తనకే అనారోగ్య సమస్యలు లేవని, మహిళల్లో సహజంగా హార్మోన్ అసమతుల్యతో వచ్చే పీసీఓస్‌తో ఇబ్బందులు పడుతున్నానని స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తెలిపింది. తన సోషల్ మీడియా పోస్టును సరిగ్గా చదవని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆమె వెల్లడించారు. మహిళల్లో పలు అనారోగ్య ఇబ్బందులను సృష్టించే పీసీఓఎస్ తననూ చికాకు పరుస్తోందని అయితే దాన్ని ఎదుర్కొనేందుకు వ్యాయా మం చేస్తూ, మంచి ఆహారం తీసుకుంటున్నానని ఆమె తాజా పోస్టులో పేర్కొంది. శృతి హాసన్ స్పందిస్తూ…‘నాకు ఎలాంటి తీవ్ర అనారోగ్యాలు లేవు. హార్మోనల్ సమస్యలతో బాధపడుతున్నా. ఈ సమస్య వల్ల వచ్చే ఇబ్బందులు మహిళలకు తెలుసు. దీన్నో వ్యాధిగా చూడకుండా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నా. రోజూ వ్యాయామం, మంచి నిద్ర, పోషకాహారం తీసుకుంటున్నా. నా మనసు మాత్రం ఉల్లాసంగానే ఉంది’ అని పేర్కొంది. శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్’, చిరంజీవి, దర్శకుడు బాబీ సినిమాతో పాటు బాలకృష్ణతో ఓ చిత్రంలో నటిస్తున్నది.