రాక్‌స్టార్’తో వెండితెరకు పరిచయమై, తన రాకింగ్ స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అమెరికన్ అందం.. నర్గీస్ ఫక్రీ. నాలుగు పదుల వయసులోనూ వన్నెతగ్గని మెరుపుతో నేటితరం హీరోయిన్లకు గట్టి పోటీనిస్తున్న ఫక్తు హాట్ బ్యూటీ.. ఫక్రీ! ‘హరిహర వీరమల్లు’తో టాలీవుడ్ ఎంట్రీతోనే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో జతకట్టిన నర్గీస్ ముచ్చట్లు..
ఏ వయసువారైనా వ్యాయామం తప్పనిసరి. వీలైతే యోగా కూడా చేయాలి. ఈ రెండూ దినచర్యలో భాగం చేసుకుంటే అరవైలలోనైనా ఆకర్షణీయంగా కనిపించొచ్చు.రోజూ రెండు గంటలపాటు వ్యాయామం చేస్తాను. జిమ్ నా జీవితంలో ఓ భాగం. రుచికరమైన భోజనాన్ని ఇష్టపడతాను. శుభ్రంగా పళ్లెం ఖాళీ చేయడమే కాదు.. నలుగురికీ వండి వడ్డిస్తాను కూడా. హైదరాబాదీ బిర్యానీ, చైనీస్ వంటకాలు ఇష్టంగా చేస్తాను. వంట, భోజనం, జిమ్.. ఏ పనిలో అయినా ఆనందాన్ని ఆస్వాదిస్తాను. సినిమాలు, సిరీస్‌లు, షోలు చూస్తుంటాను. పుస్తకాలూ చదువుతాను.ప్రతి సెలెబ్రిటీ స్టార్‌డమ్ వెనుకా లక్షలమంది అభిమానులుఉంటారు. వృత్తి ఉద్యోగాలు వదులుకుని, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, ఖర్చులను తగ్గించుకుని మరీ థియేటర్ వరకూ వచ్చి సినిమా చూస్తారు. అలాంటి అభిమానులు నాకూ ఉన్నారు. ఇది నా అదృష్టం. సామాజిక మాధ్యమాల ద్వారా నేనెప్పుడూ వాళ్లతో టచ్‌లో ఉంటాను.చిన్నప్పటినుంచీ టామ్‌బాయ్‌నే. అమ్మ కూడా అలానే ఉండేది. అందంగా కనపడాలనో, చక్కగా అలంకరించుకోవాలనో ఆరాటపడేది కాదు. సహజ సౌందర్యానికే ఆకర్షణ ఎక్కువని నమ్మేది. అదే నాకూ అలవాటైంది. మేకప్ అంటే నాకు గిట్టదు. రాత్రి పడుకునేముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి, కొద్దిగా టోనర్ పూస్తానంతే. రాత్రిపూట కూడా బ్రష్ చేస్తాను.త్వరలోనే ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌లో పాల్గొనబోతున్నా. ‘రోషనార’ పాత్ర గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. కానీ, ఆ పేరు వినడానికే చాలా కొత్తగా ఉంది. అందంగానూ ఉంది. పవన్ కల్యాణ్‌తో తెరమీద కనిపించే దృశ్యాన్ని ఎన్నిసార్లు ఊహించుకున్నానో. క్రిష్ దర్శకత్వంలో నేను నా పాత్రలో మరింత బాగా ఒదిగిపోగలననే నమ్మకం ఉంది.