Devotional

చరిత్రలో తొలిసారిగా తిరుమల వెంకన్నకు రికార్డు స్థాయిలో ఆదాయం

చరిత్రలో తొలిసారిగా తిరుమల వెంకన్నకు రికార్డు స్థాయిలో ఆదాయం

తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. స్వామివారికి ఆదివారం ఒకే రోజు రూ.6కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. ఇంతకు ముందు వెంకన్నకు ఒకే రోజు రూ.5.73కోట్లు కాగా.. 2012 ఏప్రిల్‌ ఒకటిన ఆదాయం లభించింది. తాజాగా ఆదివారం ఒకే రోజు రూ.6.18కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత ఆ రికార్డు బద్దలైంది.ఈ మేర‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) సోమ‌వారం ప్రకటన విడుదల చేసింది. ఆదివారం తిరుమ‌ల వెంకన్న హుండీలో స‌మ‌ర్పించిన ఆదాయాన్ని టీటీడీ సోమ‌వారం లెక్కించింది. ఈ లెక్కింపులో హుండీల ద్వారా భక్తులు సమర్పించిన విరాళాల విలువ రూ.6.18 కోట్లుగా తేలింది. ఇదిలా ఉండగా.. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై టీటీడీ ఆంక్షలు విధించింది. ఈ నెల 15 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని టీడీపీ పేర్కొంది.