దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.సానుకూల గ్లోబల్ సంకేతాలమధ్య 250 పాయింట్లకు పైగా పెరిగింది, నిఫ్టీ 15900కిఎగువకు చేరింది. ప్రస్తుతం సెన్సెక్స్ 459 పాయింట్ల లాభంతో 53694 వద్ద నిఫ్టీ 135పాయింట్లు ఎగిసి 15970వద్ద ట్రేడ్ అవుతున్నాయి. చైనా వస్తువులపై అమెరికా కొన్ని సుంకాలను తగ్గించవచ్చని నివేదికలు, అమెరికా, ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి. మెటల్, నిఫ్టీ ఆటో నిఫ్టీ ఫైనాన్షియల్ షేర్లు లాభపడుతున్నాయి. టాటా మోటార్స్ టాప్ గెయినర్‌గా ఉండగా, కోల్ ఇండియా, హిందాల్కో, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కూడా లాభాల్లో ఉన్నాయి. ఇంకా పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, ఎన్టిపిసి, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసిఐసిఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఎల్ఐసీ భారీ లాభాలనార్జిస్తున్నాయి. ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, టైటన్ మాత్రం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు
