NRI-NRT

అమెరికాలో ఘనంగా మంత్రి ఎర్రబెల్లి పుట్టిన రోజు వేడుకలు

అమెరికాలో ఘనంగా మంత్రి ఎర్రబెల్లి పుట్టిన రోజు వేడుకలు

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 64వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభలలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వెళ్లిన మంత్రికి అదే వేదిక మీద ఎన్ఆర్ఐలు, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, గాదరి కిషోర్ కుమార్‌, తదితరుల సమక్షంలో కేక్ కట్ చేశారు.మంత్రి ఎర్రబెల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు