Movies

పెళ్లిలో ఒక్క ఫొటో కూడా తీయలేదు!

పెళ్లిలో ఒక్క ఫొటో కూడా తీయలేదు!

స్టార్‌, సెలబ్రెటీల పెళ్లిళ్లంటే ఏ రేంజులో జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లికి వారం రోజు ముందు నుంచీ హడావుడి మొదలైపోతుంది. మెహందీ, సంగీత్‌ అంటూ బోలెడన్ని సెలబ్రేషన్లు. ప్రీ వెడ్డింగ్‌ షూట్లయితే మామూలే. వాటినే ఓ సినిమా రేంజ్‌లో తీస్తారు. అయితే… ఓ హీరోయిన్‌ పెళ్లికి ఒక్క ఫొటో కూడా తీయించుకోలేదట. ఈ విషయాన్ని తనే చెప్పింది. ఆ కథానాయిక ఎవరో కాదు.. రాధికా ఆప్టే. 2012లోనే బెనెడిక్ట్‌ అనే ఓ విదేశీయుడ్ని పెళ్లి చేసుకొంది రాధిక. నిజానికి ఎలాంటి హడావుడి లేకుండా స్నేహితుల సమక్షంలో సింపుల్‌గా పెళ్లి చేసేసుకొన్నార్ట. తమ స్నేహితుల్లో చాలామంది ఫొటోగ్రాఫర్లు ఉన్నా, పెళ్లి సమయానికి ఎవరికీ ఒక్క ఫొటో కూడా తీయాలనిపించలేదని, వాళ్లంతా అప్పుడు జల్సా చేసే మూడ్‌లో ఉన్నారని, దాంతో తమ పెళ్లి ఫొటోనే లేకుండా పోయిందని చెప్పుకొచ్చింది రాఽధిక. తన భర్తకు కూడా ఫొటోలకు ఫోజులివ్వడం అస్సలు రాదని, ఈ విషయంలో తామిద్దరూ ఒక్కటేనని, అందుకే ఇద్దరి ఫొటోలూ బయట పెద్దగా కనిపించవని చెప్పింది. అయితే.. పెళ్లయి పదేళ్లయిన సందర్భంగా తన భర్తతో ఉన్న ఓ ఫొటోని సోషల్‌ మీడియాలో వదిలింది రాధికా ఆప్టే. అది ఇప్పుడు వైరల్‌ అవుతోంది.