NRI-NRT

ఈ దేశాలలో జీవించాలంటే భయపడాల్సిందే.

ఈ దేశాలలో జీవించాలంటే భయపడాల్సిందే.

(అ)
ఈ ప్రపంచ దేశాలలో జీవించాలంటే పర్యటించాలంటే అత్యంత దుర్లభము. అవేవంటే …
(1) అఫ్ఘనిస్థాన్ (2) సెంట్రల్‌ ఆఫ్రికన్ రిపబ్లిక్ (3) ఇరాక్ (4) లిబియా (5) మాలి (6) సోమాలియా (7) ద॥ సూడాన్‌ (8) సిరియా (9) పాకిస్థాన్ (10) యెమన్.

(ఆ)
అంతర్యుద్ధాలతో సతమతమై, ఆయా దేశప్రజలకు ప్రమాదకారైన దేశాలు.
(1) అఫ్ఘనిస్థాన్ (2) సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (3) బురుండి (4) యెమెన్ (5) సిరియా (6) ద॥ సూడాన్ (7) సోమాలియా (8) ఇరాక్ (9) కాంగో (10) లిబియా.

(ఇ)
మానవ సైనికశక్తి పరంగా ఉన్నతమైన దేశాలు
(1) చైనా – 21,85,000 మంది సైనికులు
(2) హిందూస్థాన్ – 14,55,550
(3) అమెరికా – 13,88,100
(4) ఉ॥ కొరియా – 12,80,000
(5) రష్యా – 10,14,000
(6) పాకిస్థాన్ – 6,54,000
(7) ఇరాన్ – 6,10,100
(8) ద॥ కొరియా – 5,99,000

(ఉ)
గ్లోబల్‌ పీస్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచములో 0 (సున్న) క్రైమ్ రేట్ వున్న దేశము – ఐస్ ల్యాండ్.

(ఊ)
భద్రతాపరంగా దేశవిదేశీయులు జీవించటానికి అనువైన దేశాలు ( Safest Countries)
(1) ఐస్ ల్యాండ్
(2) పోర్చుగల్
(3) న్యూజిల్యాండ్
(4) ఆస్ట్రియా
(5) డెన్మార్క్
(6) కెనడా
(7) సింగపూర్
(8) చెక్ రిపబ్లిక్

(ఎ)
ప్రపంచదేశాలలో భద్రతాపరంగా భారతదేశము 64 వ స్థానములో వుంది. మంచిదే.

(ఏ)
హిందూదేశ పౌరులెవరు పర్యాటకులుగా పాకిస్థాన్ కు వెళ్ళటానికి వీలులేదు. అయితే (1) మతపరమైన యాత్రికులుగా (2) వ్యాపార నిమిత్తము ఆరు నెలలపాటు (3) బంధువులను కలవటానికి (4) ఆటలు ఆడటానికి (స్పోర్ట్స & గేమ్స్) (5) దౌత్యపరంగా (6) సైనికసంప్రదింపుల కొరకు అనుమతించిన గడువులోపుగా వెళ్లిరావచ్చును.

(ఐ)
విద్యపరంగా/విద్యార్జనకు ఉత్తమమైన దేశాలు.
(1) యూఎస్ ఏ (2) కెనడా (3) ఇంగ్లాండ్ (4) జర్మనీ (5) స్వీడ్జర్లాండ్ (6) ఫ్రాన్స్ (7) ఆస్ట్రేలియా (8) స్వీడన్ (9) నెదర్లాండ్ (10) జపాన్ (11) భారత్ (12) రష్యా.

(ఒ)
ప్రపంచములో వివాదరహితమైన మతము.
హిందూమతము. హిందూమతములో భిన్నత్వములోని ఏకత్వమే ఇందుకు కారణము. హిందూమతాన్ని ఆచరించడానికి అత్యంత సుళువైనది, ఇష్టం వచ్చినరీతిలో పద్ధతిలో ఆచరించవచ్చును.

(ఓ)
ప్రపంచములో సైనిక ఆర్థిక సాంకేతిక సామాజికపరంగాను మరియు నిపుణులైన మానవవనరుల పరంగా శక్తివంతమైన దేశాలు.
(1) అమెరికా (2) రష్యా (3) చైనా (4) జర్మని (5) ఇంగ్లాండ్ (6) భారత్ (7) జపాన్ (8) ఫ్రాన్స్ (9) ద॥ కొరియా (9) ఇజ్రాయిల్ (10) అస్ట్రేలియా.

(ఔ)
అత్యంత ప్రాచీననగరాలలో కాశీ/ వారణాసి ఒక్కటి, దీని వయస్సు సుమారు 5 వేలసంవత్సరాలు.ప్రపంచములో అత్యంతప్రాచీనమైన నగరం జెరికో.

(అం)
ప్రపంచములో అత్యధికంగా హత్యలు జరుగుతున్న దేశములో సాల్విడార్ మొదటిది. ప్రతి లక్షమందికి 52 మంది ప్రతియేటా హత్యకు గురైతున్నారు. తరువాతి స్థానము జమైకా దేశము. ఇక్కడ ప్రతి లక్షమందికి 43 మంది హత్యకు గురైతున్నారు. తరువాతి స్థానాలు హోండురస్, వెనిజులా దేశాలున్నాయి.

(ఆ:)
ప్రపంచములోని అన్ని వృత్తులకంటే
(1) సముద్రంలో చేపలు పట్టడము అత్యంత ప్రమాదకారైన వృత్తి.
తరువాత
(2) అడవిలో చెట్లు నరకడము
(3) భవననిర్మాణంలో పైకప్పుల నిర్మాణం
(4) భవననిర్మాణం
(5) విమానాలను నడపడము
(6) చెత్తను సేకరించి పునర్వుపయోగించడము ( కలెక్షన్ ఆఫ్ వేస్ట్ & రీసైక్లింగ్)
(7) విద్యుత్తు
(8) అంతరిక్షయాణం
(9) గనులలో పనిచేయడము
(10) రాజకీయప్రమేయం లేకుండా భారత్ లో ఉద్యోగం చేయడం
ప్రమాదకార వృత్తులుగా పరిగణించారు.