బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కల్యాణ మహోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. వేడుకల్లో భాగంగా కల్యాణ క్రతువు ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలను సమర్పించారు.
సందర్భంగా మంత్రులు అమ్మవారిని దర్శించుకున్నారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలు భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వేడుకలకు పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.