Fashion

ఫెమినా మిస్ ఇండియా 2022 గా సినిశెట్టి

Auto Draft

ఫెమినా మిస్ ఇండియా 2022 కిరీటాన్ని కర్ణాటక రాష్ట్రానికి చెందిన సినిశెట్టి గెలుచుకుంది.ముంబయి నగరంలో జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో కర్ణాటకకు చెందిన సినిశెట్టిని ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 టైటిల్ విజేతగా ప్రకటించారు.జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలో రాజస్థాన్‌కు చెందిన రూబల్ షెకావత్ ఫెమినా మిస్ ఇండియా 2022 ఫస్ట్ రన్నరప్‌గా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన షినతా చౌహాన్ ఫెమినా మిస్ ఇండియా 2022 సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.సాయంత్రం జ్యూరీ ప్యానెల్‌లో సినీనటులు నేహా ధూపియా, డినో మోరియా, మలైకా అరోరా, డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ షియామాక్ దావర్, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ లు ఉన్నారు. విస్తృతమైన స్కౌటింగ్ డ్రైవ్ ఇంటర్వ్యూ రౌండ్ల అనంతరం 31 మంది రాష్ట్ర విజేతలను ఎంపిక చేశారు.ఫెమినా మిస్ ఇండియా ప్రయాణంతో అమూల్యమైన అనుభవాల జ్ఞాపకాలను పొందానని ఫెమినా మిస్ ఇండియా మాజీ యూనివర్స్ నేహా ధూపియా చెప్పారు.ఈ పోటీల సందర్భంగా నటులు కృతి సనన్, లారెన్ గాట్లీబ్, యాష్ చాండ్లర్ ప్రదర్శనలు జరిగాయి. ఈ షోకు మనీష్ పాల్ హోస్ట్‌గా వ్యవహరించారు.