Movies

కెన్యా అడ‌వుల్లో అత‌ను ప్ర‌పోజ్ చేశాడు

కెన్యా అడ‌వుల్లో అత‌ను ప్ర‌పోజ్ చేశాడు

బాలీవుడ్‌ నూతన జంట రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ ప్రేమకథ ఇప్పుడు వైరల్‌ అవుతున్నది. వీరిద్దరూ జట్టుకట్టి మూడునెలలు కావొస్తున్నా.. తమ పరిచయం పరిణయానికి ఎలా దారితీసిందో ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది ఆలియా. కాఫీ విత్‌ కరణ్‌ తాజా సీజన్‌ మొదటి ఎపిసోడ్‌లో ఆ సంగతులన్నీ వివరించింది.పెండ్లికి ముందు చాలా రోజులు డేటింగ్‌లో ఉన్న రణ్‌బీర్‌, ఆలియా.. బ్రహ్మాస్త్ర చిత్రం వర్క్‌షాప్‌లో మరింత దగ్గరయ్యారట. మరోసారి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒకరికొకరం అన్న విశ్వాసం ఏర్పడిందట. కరోనా పాండమిక్‌ తర్వాత ఇద్దరూ కెన్యాకు విహారానికి వెళ్లారు. అక్కడి మసైమార జాతీయ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో తమ చూపులు కలిశాయని ఆలియా తెలిపింది. వన విహారం మధ్యలో రణ్‌బీర్‌ తనకు ప్రపోజ్‌ చేశాడనీ, అవి నా జీవితంలో మరచిపోలేని క్షణాలని ఆమె చెప్పుకొచ్చింది. గత ఏప్రిల్‌లో పెండ్లిపీటలు ఎక్కిన ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇటీవలే ఈ విషయాన్ని ఆలియా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది.