మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి డెబ్భై మూడవ జన్మదిన వేడుకలు సియాటెల్ నగరంలో వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ సియాటెల్ అండ్ పోర్ట్లాండ్ రీజియన్ టీం , దుష్యంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైఎస్సార్ అభిమానులు, సీఎం జగన్ అభిమానులు, వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ(సీటెల్ అండ్ పోర్ట్లాండ్) టీం మునీశ్వర్‌రెడ్డి, ప్రకాష్ కొండూరు, అనిల్‌రెడ్డి, పృథ్వీరాజ్, సువీన్‌రెడ్డి, జయంద్రారెడ్డి, అజయ్‌రెడ్డి రవీందర్‌రెడ్డి, చంద్రసేన, సునీల్ బలభద్ర, కృష్ణారెడ్డి, బాలరెడ్డి, మధురెడ్డి, శివ వెదురుపర్తి, సుమన్‌రెడ్డి, ప్రణీత్ మరియు వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి వైఎస్సార్ మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా దుష్యంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ తన పరిపాలనలో ప్రవేశపెట్టిన పథకాలైన వైఎస్సార్ జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటి పథకాలతో ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారని, ఆ మహానేత ఈరోజు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎప్పటికీ నిలిచిపోతాయని స్మరించుకున్నారు. ప్రకాశ్ కొండూరు మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్‌తో తనకున్న మొదటి పరిచయాన్ని నెమరువేసుకున్నారు.