Movies

విలక్షణ నటుడు గుమ్మడి

విలక్షణ నటుడు  గుమ్మడి

గుమ్మడిగా సినీరంగం లో స్థిరపడిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు గుంటూరు జిల్లా , రావికంపాడు లో జులై 9, 1927 లో జన్మించారు.నటన పై మక్కువ తో రంగస్థలం పై నటించి పేరు తెచ్చుకున్నారు. అదృషదీపుడు అనే చిత్రం తో సినీరంగం లో అడుగుబెట్టారు. తోలి రోజుల్లో అవకాశం రాక ఇబ్బందిపడినా , అర్దాంగి చిత్రం తో స్థిరపడ్డారు. తోలి రోజుల్లో , వచ్చిన అవకాశాలు వదులుకోలేక వయసు కు మించిన పాత్రలలో నటించారు. దానితో నిర్మాత, దర్శకులు వారిని అలాటి పాత్రలకు పరిమితం చేసారు. హరిశ్చంద్ర సినిమాలో చిన్నపాటి స్పర్థ కలిగినా, అది ఎక్కువరోజులు నిలబడలేదు. ఎస్వీఆర్, గుమ్మడి కల్సి నటించిన తోలి చిత్రం జయసింహ. తరువాత వారిద్దరూ కలసి అనేక చిత్రాలలో నటించినా , ముఖ్యంగా భక్త పోతన, రహస్యం, జగత్కిలాడీలు చిత్రాలలో పోటీపడి నటించారు. నమ్మిన బంటు , పాండవ వనవాసం, పండంటి కాపురం , దసరాబుల్లోడు చిత్రాలలో వారి నటన ప్రేక్షకులను అలరించింది. గుమ్మడి గారి మహామంత్రి తిమ్మరసుకు రాష్ట్రపతి ప్రశంసా పత్రం లభించింది , రఘుపతి వెంకయ్య పురస్కారం, తెలుగు విశ్వయద్యాలయం వారి కళాప్రపూర్ణ బిరుదు తో పాటు, భారతదేశ ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. మాయాబజార్ సినిమాను రంగులలోకి మార్చినప్పుడు , ఆ సినిమా ను చూసి, నేను ఇందుకోసమే జీవించి వున్నానేమో అని సంబరపడ్డారు, మాయాబజార్ నటించిన నటులలో అప్పుడు జీవించి వున్నది ఒక్క గుమ్మడి గారే. చివరగా కాశి నాయన చిత్రం లో నటిస్తూ 2010 లో తనువు చాలించారు, సౌమ్యుడు, మంచి నటుడు అయిన గుమ్మడి గారి జయంతి కి వారి స్మృతులు గుర్తుకుతెచ్చుకుంటూ నివాళులు సమర్పిస్తున్నాము.