శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు.కొలంబోలోని ప్రధాని నివాసం ముందు కొన్ని గంటలుగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది.‘‘ప్రధాని రణిల్ విక్రమ సింఘే వ్యక్తిగత నివాసంలోకి చొరబడిన నిరసనకారులు నిప్పంటించారు’’ అని ఆయన కార్యాలయ అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.తన పదవికి రాజీనామా చేసేందుకు విక్రమసింఘే అంగీకరించిన కొంతసేపటికే ఈ ఘటన జరిగింది. పదవికి రాజీనామా చేస్తానని రణిల్ స్వయంగా ట్వీట్ ద్వారా తెలిపారు.