DailyDose

రాజ్యసభకు సంగీత దర్శకుడు ఇళయరాజా, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్..

రాజ్యసభకు సంగీత దర్శకుడు ఇళయరాజా, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్..

సంగీత దర్శకుడు ఇళయరాజా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయనతో పాటు దర్శకుడు రాజమౌళి తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్‌, లెజండరీ అథ్లెట్ పీటీ ఉష కూడా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో వెల్లడించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగాధికారం ప్రకారం.. సంగీత, సాహిత్య, వైజ్ఞానికత, ఆర్థిక రంగాలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను.. 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్‌ చేసే అధికారం ఉంది. ఆ కోటాలోనే ఆరేళ్ల కింద మోదీ ప్రభుత్వం సుబ్రమణ్యస్వామిని ఎగువసభకు పంపింది. ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఇళయరాజా ఇటీవల ‘అంబేద్కర్‌ – మోదీ’ పుస్తకానికి ముందుమాటలో ప్రధాని మోదీ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఆశయాలను నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలపై చర్చ జరిగిన నేపథ్యంలో తాజాగా ఆయనకు రాజ్యసభకు వెళ్లే అదృష్టం దక్కడం గమనార్హం.