బాలీవుడ్ పాటల రచయిత జావేద్ అఖ్తర్ దాఖ లు చేసిన పరువు నష్టం దావా కేసులో విచారణ నిమిత్తం కంగనా రనౌత్ సోమవారం కోర్టుకు వచ్చారు. అంధేరీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆమె మీడియా ట్రయల్‌కు ఇష్టపడడం లేదని, అందర్నీ బయట కు పంపించాలని ఆమెతరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో న్యాయవాదులు, పాత్రికేయులు సహా అందరూ బయటకు వెళ్లాలని మేజిస్ట్రేట్ ఆర్.ఎన్.షేక్ సూచించారు. అనంతరం తలుపులు మూయించారు. రెండు పార్టీల న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరిగింది. తాను నిర్దోషినని ఆమె వాదించారని, అంటే ఇకముందు ట్రయల్ ప్రారంభమవుతుందని తెలిసింది. టీవీ చర్చల్లో కంగన తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ అఖ్తర్ 2020 నవంబరులో పరువు నష్టం దావా వేశారు.