు లభించింది. 23.21 లక్షల మందికి శ్రీవారి దర్శనం కల్పించారు. గత నెల 25వ తేదీన అత్యధికంగా 94,411మంది స్వామిని దర్శించుకున్నారు. కొవిడ్‌ తర్వాత ఒక్కరోజులో ఇంతమంది దర్శనం చేసుకోవడం ఇదే తొలిసారి. అత్యధికంగా 28వ తేదీన రూ.4.62 కోట్ల హుండీ ఆదాయం లభించింది.

* ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా కర్నూలు జిల్లాకు చెందిన గార్లపాటి నాగరాజు ఎంపిక అయ్యారు. ఆదివారం విజయవాడలో ఆరోగ్య మిత్ర సంఘం ఎన్నికలు జరిగాయి. సంఘం నూత కార్యవర్గం ఏర్పాటయింది. ప్రధాన కార్యదర్శిగా షేక్‌ అబ్దుల్‌ కలాం ఆజాద్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా సుధీర్‌, కోశాధికారిగా రామ్‌మోహన్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బంగారుశ్రీ, ఉపకార్యదర్శిగా శేఖర్‌, గౌరవ అధ్యక్షులుగా గోవింద్‌రావు, గౌరవ సలహాదారుగా శివకుమారిని ఎంపిక చేశారు. అనంతరం ఆరోగ్య మిత్ర, ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

*దక్షిణ భారతదేశానికి చెందిన మహాయోధుడి గొప్పతనం గురించి యావత్‌ ప్రపంచానికి తెలియజేయడానికి నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ అద్భుతమైన కార్యక్రమం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ‘‘భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ చేయడానికి వస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రజలు, జనసేన తరఫున శుభాభివందనాలు. మన అందరి గుండెల్లో స్ఫూర్తిని నింపే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని రావడం ఆనందంగా ఉంది. భీమవరంలో పోటీ చేసిన నాకు ఇది ప్రత్యేకం. ఆజాదీ కా ఆమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమానికి స్వయంగా ఆహ్వానం పలికినందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మనఃపూర్వక కృతజ్ఞతలు. జూలై 4న సభలో జనసేన కూడా పాల్గొనాలి. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సంపూర్ణ మద్దతివ్వాలి’’ అని పవన్‌ పేర్కొన్నారు.

*కృష్ణా జిల్లా చల్లపల్లిలోని ఎన్టీఆర్‌ ఉన్నత పాఠశాలలో 6,7,8,9లో ఒక్కో తరగతిలో 10మంది చొప్పున 40మంది(డే స్కాలర్స్‌)కి ఉచిత విద్య అందించనున్నట్లు ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 9న సాయంత్రం 4గంటలోపు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కలిసి, వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రవేశాల కంటే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే.. ఈ నెల 10న పాఠశాలలో ప్రతిభా పరీక్ష నిర్వహించి, విద్యార్థులను ఎంపిక చేస్తామని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అనాథ, నిరుపేద బాలబాలికలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా 2005నుంచి ఉచిత విద్య అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

*బేగంపేట రైల్వేస్టేషన్‌లో రఘురామరాజు బృందం రైలు దిగిపోయింది. భీమవరం వెళ్లేందుకు ఆయన లింగంపల్లి వద్ద నర్సాపురం ఎక్స్ ప్రెస్‌ ఎక్కారు. అయితే బేగంపేట రైల్వేస్టేషన్‌లో రఘురామరాజు రైలు దిగిపోయారు. కాగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు పుట్టిన రోజు వేడుకలు సోమవారం జరగనున్నాయి. ఈ వేడుకలకు ప్రధాని మోదీ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి రఘురామరాజు కూడా వెళ్లాలని అనుకున్నారు. ఈ క్రమంలో తన వెహికల్ కు అనుమతివ్వాలని కోరారు.. కాని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో తన అనుచరులతో కలిసి లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో నర్సాపురం ఎక్స్ ప్రెస్ ఎక్కారు.

*నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అనూహ్యంగా వ్యూహం మార్చారు. భీమవరంలో అల్లూరి సీతారామారాజు విగ్రహావిష్కరణకు ఆయన హాజరుకానున్నారు. అయితే వెహికల్‎లో భీమవరం వెళ్లేందుకు పోలీసుల అనుమతి కోరారు. కానీ పోలీసులు నిరాకరించారు. దాంతో కలెక్టర్‌‎కు రఘురామరాజు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో రఘురామరాజు రైలులో భీమవరానికి బయల్దేరి వెళ్తున్నారు. హైదరాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి నర్సాపూర్ ఎక్స్‎ప్రెస్‎లో రఘురామరాజు భీమవరం బయల్దేరారు. ఈ మేరకు ఆయన ముందుగానే నర్సాపూర్ ఎక్స్‎ప్రెస్‎లోని ప్రత్యేక బోగిని బుక్ చేసుకున్నారు. రఘురామరాజుతో పాటు ఏపీ పరి రక్షణ సమితి కన్వీనర్ కొలికపూడి శ్రీనివాస్‌, మరో 20 మంది నేతలు భీమవరం బయల్దేరారు.