లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘హ్యాపీ బర్త్‌డే’. సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు రితేష్‌రానా దర్శకత్వం వహించారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సమర్పణలో చిరంజీవి (చెరీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 8న సినిమాను విడుదల చేస్తున్నారు. ఇటీవలే చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్ చేయగా..తాజాగా ఈ సినిమా నుంచి పార్టీ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటలో లావణ్య త్రిపాఠీ చేసిన నృత్యాలు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి’. ఈ పాటను కాళభైరవ స్వరపర్చగా దామినీ భాట్ల పాడారు. కిట్టూ విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించారు. ఓన్లీ లీగల్ పార్టీ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అంటూ ఈ పాటను విడుదల చేశారు చిత్రబృందం.