DailyDose

21న హాజరుకావాలని సోనియాగాంధీకి ఈడీ సమన్లు

21న హాజరుకావాలని సోనియాగాంధీకి  ఈడీ సమన్లు

నేషనల్ హెరాల్డ్ కేసు లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు తాజాగా సమన్లు పంపింది. ఈనెల 21వ తేదీన విచారణకు రావాలని ఆదేశించింది. విచారణ ముందుకు హాజరుకావాలని సోనియాగాంధీకి ఈడీ ఇచ్చిన నాలుగు వారాల గడువు ఈనెల 22తో ముగియనుంది. ప్రతిపక్షాలు సమన్ల వాయిదా కోరుతూ గత జూన్‌లో సోనియాగాంధీ చేసిన లిఖిత పూర్వక విజ్ఞప్తిని ఈడీ అంగీకరించింది. కోవిడ్ నుంచి, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకునేంత వరకూ కొద్ది వారాల పాటు తన హాజరును వాయిదా వేయాలని సోనియాగాంధీ కోరారు. జూన్ 12 కోవిడ్ అనంతర సమస్యలతో సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ అదే నెల 18న డిశ్చార్జి అయ్యారు. దీనికి ముందు, మనీ లాండరింగ్ కేసులో జూన్ 8న తమ ముందు హాజరుకావాలని ఈడీ సమన్లు పంపింది. ఈ క్రమంలో జూన్ 1న సోనియాగాంధీకి కోవిడ్ పాజిటివ్ రావడంతో ఈడీని మరింత గడువు కోరారు.