Business

ఇళ్ల అమ్మకాల్లో జోష్‌

ఇళ్ల అమ్మకాల్లో జోష్‌

ఈ ఏడాది జనవరి-జూన్‌ నెలల మధ్య కాలంలో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 60 శాతం పెరిగి 1,58,705 యూనిట్లకు చేరుకున్నాయి. గడిచిన 9 సంవత్సరాల కాలంలో ఆరు నెలల కాలానికి నమోదైన గృహ విక్రయాల్లో ఇదే అత్యధిక వృద్ధి అని ప్రాపర్టీ కన్సల్టింగ్‌ కంపెనీ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా వెల్లడించింది. 2021లో ఇదే కాలంలో 99,416 ఇళ్లు అమ్ముడుపోయాయి. ‘ఇండియా రియల్‌ ఎస్టేట్‌: రెసిడెన్షియల్‌ అండ్‌ ఆఫీస్‌ మార్కెట్‌ హెచ్‌1 2022’ పేరుతో నైట్‌ ఫ్రాంక్‌ 17వ అర్ధ సంవత్సర నివే దికను బుధవారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2013 ప్రథమార్ధం లో అర్ధసంవత్సర కాలంలో గరిష్ఠ అమ్మకాల రికార్డు నమోదయింది. అప్పుడు ఏకంగా 1,85,577 ఇళ్ల అమ్మకాలు జరిగాయి. కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి పుంజు కున్న గృహ డిమాండ్‌, ప్రస్తుతం ధరాఘాతం తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ కొనసాగుతోందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్‌, ఎండీ శిశిర్‌ బైజాల్‌ అన్నారు. 3-9 శాతం పెరిగిన ధరలు ఈ ఏడాది మొదటి ఆరు నెలలకు దేశంలోని అన్ని నగరాల్లో ఇళ్ల ధరలు 3-9 శాతం మేర పెరిగాయి. అన్ని నగరాల మార్కెట్లలో ధరలు పెరగడం 2015 జూలై-డిసెంబరు తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి.

కొత్త ప్రాజెక్టుల్లో 56 శాతం వృద్ధి దేశంలోని 8 నగరాల్లో గడిచిన ఆరు నెలల్లో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం 56 శాతం పెరిగి మొత్తం 1,60,806 యూనిట్లకు చేరుకుంది. గత ఏడాదిలో ఇదే కాలానికి 80,566 కొత్త యూనిట్లు ప్రారంభమయ్యాయి. అమ్మకాలు మరింత పెరగడంతో గడిచిన ఆరు నెలల కాలానికి గృహ నిల్వలు 4,40,117 యూనిట్ల కు తగ్గాయి. ప్రస్తుత అమ్మకాల రేటును బట్టి చూస్తే, ఈ నిల్వలను పూర్తిగా తగ్గించుకునేందుకు బిల్డర్లకు దాదాపు 8 త్రైమాసికాలు (రెండేళ్లు) పట్టవచ్చని నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక పేర్కొంది. ఇళ్ల అమ్మకాల్లో జోష్‌ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ రెండింతలు ఈ ఏడాది ప్రథమార్ధానికి కార్యాలయ స్థలాల లీజులు రెండింతలకు పైగా పెరిగి 2.53 కోట్ల చదరపు అడుగు లుగా నమోదైంది. గత ఏడాదిలో ఇదే కాలానికి 1.225 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ ఒప్పందా లు జరిగాయి. మార్కెట్‌పై కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిందని, ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటోందనడానికిదే సంకేతమని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇన్నాళ్లు ఇంటి నుంచే పనిచేసిన ఉద్యోగులను కంపెనీలు క్రమంగా కార్యాల యాలకు రప్పిస్తున్నాయని, దాంతో ఆఫీసులకు హాజరవుతున్న ఉద్యోగుల వాటా గణనీయంగా పెరిగిందని నైట్‌ ఫ్రాంక్‌ చైర్మన్‌ అన్నారు. అలాగే, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో కొత్త నియామ కాలూ పెరిగాయన్నారు. కొత్తగా పూర్తయిన కార్యాలయ స్థలాల నిర్మాణం కూడా గణనీయంగా పెరిగిందని, గత ఆరు నెలల్లో 2.41 కోట్ల చదరపు అడుగులు స్థలం అందుబాటులోకి వచ్చిందన్నారు. సమీక్షా కాలానికి, అద్దె విలువ వృద్ధి అత్యధికంగా బెంగళూరులో 13 శాతం, పుణెలో 8 శాతంగా నమోదైంది. హైదరాబాద్‌, ముంబై, ఎన్‌సీఆర్‌లో సైతం అద్దెలు స్వల్పంగా పెరిగాయని నివేదిక వెల్లడించింది. చెన్నై, అహ్మదాబాద్‌, కోల్‌కతాలో మాత్రం అద్దెలు స్థిరంగా ఉన్నాయని తెలిపింది.