తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను తాజాగా కొట్టిపారేసింది స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్. ఇటీవల తాను శారీరక సమస్యలతో బాధపడుతున్నానంటూ శ్రుతి హాసన్ ఇటీవల ఓ పోస్ట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యంపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఆరోగ్యం బాగోలేదని, ఆసుత్రిలో చికిత్స పొందుతుందని.. బెడ్‌పై క్రిటికల్ పోజిషన్‌లో ఉందంటూ సోషల్ మీడియాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తనపై వస్తున్న పుకార్లను తాజాగా శ్రుతి హాసన్ ఖండించింది. ఈ మేరకు ఆమె ఈ పుకార్లపై వివరణ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వీడియో షేర్ చేసింది. ఈ సందర్భంగా తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, షూటింగ్స్‌తో బిజీగా ఉన్నట్లు చెప్పింది.‘గత కొన్ని రోజులుగా నా ఆరోగ్యం బాగా లేదని, ఆసుపత్రిలో క్రిటికల్ కండీషన్‌లో ఉన్నానంటూ కొందరు ఆసత్య ప్రచారం చేస్తున్నారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. చూడండి నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో. నా డైలీ రోటీన్స్, రెగ్యులర్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. నాకు ఉంది పీసీఓడి(PCOD) సమస్య ఒక్కటే. అది మహిళల్లో ఉండే సాధారణ సమస్య. దానికే ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవల నేను పెట్టిన పోస్ట్‌ను కొంతమంది తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నేను చాలా ఆరోగ్యం ఉన్నాను’ అంటూ శ్రుతి చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం శ్రుతి హాసన్ సలార్ మూవీతో పాటు బాలకృష్ణ ఎన్‌బీకే 107 చిత్రాల్లో నటిస్తోంది.