Movies

ఆ విష‌యం పెద్ద‌గా ప‌ట్టించుకోను అంటున్న ర‌కుల్‌

Auto Draft

రకుల్‌ ప్రీత్‌సింగ్‌.. తాను గ్లామర్‌ డాల్‌ని కాదని ఇప్పటికే నిరూపించుకున్నది. తాజాగా బాలీవుడ్‌ చిత్రం ‘రన్‌వే 34’లో అజయ్‌ దేవగణ్‌, అమితాబ్‌ బచ్చన్‌ తదితర దిగ్గజాల పక్కన నటించి.. సత్తా చాటుకున్నది.‘సాధారణంగా నేను చేసే సినిమాలో ఎంతమంది హీరోలు, హీరోయిన్లు ఉన్నారనే విషయం పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే, సినిమాలో ఎవరి పాత్ర వారిది. ఏ పాత్ర ప్రాధాన్యం ఆ పాత్రదే. నటిని కావాలనే సంకల్పంతో ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన రోజున నా దగ్గర ఉన్నది ఆత్మవిశ్వాసం మాత్రమే. అదే నా ఆయుధం. దాంతోనే అడ్డంకులు అధిగమించాను. మానసికంగా అప్పుడెంత స్థిరంగా ఉన్నానో, ఇప్పుడూ అంతే బలంగా ఉన్నాను. నా సినిమాలు, పాత్రలతో చాలా సంతోషంగానే ఉన్నా. కానీ, ఏదో సాధించానని మాత్రం భ్రమపడటం లేదు. ఇంకా చాలా సినిమాలు చేయాలి. మంచి మంచి పాత్రల్లో నటించాలి. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. ఎంత గొప్ప క్యారెక్టర్లు చేశామన్నదే ముఖ్యం’ అంటున్నది రకుల్‌.