DailyDose

లాలూకు ప్రమాదం.. మెట్ల పైనుంచి జారిపడ్డ ఆర్జేడీ చీఫ్‌

లాలూకు ప్రమాదం.. మెట్ల పైనుంచి జారిపడ్డ ఆర్జేడీ చీఫ్‌

ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ గాయపడ్డారు. ఇంట్లో మెట్లు దిగుతుండగా ఆయన కాలుజారి పడిపోయినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో లాలూ భుజానికి ఫ్రాక్చర్‌ అయినట్లు పేర్కొన్నాయి. వీపుపై కుడా గాయమైనట్లు చెప్పాయి. ‘లాలూ భుజంలో ఫ్రాక్చర్ అయినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. గాయమైన చోట వైద్యులు బ్యాండేజ్ చుట్టారు. కొన్ని మెడిసిన్స్ రాసి వెంటనే ఇంటికి పంపారు’ అని లాలూ కుటుంబంతో సన్నిహత సంబంధాలు ఉన్న ఓ వ్యక్తి చెప్పారు. దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ.. రెండు నెలల క్రితమే బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటినుంచి ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీ దేవి నివాసంలోనే ఉంటున్నారు.లాలూ ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యల చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఆదివారం అనుకోకుండా ఇంట్లోనే మెట్లపై నుంచి జారిపడి గాయపడ్డారు. వెంటనే కుటుంసభ్యులు లాలూను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. భుజం, వీపుపై కాస్త నొప్పి తప్ప.. లాలూకు ఇబ్బందేమీ లేదని తెలుస్తోంది.