పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) మృతి చెందారు. చిత్రపరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత కొన్నిరోజుల క్రితమే సినీ నటి మీనా భర్త విధ్యాసాగర్ అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ క్రమంలో అర్థ శతాబ్దం పాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా సేవలందించిన సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం (జూలై 7) నాడు కన్నుమూశారు.ఇదే క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమలో పీపుల్స్ స్టార్‌గా పాపులర్ అయిన నటుడు, దర్శకనిర్మాత ఆర్ నారాయణ మూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం మల్లంపేటలో మృతి చెందారు. ఆమె వయసు 93 ఏళ్ళు. ఆమెకు ఏడుగురు సంతానం. వారిలో మూడవ కుమారుడు ఆర్. నారాయణ మూర్తి. నారాయణ మూర్తి తల్లి మృతి పట్ల పలువు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు.