విజయవాడలో జగన్నాథ రథయాత్ర అత్యంత భక్తిప్రపత్తుల మధ్య సందడిగా సాగింది. నేటి నుంచి మూడు రోజులపాటు ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జగన్నాథ రథయాత్ర నగరంలోని ప్రధాన వీధుల మీదుగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. హరి నామ సంకీర్తనలు.. భజనల మధ్య సుబద్ర, బలభద్ర సమేత జగన్నాథుడు నగర వీధుల్లో విహరించారు. వజ్ర మైదానం నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల పొడవునా ఈ రథోత్సవం సాగింది. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. రథంపై తరలివచ్చిన స్వామి, అమ్మవార్లకు భక్తులు పండ్లు, పుష్పాలు అందించి తమ భక్తి ని చాటుకున్నారు.