ఒకే కంపెనీలో 20 ఏళ్లు పనిచేయడం కష్టం. ఎందుకంటే ప్రయివేటు ఉద్యోగాల్లో ఉద్యోగికి కోపం వచ్చినా, యజమానికి కోపం వచ్చినా పోయేది ఎంప్లాయ్ జాబే. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితే ఒకచోట కాకుండా వేర్వేరు ప్రాంతాలకు బదిలీలు ఉంటాయి. కానీ, 65 ఏళ్లుగా ఒకే సంస్థలో, ఒకే రూట్‌లో సేవలందిస్తూ… అత్యంత ఎక్కువకాలం పనిచేసిన ఎయిర్‌హోస్టెస్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిందో మహిళ.
బోస్టన్‌లోని మసాచుసెట్స్‌కు చెందిన బెట్ నాష్‌కు ఇప్పుడు 86 ఏళ్లు. 1957లో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆరున్నర దశాబ్దాలుగా న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ డీసీ వయా బోస్టన్ రూట్‌లోనే సేవలందిస్తోంది. ప్రయాణికుల పట్ల ఎంతో మర్యాదగా ప్రవర్తించే బెట్… తరచుగా ఆ మార్గంలో ప్రయాణించే ఎంతోమందికి అభిమాన ఎయిర్‌హోస్టెస్‌గానూ మారిపోయింది.
వేరే మార్గాన్ని ఎంచుకునే అవకాశమున్నా ఆమె ఆ రూట్‌లోనే పనిచేయడానికో కారణం ఉంది. అది ఆమె కొడుకు. వైకల్యంతో బాధపడుతున్న అతడికి తల్లి అవసరం ఎంతో ఉంది. ఇక ఆ రూట్ అయితే రాత్రికల్లా ఇంటికి చేరుకుని కొడుకును చూసుకునే సౌలభ్యం ఉంది. ఇన్నేళ్లుగా ఇటు ఉద్యోగాన్ని, అటు కొడుకు బాధ్యతలను అవిశ్రాంతంగా కొనసాగిస్తోంది. ఒకే కంపెనీలో 84ఏళ్లుగా సేవలందిస్తున్న వ్యక్తిగా ఇటీవలే వందేళ్ల వయసున్న బ్రెజిల్‌కు వ్యక్తి వాల్టేర్ ఆర్థ్‌మన్ రికార్డు సాధించాడు.